News in images: చిత్రం చెప్పే విశేషాలు (24-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 24 May 2024 12:38 IST
1/22
ఓ రైతు సూర్యుడి ఎండ నుంచి రక్షణగా శిరస్త్రాణాన్ని వినియోగించడం విశేషం. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతు శివాజి వడ్లు ఆరబెట్టే పనిలో ఎండ నుంచి రక్షణకు శిరస్త్రాణాన్ని పెట్టుకున్నారు.

2/22
గ్రామాలు, పట్టణాలు ఎక్కడ వడ్లు ఆరబెట్టినా కోతులు గుంపులుగా దాడిచేసి ఆరగిస్తున్నాయి. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌  పట్టణంలోని ఓ రైసు మిల్లు ఆవరణలో ఆరబెట్టిన ధాన్యాన్ని మర్కటాలు ఆరగిస్తుండగా న్యూస్‌టుడే క్లిక్‌ మనిపించింది. 

3/22
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో  కొండ కనకయ్య అనే వ్యాపారి తన ఇంటి ముందు మూగజీవాల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం విపరీతమైన ఎండతో విలవిలలాడిన ఓ శునకం తొట్టెలో నీటిని గమనించి ఇలా కూర్చొని ఉపశమనం పొందింది. 

4/22
వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మహ్మద్‌హుస్సేన్‌పల్లి ఊర చెరువులో గురువారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. మూడు అడుగుల పొడవు, 20 కిలోల బరువు ఉందని మత్స్యకారుడు శివ తెలిపారు. 

5/22
హైదరాబాద్‌ నగరంలో తాగునీటి కష్టాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి.  మాదాపూర్‌ ఖానామెట్‌ వద్ద మిట్ట మధ్యాహ్నం గొడుగులు వేసుకుని మరీ సన్నటి ధారతో వస్తున్న మంచినీటిని మోటార్ల సాయంతో లాగుతూ పైపులు ద్వారా పట్టుకుంటున్న స్థానికులు ఇలా కనిపించారు. 

6/22
నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద కృష్ణాతీరంలో సహజ సిద్ధంగా పెరిగిన మొక్కలు ఇలా అందంగా విరబూశాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో పెరిగే ఈ ఔషధ మొక్క శాస్త్రీయ నామం ‘క్లియోమ్‌ చెల్లిడోని’ అని, తెలుగులో అడవి ఆవాల మొక్కగా పిలుస్తారు.

7/22
విజయనగరం: కేరళలో ఇటీవల జరిగిన మిస్‌ఇండియా ప్రీ-టీన్‌ పోటీల్లో గజపతినగరానికి చెందిన గర్భాం ప్రీతి పట్నాయక్‌ విజేతగా నిలిచారు. టాలెంట్, డ్రెస్సింగ్, నృత్యం విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచారు.

8/22
తమిళనాడు: కొడైకెనాల్‌ బ్రయాంట్‌ పార్క్‌లో కొనసాగుతున్న పుష్ప ప్రదర్శన, వేసవి ఉత్సవంలో భాగంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకున్న పోటీలను ఆర్డీవో శివరామన్‌ ప్రారంభించారు.

9/22
కర్నూలు: సప్తనదీ సంగమ క్షేత్రంలో విదేశీ పక్షులైన ఫ్లెమింగోలు పది రోజులుగా తిరుగుతూ సందడి చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పక్షులతో పాటు కొంగలు, డక్‌బిల్‌ బాతులు, ఇతర పక్షులు కనువిందు చేస్తున్నాయి.

10/22
చిత్తూరు: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగియ నుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండానే సర్వదర్శనం చేసుకునేందుకు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు.

11/22
విశాఖపట్నం: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జెర్బరా పూలు ఆకట్టుకుంటున్నాయి.శాస్త్రవేత్తలు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లుగా గ్లాడియోలస్, లిల్లియం, చైనాఆస్టర్, జెర్బరా, బంతి, తులిప్‌ వంటి వివిధ రకాల పూలు సాగు చేస్తున్నారు.

12/22
పువ్వుల్లోని మకరందాన్ని జుర్రుకోవాల్సిన తేనెటీగలు మంచినీటి కోసం అల్లాడిపోయాయి. ఏలూరు శాంతినగర్‌ లోని నీటిశుద్ధికేంద్రం ఆవరణలోని కొళాయి చెంత ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన చిత్రాలివి.

13/22
హైదరాబాద్‌: బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని గురువారం హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహం వద్ద బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  పబ్లిక్‌గార్డెన్‌లో తథాగతుని పవిత్ర అవశేషాలతో(ధాతువులు) ఏర్పాటు చేసిన మందిరాన్ని పలువురు సందర్శించారు.

14/22
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలోని అభయారణ్యంలో 140 జింకలు పర్యాటకులను అలరిస్తున్నాయి.1974లో ఎనిమిది జింకలతో అభయారణ్యం ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు జింకల సంతతి 140కి చేరింది.

15/22
నెల్లూరు: సీతారామపురం గ్రామ పంచాయతీ పండ్రంగి పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి.ఈ సందర్భంగా విఠలేశ్వరస్వామి పార్వేటోత్సవం కన్నులపండువగా సాగింది.ఆలయం వద్ద చిన్నారుల పండరిభజన ఆకట్టుకుంది.

16/22
చిత్తూరు: తిరపతి శ్రీ కపిలేశ్వరాలయంలో గురువారం పుష్పయాగం వైభవంగా జరిగింది.ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం జరిగింది.

17/22
చిత్తూరు: శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి వైశాఖ పౌర్ణమి గరుడ వాహనసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

18/22
శ్రీకాకుళం: మండలం అక్కుపల్లి శివసాగర తీరంలో గురువారం 100 మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్లింది. స్థానిక మత్స్యకారులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు పర్యాటకులు సముద్ర స్నానం చేయకుండా వెనుదిరిగారు.

19/22
విశాఖపట్నం: వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ గురువారం ఉదయం అనకాపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచు కమ్మేసింది. దీంతో రహదారులు, సమీప భవనాలు కూడా కనిపించలేదు. సూర్యుడు ఉన్నా మంచు ముసుగు తొలగలేదు.

20/22
వరంగల్‌: ములుగు జిల్లా కేంద్రం గొల్లవాడలోని ఆగయ్య అనే వ్యక్తి ఇంటి ముందు ఒక మొదలుతో రెండు చెట్లు ఉన్నాయి. ఒకటి రావి, మరొకటి సుబాబుల్‌ చెట్టు ఉండటంతో.. అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

21/22
మహబూబ్‌నగర్‌: రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తుంగభద్ర నదిలో గంగ పూజలు నిర్వహిస్తున్న మహిళలను చిత్రంలో చూడొచ్చు.

22/22
హైదరాబాద్‌: మూసాపేట భరత్‌నగర్‌ పైవంతెన మధ్యలో ఓ వాటర్‌ ట్యాంకర్‌ టైరు పేలడంతో వాహనం అక్కడే ఆగిపోయింది. దీంతో వంతెన మధ్య నుంచి వైజంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ భారీగా నిలిచింది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు