News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (28-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 28 May 2024 03:48 IST
1/10
నిజామాబాద్‌: బర్దీపూర్‌ శివారు బైపాస్‌ రోడ్డులోని ఓ పొలంలో సోమవారం దుక్కి దున్నే సమయంలో కొంగలు ట్రాక్టరు వెంట నడుస్తూ పురుగులను తింటుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

2/10
విశాఖపట్నం: రాజవొమ్మంగిలోని పి.వెంకటేశ్వరరావు ఇంటి పెరట్లో పెంచుతున్న తీగ జాతికి చెందిన రాఖీ (కృష్ణ) పాదుకు సోమవారం ఏకంగా 457 పుష్పాలు పూశాయి.అయిదేళ్లుగా పెంచుతున్న ఈ మొక్కకు రెండు రోజుల వ్యవధిలో విపరీతంగా పుష్పాలు పూయడంతో వెంకటేశ్వరరావు, ఉమా మహేశ్వరి దంపతుల ఆనందానికి అవధుల్లేవు.

3/10
ఏలూరు: కందుకూరి 105వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. కందుకూరి జీవిత విశేషాలను తెలియజేస్తూ చిన్నారులు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది.

4/10
విశాఖపట్నం: నగరంలో లిటిల్‌ ఏంజిల్స్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పూర్వి రజాక్‌కు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కింది. పొడిమట్టిని ఉపయోగించి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాల సూక్ష్మ నమూనాలను ఈ విద్యార్థిని తయారు చేసింది.

5/10
కర్నూలు: మండలం భాగ్యనగర్‌ గ్రామానికి చెందిన ఆనందరావు రక్షణాత్మక చర్యలు చేపట్టారు. ఆ చెట్టుకు మొత్తంగా దోమతెరను చేయడంతో సత్ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు.

6/10
శ్రీకాకుళం: అక్కుపల్లి తీరంలో సుమారు 70 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. దీంతో మత్స్యకారులు చేపల వేట సామగ్రి భద్రపరిచేందుకు అవస్థలు పడుతున్నారు.

7/10
తమిళనాడు: తిరుత్తణి మాపోసీ నగర్‌కు చెందిన కొళ్లాపురి అనే వ్యక్తి కొబ్బరికాయ ఓ కొనుగోలుదారుడికి ఓ కాయ పగులగొట్టి ఇచ్చాడు. అందులో రెండు దబ్బలు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ వింత కాయను చూడటానికి ఆ ప్రాంతవాసులు క్యూ కడుతున్నారు.

8/10
తమిళనాడు: మదురై కూడలళగర్‌ పెరుమాళ్‌ ఆలయంలో వైఖాసి మాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

9/10
చిత్తూరు: మండల కేంద్రమైన ఐరాలలో వెలసిన పాలేటి గంగమ్మ జాతర మంగళ, బుధవారాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నిర్వాహకులు జాతర ఏర్పాట్లు భారీ ఎత్తున చేపట్టారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపాలంకరణ ఏర్పాటు చేశారు.

10/10
విశాఖపట్నం: స్థానిక శ్రీ బాల వినాయక స్వామి ఆలయం వద్ద వెయ్యి దీపాలతో రూపుదిద్దిన ఆంజనేయస్వామి ఆకృతి భక్తులను విశేషంగా అలరించింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని చేపట్టిన ప్రత్యేక పూజల్లో భాగంగా ఈ సహస్ర దీపాలంకరణ నిర్వహించారు.

Tags :

మరిన్ని