News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (27-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 27 May 2024 11:08 IST
1/17
హైదరాబాద్‌ నగరం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో కనిపించిన చిత్రమిది. ఇక్కడి శిల్పకళ విభాగం విద్యార్థులు స్వయంగా రూపొందించిన ఈ చిన్నారుల బొమ్మల్ని ఎలాంటి ఆలనాపాలన లేకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు.

2/17
వేసవిలో చెట్లు భాష్పోత్సేకం ద్వారా నీటి వృథాను అరికట్టడానికి ఆకురాలుస్తాయి. తర్వాత కొత్తగా చిగురిస్తాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలోని డేడ్రా గ్రామ సమీపంలో అడవుల్లో పక్కపక్కనే రెండు రంగుల్లో చెట్లు అలరిస్తున్నాయి.

3/17
రెమాల్‌ తపాను తీవ్రరూపం దాల్చుతుందని ఐఎండీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక పశ్చిమ తీరంలో అలజడి నెలకొంది. పరిసర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అలలు పోటెత్తుతున్నాయి.

4/17
ఒకపక్క అడపాదడపా వర్షాలు.. మరోపక్క రోహిణికార్తె ఎండలు.. రెండు, మూడు ట్రిప్పులకే ఆటో డ్రైవర్లు అలసిపోతున్నారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ కారిడార్‌ - టీహబ్‌ మార్గంలో ఆటోలు నిలిపి నడకదారిపై  నిద్రిస్తూ కనిపించారు.

5/17
ప్రధాన రహదారుల్లోని ఎండిపోయిన చెట్లను తొలగించక పోవడంతో ఈదురు గాలులకు అవి కూలి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనదారులతో రద్దీగా ఉండే ప్రదేశాల్లోని ఇలాంటి చెట్లను తొలగించాల్సి ఉంది. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌ పక్కనే ఇలాంటి చెట్టు మోడు బారి ప్రమాదకరంగా మారింది.

6/17
వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీకి చెందిన రైతు కలప్ప వేసవి దుక్కి దున్ని సిద్ధం చేసి ఉంచారు.  వారం రోజుల క్రితం పత్తి విత్తులు తెచ్చి పొలంలో వేయించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు,  గొట్టపు బావి నుంచి నీటి తడి పెట్టారు. 

7/17
తమిళనాడు: నామక్కల్‌ జిల్లాలో ఉన్న కొండ మార్గంలో 70 సూది మలుపులు ఉన్నందున వాహనచోదకులకు సవాలుగా మారింది. కొన్ని మలుపుల్లో అనుభవం ఉన్న చోదకులు మాత్రమే నడపగలరు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా కొల్లిమలై కొండ మార్గం నిలిచింది.

8/17
హైదరాబాద్‌: సచివాలయం వద్ద అమరవీరుల స్మృతి చిహ్నం ముందున్న వృక్షాలు పచ్చదనంతో కళకలాడుతున్నాయి. చెట్ల మధ్య నుంచి దీపం ఆకారంలోని చిహ్నం నగరవాసులను ఆకట్టుకుంటోంది.

9/17
నెల్లూరు: మైపాడు బీచ్‌కు వెళ్లి ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడుపుతున్నారు. తల్లిదండ్రులతో కలిసి వెళ్లి సముద్రం నీటిలో మునుగుతూ కేరింతలు కొడుతున్నారు. ఉదయాన్నే వెళ్లి రోజంతా హాయిగా గడిపి సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటున్నారు.

10/17
నిజామాబాద్‌: పిట్లం మండలం సిద్దాపూర్‌ ఊర చెరువులో చెరువంతా కలువలు విరగబూసి చూపరులకు కనువిందు చేస్తున్నాయి. పిట్లం-బాన్సువాడ ప్రధాన రహదారిని ఆనుకొని తటాకం ఉండటంతో ప్రయాణికులు, ప్రకృతి ప్రేమికులు వాటిని చరవాణుల్లో బంధిస్తున్నారు.

11/17
మెదక్‌ పట్టణం అవుసులపల్లికి చెందిన పోతాయిపల్లి సిద్ధయ్య. బాన్సువాడకు వెళ్లినపుడు ఆయన గమనించి తన ఇంటికీ సాధారణ పెంకులు తీసి.. ఇనుప రాడ్‌లు ఏర్పాటు చేశారు. ఈదురు గాలులు వీచినా, పైకప్పును కోతులు తొలగించకుండా కొన్నేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటదని చెప్పారు.

12/17
మెదక్‌: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన మంద హరిప్రసాద్‌ ఏర్పాటు చేసిన ఇంకుడుగుంత ఇది. తన ఇంటి ఆవరణలో నిర్మించి అందంగా చేశారు. ఇంకుడుగుంతల ఏర్పాటుకు ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి అవగాహన కల్పించేందుకే ఆకట్టుకునేలా చేశానన్నారు.

13/17
చిత్తూరు: తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం వచ్చే మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. పెద్దఎత్తున పొంగళ్లు సమర్పించారు.

14/17
విశాఖపట్నం: పట్టణంలోని లక్ష్మీదేవిపేటలో కనకదుర్గ అమ్మవారికి కేజీన్నర బరువున్న వెండి కిరీటాన్ని  గూడ్సురోడ్డుకు చెందిన బియ్యం వ్యాపారి మడపల శ్రీనివాస్‌ దంపతులు అందించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అలంకరించారు.

15/17
విశాఖపట్నం: పాపికొండల విహారయాత్రకు పర్యటకుల రద్దీ కొనసాగుతోంది.దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఆదివారం పది బోట్లపై 653 మంది, పోచవరం రేవు నుంచి 673 మంది పర్యటకులతో కళకళలాడాయి.

16/17
ఏలూరు: పేరుపాలెంసౌత్, కేపీపాలెంసౌత్‌ గ్రామాల్లోని బీచ్‌ ల్లో ఆదివారం పర్యాటకులతో సందడి నెలకొంది. పలు ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. తీరంలోని కొబ్బరితోటల్లో సేదతీరారు. పలువురు సముద్ర ఒడ్డున ఇసుకతిన్నెలపై ఆటపాటలతో గడిపారు.

17/17
విశాఖపట్నం: రుషికొండ బీచ్‌కు ఆదివారం సందర్శకులు పోటెత్తారు. టూరిజం బోటింగ్‌ కేంద్రం, మత్స్యరాశుల పార్కు, శివాలయం, అటవీ, క్రీడాభివృద్ధి శాఖల స్థలాలు, ఇసుక తిన్నెలు ఇతరత్రా ఆహ్లాదకర ప్రదేశాల్లో ఆనందోత్సాహాల నడుమ ఉల్లాసంగా...ఉత్సాహంగా గడిపారు.

Tags :

మరిన్ని