News in images: చిత్రం చెప్పే విశేషాలు (01-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 01 Jun 2024 10:03 IST
1/15
భానుడి ప్రతాపానికి మూగజీవాలూ అల్లాడుతున్నాయి. ఉష్ణతాపం తీర్చుకోడానికి నరసాపురంలో ఓ శునకం గోదావరి నదిని ఆశ్రయించగా.. ఏలూరు నగరపాలకసంస్థ ఆవరణలోని ఏసీ పైపు నుంచి జాలువారుతున్న నీటిబొట్లతో కాకి.. నీళ్ల ట్యాంకు పైపు నుంచి వస్తున్న నీటిని తాగేందుకు రామచిలుక ప్రయత్నిస్తున్నాయి.

2/15
హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని  శ్రీకాకుళం జిల్లా సారవకోటలోని అభయాంజనేయ స్వామిని ఆలయ కమిటీ సభ్యులు  కదలీ ఫలాలతో సుందరంగా అలంకరించారు.  ఈ అలంకరణ చూపరులను ఆకట్టుకుంది. 

3/15
హనుమాన్‌ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన చిత్రకారుడు బొడ్డుచర్ల ప్రసాదరావు తమలపాకుల రూపంతో గీసిన భక్త హనుమాన్‌ బొమ్మ ఆకట్టుకుంది. సంస్కృతంలో తమలపాకును నాగవల్లి అని పిలుస్తారు కనుక ఈ చిత్రానికి ‘నాగవల్లి హనుమాన్‌’ అని పేరు పెట్టారు. 

4/15
అసలే ఎండాకాలం.. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకుండా పూర్తిగా అడుగంటిపోయాయి. కానీ నిజామాబాద్‌ శివారులోని అర్సపల్లి చెరువు మాత్రం నీటితో కళకళలాడుతుంది. 

5/15
ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గొర్రెగుట్ట సమీపంలో ఓ రైతు లేత ఆయిల్‌పాం మొక్కల్లో అంతర పంటగా వేసవిలో కూరగాయల సాగు చేపట్టారు. విత్తిన గింజలను పక్షులు తినకుండా ఇలా తోటంతా మందపాటి దారంతో చేసిన చేపల వలతో కప్పేశారు.

6/15
రోహిణీ కార్తె ఎండలకు మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం అల్లాడిపోతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో ఓ ఇంట్లో చల్లదనం కోసం గేదె దూడ కూలర్‌ వద్ద నిలబడింది. ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

7/15
జాతీయ సర్ఫింగ్‌ పోటీలకు మంగళూరు సమీప శశిత్లూ తీరం వేదికగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు- తొలిరోజు తమ సత్తా చాటే ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. అందులో ఓ క్రీడాకారుడి విన్యాసమిదీ జాతీయ సర్ఫింగ్‌ పోటీలకు మంగళూరు సమీప శశిత్లూ తీరం వేదికగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు- తొలిరోజు తమ సత్తా చాటే ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. అందులో ఓ క్రీడాకారుడి విన్యాసమిదీ
8/15
 శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధికి చెందిన కలంకారీ కళాకారుడు మునిబాబు వేసిన కలంకారీ చిత్రం ఆకట్టుకుంది. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని కలంకారీ వస్త్రంపై అయిదు రోజుల వ్యవధిలో ఈ పెయింటింగ్‌ను అద్భుతంగా చిత్రీకరించారు.

9/15
పాఠశాల, కళాశాలలకు వేసవి సెలవులు దగ్గర పడటంతో వివిధ ప్రాంతాలకు సందర్శకులు తరలి వెళ్తున్నారు. నల్గొండ జిల్లా సాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో యువకులు బోట్లో షికారు చేస్తూ సరదాగా చేపల వేట సాగిస్తున్నారు. 

10/15
సినీ నటుడు విష్వక్‌సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం ఆర్టీసీ క్రాస్ర్‌రోడ్డులోని దేవి థియేటర్‌లో విడుదలైంది. అభిమానులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. అనంతరం కారులో ఎక్కిన తర్వాత.. అభిమానులకు ఇలా అభివాదం చేస్తూ కనిపించారు.

11/15
గంజాం జిల్లాకు చెందిన యువ కళాకారుడు కె.బిజయ కుమార్‌ రెడ్డి పెన్సిల్‌ మొనలపై అద్భుత కళాకృతులు తీర్చిదిద్దాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సందర్భంగా అతడు పెన్సిల్‌ మొనపై 1.5 సెంటీమీటర్ల ఎత్తున ట్రోఫీ నమూనా చెక్కాడు. 

12/15
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.  హావేరిలో ఓ పాఠశాలలో విద్యార్థులు ఫొటోలు తీసుకునేందుకు ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేశారు. 

13/15
నల్గొండ జిల్లా  మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్‌నగర్‌ కాలనీ ప్రధాన రహదారిపై తాగునీటి నల్లా లీకేజీతో పెద్ద మొత్తంలో నీరు వృథాగా పోయింది. లీకేజీ అయిన ప్రాంతంలో సిమెంటు రహదారి ఉండటంతో చాలా దూరం నీరు ప్రవహించింది. 

14/15
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్‌కు చెందిన సత్తెమ్మ(80)  కుమారుడు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సర్వీసు మార్గంలో సన్న వడ్లను ఆరబోశారు. ఎప్పుడు వర్షం పడుతుందోనని ఆమె కాపలాగా ఉన్నారు. మధ్యాహ్నం వేళ కాలిబాటపై సిమెంటు దిమ్మెనే తలగడలా చేసుకుని అక్కడే కునుకు తీస్తూ కనిపించారు. 

15/15
మృగరాజుపై వేణుగోపాలస్వామి ఉగ్రనరసింహుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు స్వామివారు సింహ వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో విహరించారు.

మరిన్ని