News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (30-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 30 May 2024 09:45 IST
1/17
అపార జలసంపదతో కళకళలాడే సోమశిల ముంపు ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. జలసవ్వడి లేక కళావిహీనంగా మారింది. గతేడాది వరకు మండు వేసవిలోనూ మత్స్యసిరులతో సందడి చేసి ఆహ్లాదం పంచిన సుందర రమణీయ ప్రాంతం వెలవెలబోయింది.

2/17
బెంగళూరులో తయారైన విద్యుత్తు ఇంజిన్‌ ఇది. పంజాబ్‌లో దీని సేవలు  వినియోగించుకునేందుకు పంజాబ్‌కు  తరలిస్తుండగా.. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద ఇలా ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.

3/17
తెలంగాణ రాష్ట్ర గీతం స్వరకల్పనపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అందెశ్రీ, కీరవాణిలతో  సీఎం రేవంత్‌రెడ్డి  భేటీ అయ్యారు. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఉన్నారు.  

4/17
ఆటో ట్రాలీలో పరిమితికి మించి డేకరేషన్‌ సామగ్రిని తరలిస్తూ కార్మికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఇలా కనిపించారు. 

5/17
హైదరాబాద్‌లోని బాలానగర్‌ ప్రధాన రహదారిలోని కోమటిబస్తీ వద్ద మంజీరా ప్రధాన పైప్‌లైన్‌ నుంచి తాగునీరు భారీగా లీకైంది. ఇక్కడ ఇటీవల కూకట్‌పల్లి సర్కిల్‌ అధికారులు వరద నీటి కాలువ నిర్మాణం చేస్తుండగా పైప్‌లైన్‌ జాయింట్‌ ఊడి ఒక్కసారిగా నీరు ఎగసిపడింది.

6/17
కరీంనగర్‌ దిగువ మానేరు డ్యాం వెనుక భాగంలో కొందరు రైతులు వేసిన పంటలు ఇవి. డ్యాంలో నీరు తగ్గుముఖం పట్టడంతో.. వెనుక వైపు కొందరు రైతులు సుమారు 10 ఎకరాల్లో వరి పంటను సాగు చేయడంతో కోత దశకు వచ్చింది.     

7/17
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఫిల్మ్‌నగర్‌ నుంచి టోలీచౌకి వరకు ఉన్న షేక్‌పేట నాలా దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారంతో నిండిపోయిన మురుగు.. భరించలేని వాసన.. ఇలా చూడటానికే భయపడేలా ఉన్న నాలాలు దర్శనమిస్తున్నాయి. 

8/17
హైదరాబాద్‌: సాయం సమయం..చల్లని గాలుల నడుమ టెర్రస్‌ లాన్స్‌పై ఉయ్యాలలో చిన్నారులు ఊగుతుండగా..పెద్దలు ఓపెన్‌ ఎయిర్‌ రూఫ్‌ టాప్‌పై ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా చూస్తూ, విందు ఆరగిస్తే..ఎంతో అనుభూతి ఇస్తుంది.హిమాయత్‌నగర్‌లో బి.ఆర్‌.కె.భవన్‌ వద్ద ఇంటిపై ఇలా చూడ చక్కని డిజైన్‌తో రూఫ్‌ గార్డెన్‌ ఆకట్టుకుంటోంది.

9/17
ఆదిలాబాద్‌ నుంచి మంచిర్యాలకు వెళ్లే ప్రధాన రహదారిలో జన్నారం మొదలుకొని ఇంధన్‌పల్లి వరకు సుమారు ఏడు కిలోమీటర్లు వరకు వేప చెట్లున్నాయి.ఈ వేప చెట్లు పచ్చదనం సంతరించుకుని అటుగా ప్రయాణించే వారితో పాటు స్థానికులకు చల్లదనాన్ని అందిస్తున్నాయి.

10/17
హైదరాబాద్‌: చౌరస్తాల అభివృద్ధిలో భాగంగా మూసాపేట కైత్లాపూర్‌ బ్రిడ్జి వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తల ఉండే చోట పుస్తకం, పుస్తకం ఉండే చోట తలను పెట్టారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచిస్తూ ఇలా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

11/17
హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు సందడిగా కొనసాగుతున్నాయి. నెలన్నరపాటు చిన్నారులు తమకు ఇష్టమైన ఆటల్లో శిక్షణ పొందారు.  సరూర్‌నగర్‌ స్టేడియంలో బాస్కెట్‌బాల్‌ శిక్షణ పొందుతున్న బాలల ఉత్సాహమిది.

12/17
సముద్ర అలలకు విశాఖ తీరం తెన్నేటి పార్కు ప్రాంతానికి మూడున్నరేళ్ల కిందట కొట్టుకొచ్చేసిన ఎంవీ మా నౌక అప్పటి నుంచీ ఇదిగో ఇలా దిక్కులు చూస్తూ ఉంది. సందర్శకులు వచ్చి చూసి వెళ్తున్నారు. ఫొటోలు దిగుతున్నారు.

13/17
మూడు వారాల క్రితం ఓ భవనం గోడపై పుల్లలను ఏరితెచ్చి గూడును అమర్చి అందులో రెండు గుడ్లను పెట్టింది ఈ పావురం. వాటిని పొదిగి పిల్లలను చేసింది. కంటికి రెప్పలా కాపాడుతూ వాటికి ఆహారాన్ని తెచ్చి కొసరి కొసరి తినిపించి అమ్మప్రేమను చాటిచెప్పింది. ఏలూరు శాంతినగర్‌లో కనిపించిన చిత్రాలివి.

14/17
చిత్తూరు: ఐరాలలో వెలసిన పాలేటి గంగమ్మ జాతరలో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది.  పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి విశ్వరూపాన్ని తిలకించి పులకించారు.

15/17
మెదక్‌: సిద్దిపేట పట్టణం ఏడో వార్డు నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని వీక్షించారు.

16/17
మెదక్‌: శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామం చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం లక్ష తమలపాకుల అర్చన నిర్వహించారు. శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు.

17/17
హైదరాబాద్‌: కొత్తపేట రైతుబజార్‌ ఎదుట ఫుట్‌పాత్‌పై పెరిగిన బోగన్‌విల్లా మొక్క.. మొదలు నుంచి కొమ్మల వరకు పూలతో నిండిపోయిందిలా. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ఆగి మరి చూస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు