News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (29-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 29 May 2024 11:30 IST
1/18
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో  కోనాం, అపోలో, చందువ చేపల్ని పెద్దఎత్తున మత్స్యకారులు విక్రయానికి తెచ్చారు. వేట నిషేధ సమయంలో చిన్న పడవల్లోనే ఎప్పుడో ఒకసారి ఇంత పెద్ద చేపలు పడతాయని మత్స్యకారులు తెలిపారు.

2/18
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ వైపు కదులుతున్నా, ప్రయాణికులు ఎక్కుతున్నారు. జనరల్‌బోగీలు ప్రయాణికులు నిలబడేందుకు కూడా స్థలం లేక ఇలా ఇబ్బందులు పడుతున్నారు. 

3/18
కర్ణాటకలోని చిక్‌మగళూరు ప్రాంతాల్లో మామిడి పండ్లు విరగ్గాశాయి.  పసందైన ఓ మామిడి పండును ఉడత లాగిస్తూ న్యూస్‌టుడే కెమెరాకు చిక్కింది.

4/18
నిజామాబాద్‌ చుట్టు పక్కల గ్రామాల్లో ఓ వృద్ధుడు పనికి రాని ఇనుప వస్తువులను కొనుగోలు చేసి ఇలా మోతాదుకు మించి తన ద్విచక్ర వాహనంపై కష్టంగా తీసుకెళ్తుండగా.. ‘ఈనాడు’ క్లిక్‌మనిపించింది.

5/18
అకాల వర్షాలు కురుస్తున్న కాలం.. ఇళ్లు మారుతున్న ఓ కుటుంబం వానొస్తే తడవకుండా గృహ సామగ్రికి టార్పాలిన్‌ కప్పి గూడ్సు ఆటోలో వెళుతున్న ఈ దృశ్యం హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డుపై కనిపించింది.

6/18
ఖమ్మం జిల్లా పెనుబల్లి బీసీ కాలనీలోని ఓ అంతర్గత రహదారిలో సిమెంట్‌ రోడ్డు వేశారు. ఆ రోడ్డులో మరమ్మతులకు గురైన చేతిపంపునుతొలగించలేదు. ఇప్పుడు మరమ్మతులు చేసినా.. ఆ పంపు నుంచి నీళ్లు పట్టుకోలేని పరిస్థితి.

7/18
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వైఎస్‌ఆర్‌ జిల్లాలోని గండికోటలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎర్రకోనేరు ఎండిపోయింది. 900 ఏళ్ల చరిత్ర కలిగిన గండికోటలో ఈ కోనేరూ అంతే పురాతనమైంది. తీవ్ర వర్షాభావంతో నీరు లేక కోనేరు ఎండిపోయింది.

8/18
విశాఖపట్నం తీరంలో  సముద్రపు అలల ఉద్ధృతి   ఎక్కువగా కనిపించింది. ఆర్కే బీచ్‌లో సుమారు రెండు వందల  అడుగుల మేర కెరటాలు ముందుకొచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగరం ఇలా ‘అల’జడి సృష్టించింది.

9/18
హైదరాబాద్‌ కేబీఆర్‌ ఉద్యానం ఎదుట ‘స్టాప్‌ ఈటింగ్‌ టు ఎక్స్‌టింక్షన్‌: గో వీగన్‌’ పేరుతో అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు డైనోసార్ల వేషధారణలో.. జీవహింస చేసుకుంటూ పోతే భూమిపై  ఏ జంతువు మిగలదని, శాకాహారమే శ్రేయస్కరమని అవగాహన కల్పించారు.

10/18
వరంగల్‌: హనుమకొండలోని జవహర్‌లాల్‌  నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరం ఇది. ఇక్కడ బాస్కెట్‌ బాల్‌లో 60 మంది బాలబాలికలు శిక్షణ పొందుతున్నారు. బంతిని గోల్‌లోకి ఎలా ఎగురవేయాలో   కోచ్‌ ప్రశాంత్‌ వారికి సాధన చేయిస్తున్న దృశ్యమిది.

11/18
హైదరాబాద్‌: జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న నాలుగో ఏడాది విద్యార్థులకు మంగళవారంతో తరగతులు ముగిశాయి. విద్యార్థులంతా కలిసి స్నాతకోత్సవం రోజు తరహాలో కోట్లు వేసుకొని, టోపీలు పెట్టుకొని ఫొటోలు దిగి సందడి చేశారు.

12/18
విశాఖపట్నం: పేటకు చెందిన చిత్రకారుడు గీచిన చంద్రబాబునాయుడు చిత్రం ఆకట్టుకుంటోంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ మిలీనియం’ అంటూ చిత్రకారుడు పి.లవరాజు అద్భుతంగా తీర్చిదిద్దారు. జీవకళ ఉట్టిపడేలా పెన్‌ స్క్రిబ్లింగ్‌ విధానంలో బాల్‌ పాయింట్‌ పెన్నుతో చక్కగా చిత్రీకరించారు.

13/18
విజయనగరం: ఎస్‌.కోట పట్టణంలో దారగంగమ్మ జాతరతో మంగళవారం సాయంత్రం సందడి నెలకొంది. అమ్మవారి అనుపోత్సవం వైభవంగా సాగింది. కేరళ వాయిద్యం, సన్నాయి మేళం, తాంబూలం, తీన్మార్‌ మోత మోగించాయి. వేషధారణలు అలరించాయి.

14/18
మంగళవారం శ్రీకాకుళం నగరంలో ముత్యాలమ్మ తల్లి, ఎల్‌.ఎన్‌.పేటలో బంగారమ్మ తల్లి ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

15/18
అనంతపురం: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి మహోత్సవాలను మంగళవారం నిర్వహించారు. సాయంత్రం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి తులసీదళాలతో లక్షార్చన నిర్వహించారు.

16/18
మెదక్‌: ప్రకృతి స్థితిని బట్టి నెమలి పులకిస్తే చూపరులకు కనువిందే. సిద్దిపేట శివారులోని కొండపాక మండలం మర్పడ్గ ఆక్సిజన్‌ ఉద్యానంలో వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి.

17/18
ఆదిలాబాద్‌: మండలంలోని చప్రాల పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం చిట్టడవిని తలపిస్తోంది. వివిధ రకాల చెట్లతో చల్లదనంతో పాటు విరబూసిన పువ్వులతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

18/18
హైదరాబాద్‌: చెరుకు రసం బండి లాగుతున్న ఈ యువతి పేరు రూప. మలక్‌పేటలో ఐటీఐ చదువుతోంది. తండ్రి మేస్త్రీ. ఖాళీ సమయంలో ఇలా కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది.  ఘట్‌కేసర్‌ రోడ్డులో సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ పాఠాలు వింటూ బండి లాగుతూ కనిపించింది.

Tags :

మరిన్ని