News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (26-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 26 May 2024 09:58 IST
1/20
ఏడాదిలో మే నెలలో మాత్రమే మే పుష్పాలు వికసిస్తాయి. చిత్తూరు జిల్లాలోని  కల్లూరు మండలంలోని మంగళంపేట గ్రామానికి చెందిన మునిరాజ ఇంట్లో మే పుష్పాలు వికసించాయి. మే పుష్పాలతో స్వీయచిత్రాలు దిగి స్థానికులు మురిసిపోతున్నారు.  

2/20
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పెద్దదూగాం సమీపంలో తాటిచెట్లపై కొంగలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఉదయం మేతకు తిరిగి అలసిపోయిన పక్షులు ఎండ తీవ్రతకు మధ్యాహ్న సమయంలో ఒక్కో చెట్టుపై ఒక్కో పక్షి సేదతీరుతున్న దృశ్యం ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది. 

3/20
 హనుమకొండ జిల్లా  కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ శివారులోని చిన్న చెరువులో మత్స్యకారులు గత వారం రోజులుగా చేపలు పడుతున్నారు. వలకు సుమారు 13 కిలోల బరువున్న బొచ్చె రకం చేప పడింది. దాన్ని ఒడ్డుకు తెచ్చాక పలువురు చరవాణుల్లో బంధించారు.

4/20
హనుమకొండ పద్మాక్షి కాలనీలోని శ్రీహనుమద్గిరి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. 408 కిలోల లడ్డూ ప్రసాదం, కృత్రిమ మంచు పొగతో స్వామి వారికి మహా నైవేద్యం సమర్పించారు. 

5/20
వేసవి వచ్చిందంటే ఉభయ రాష్ట్రాల నుంచి  రైతులు ఆమ్‌చూర్‌ను నిజామాబాద్‌ మార్కెట్‌ నుంచి ఉత్తరాదితో పాటు, విదేశాలకు ఎగుమతి చేస్తారు. 361 క్వింటాళ్ల పంటకు గరిష్ఠంగా క్వింటాకు రూ.35,500, సగటు ధర రూ.23 వేలు, అత్యల్పంగా రూ. 9 వేలు పలికింది. ఉత్తర భారతంలో చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఆమ్‌చూర్‌ను వినియోగిస్తారు. 

6/20
సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండల సరిహద్దు ప్రాంతాల్లో ఎర్రరాయి దందా జోరుగా సాగుతోంది.  కోహీర్‌ మండలంలోని పైడిగుమ్మల్, పీచేర్యాగడి గ్రామాల సమీపంలోని భూముల్లో మట్టిని తొలగించి ఎర్రరాయి వెలికి తీస్తున్నారు. యంత్రాల సాయంతో కావాల్సిన ఆకారంలో రాయిని తీర్చిదిద్ది ట్రాక్టర్లు, లారీల ద్వారా  తరలిస్తున్నారు.

7/20
చింత చిగురుకు విపణిలో డిమాండ్‌ పెరిగింది. మార్కెట్‌లో కిలో ధర రూ.600 వరకు పలుకుతోంది. అధిక ధరల నేపథ్యంలో వినియోగదారులు 50 నుంచి 100 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఏటా వేసవి చివరిలో చింతచెట్లు చిగురించటంతో లేత ఆకులను కోసి విక్రయిస్తుంటారు.

8/20
కొన్ని రోజుల పాటు కాస్త తగ్గిన సూర్యుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ఉపశమనం కోసం నగరవాసులు ఇలా రహదారుల పక్కన విక్రయిస్తున్న పుదీనా జ్యూస్, నిమ్మరసం, రాగిజావ వంటి వాటితో ఉపశమనం పొందుతున్నారు.

9/20
కాకినాడలో ప్రధాన పైపులైను మరమ్మతుల కోసం మూడు రోజుల నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో రాజీవ్‌గృహ సముదాయాలు, టిడ్కో గృహాలు, దుమ్ములపేట, పర్లోపేట, సంజయ్‌నగర్, అయోధ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో తాగునీటి జనం ముప్పుతిప్పలు పడుతున్నారు. ఒక్క ట్యాంకర్‌ రాగానే.. వందలమంది బిందెలతో వస్తున్నారు. 

10/20
అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్‌ అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె చేతి వేళ్లకు 1,306.58 సెం.మీ (42.87 అడుగుల) పొడవైన గోళ్లు ఉన్నట్లు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు తెలిపారు.

11/20
విశాఖ నగరంలో పక్షుల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారు తమ వంతుగా ఓ ప్రయత్నం చేస్తున్నారు. పక్షులకు ప్రత్యేకంగా తయారు చేస్తున్న కొబ్బరి పీచు గూళ్లను కొనుగోలు చేసి తమ ఇళ్లల్లో, పెరట్లలో అమర్చుతున్నారు. కొందరైతే తమ అభిరుచికి తగినట్లు వివిధ రూపాల్లో గూళ్లు తయారు చేయించుకుంటున్నారు.

12/20
ఖమ్మం: ముదిగొండ మండలంలోని పలు రహదారుల్లో ఎర్రటి పూలతో గుల్‌మెహర్‌ చెట్లు కనువిందు చేస్తున్నాయి. ముదిగొండ -సువర్ణాపురం మార్గంలో కన్పించిన దృశ్యమిది.

13/20
అనంతపురం: శ్రీసత్యసాయి, తమిళ ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలు తెలియజేసే ఘట్టాలను కళ్లకు కట్టినట్లుగా చిన్నారులు నృత రూపకం ద్వారా అద్భుతంగా ప్రదర్శించారు.సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య కార్యక్రమాలను ప్రదర్శించారు.

14/20
హైదరాబాద్‌: శనివారం రవీంద్రభారతిలో భారతవేద ఆర్ట్స్‌ అకాడమి ఆధ్వర్యంలో కూచిపూడి, యక్షగాన సంప్రదాయంలో కళాకారులు ప్రదర్శించిన ‘గోదా కల్యాణం’ నృత్య రూపకం ఆకట్టుకుంది.

15/20
హైదరాబాద్‌: ఉప్పల్‌లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శనివారం శిల్పారామంలో నృత్య అశ్రిత కూచిపూడి డ్యాన్స్‌ అకాడమీ గురువు అశ్రిత కిషోరె శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

16/20
ప్రకాశం: మద్దిపాడు మండలంలోని మల్లవరం భక్తులతో శనివారం కిటకిటలాడింది. కొండపై కొలువైన కోనేటి రాయుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు.

17/20
కడప: జమ్మలమడుగులో నిర్వహిస్తున్న నారాపుర వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మోహినీ అవతారంలో స్వామి దర్శనమిచ్చారు. రాత్రి గరుడ వాహనంపై స్వామిని ఊరేగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళల కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

18/20
అనంతపురం: పట్టణంలోని మెయిన్‌బజార్‌లో ఉన్న పేట వెంకటరమణస్వామి దేవాలయంలో శనివారం స్వామి యోగా నరసింహస్వామిగా దర్శనమిచ్చారు. అనంతరం పూల పల్లకిలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడి భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రాకారోత్సవం చేశారు.

19/20
ఆదిలాబాద్‌: ఉట్నూరు మండలం గోపాయి చెరువు వద్ద శనివారం మధ్యాహ్నం ఒడ్డున గడ్డపై ఒకే చోట నిశ్శబ్దంగా నిల్చున్నాయి. రోడ్డు గుండా వెళ్లే ప్రజలు మండే ఎండలో గుంపులుగా కనిపిస్తున్న కొంగలను చూస్తూ కొంగ జపం చేపల కోసమే అనుకుంటూ వెళ్లారు.

20/20
మెదక్‌: సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో ఇల్లింతల మాణయ్య, సంగయ్య 50 ఏళ్ల కిందట నాటి సంరక్షించిన రావి వృక్షాన్ని కుటుంబీకులు పదిలంగా కాపాడుతున్నారు. వారి తీరు స్ఫూర్తిదాయకంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు.

మరిన్ని