News in images: చిత్రం చెప్పే విశేషాలు (31-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 31 May 2024 11:32 IST
1/11
తుంగభద్ర నదీతీర గ్రామాల్లో తాగేందుకు చుక్క నీరు లేక పల్లె ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇసుకలో చిన్న గుంత తీసి అందులో నుంచి వచ్చే ఊట నీటిని బిందెల్లో తోడుకుని మోసుకెళ్తున్నారు. ఇది నందవరం మండలంలోని తుంగభద్ర నదీతీర గ్రామాల పరిస్థితి. 

2/11
వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దంపతులు  ప్రత్యేక  పూజలు చేశారు.

3/11
హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా జాఖు ఆలయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తన కుమార్తె మిరాయా వాద్రాతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.

4/11
శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో నిజామాబాద్‌ డొంకేశ్వర్‌ మండలంలోని జీజీనడ్కుడ శివారులోని గోదావరిలోని శ్రీరామలింగేశ్వరాలయం శిఖరం బయటకు కనిపిస్తోంది.  కొంగలు, ఇతర పక్షులు పర్యాటకులను అలరిస్తున్నాయి. 

5/11
చెయ్యి తిరిగిన చిత్రకారుడు నిప్పుల కుంచెతో బొమ్మ గీసినట్టుగా ఉంది  ఈ చిత్రం. ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్‌లో అగ్నిపర్వతం విస్ఫోటం చెంది లావా అన్ని వైపులా ప్రవహిస్తూ ఇలా ఆకాశంలో నక్షత్ర సమూహంలా కనిపించింది. 

6/11
1991 డిసెంబరు 11న కన్యాకుమారిలోని వివేకానంద శిలాస్మారకం నుంచే  భాజపా ఏక్తాయాత్రను ప్రారంభించింది. ఈ యాత్రకు నాయకత్వం వహించిన మురళీమనోహర్‌ జోషితోపాటు నరేంద్ర మోదీ కూడా ఆ చిత్రంలో కనిపిస్తున్న ఈ చిత్రం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

7/11
తోరణాలను తలపించేలా గిజిగాడి గూళ్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా పాత పాల్వంచలోని చింతలచెరువు పక్కన ఆత్మలింగేశ్వరాలయం వద్ద విద్యుత్తు తీగలకు గిజిగాళ్లు వరుసగా నిర్మించుకున్న గూళ్లను ‘న్యూస్‌టుడే’ కెమెరా  క్లిక్‌మనిపించింది.

8/11
ఎండలు మండుతున్న ప్రస్తుత తరుణంలోనూ శంషాబాద్‌  విమానాశ్రయ రహదారిలో పచ్చదనం కళకళలాడుతోంది. ప్రత్యేకంగా రంగురంగుల పూలు ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ ఆహ్ల్లాదం కలిగిస్తున్నాయి.

9/11
హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌ మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌ వద్ద, మెట్ల సమీపంలో తాగుబోతుల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఎదురుగానే మద్యం దుకాణం ఉండటంతో అక్కడే తాగడం, స్పృహ తప్పి పడిపోవడం నిత్యకృత్యంగా మారింది. 

10/11
పీఈటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నాంపల్లిలోని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలో  జరిగింది. హాజరైన అభ్యర్థులు ముందుగా బయట కాలిబాటపై కూర్చొని  ధ్రువపత్రాలను సరిచూసుకుంటూ కనిపించారు. 

11/11
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ రైల్వే స్టేషన్‌ ద్వారం వద్ద ప్రైవేటు బస్సులను అడ్డుగా నిలిపిఉంచుతుండటంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

మరిన్ని