News in images: చిత్రం చెప్పే విశేషాలు (02-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 02 Jun 2024 09:58 IST
1/14
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.  ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం  స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
2/14
వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులకు పలు చోట్ల మహా వృక్షాలు సైతం నేలకొరిగాయి.  అయితే ఆదిలాబాద్‌ జిల్లా నేరేడిగొండ మండలం రహదారిపై  విరిగిపోయిన వృక్షం స్థానంలో రావి చెట్టు మొలిచిందిలా.. వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులకు పలు చోట్ల మహా వృక్షాలు సైతం నేలకొరిగాయి. అయితే ఆదిలాబాద్‌ జిల్లా నేరేడిగొండ మండలం రహదారిపై విరిగిపోయిన వృక్షం స్థానంలో రావి చెట్టు మొలిచిందిలా..
3/14
విజయనగరం జిల్లా  బలిజిపేట మండలంలోని వంతరాం సమీపంలోని వేగావతి నది రూపరేఖలు మారిపోయాయి. ఏడాదిలో 8 నెలలపాటు నీటితో కళకళలాడే నది వేసవి తీవ్రతతో ఎండిపోయింది. ఒక ఒడ్డుకు ఇసుక మేటలు వేయడం, గోతులతో కనిపిస్తోంది. 

4/14
విశాఖ నగరంలో కొంతమంది ద్విచక్ర వాహన చోదకులు తలకు శిరస్త్రాణం ధరించకుండా చక్కర్లు కొడుతున్నారు.  కొందరు వెంట తెచ్చుకున్న హెల్మెట్లను వాహనాలకు తగిలిస్తున్నారు. ఇంకొందరు వెనుక కూర్చున్న వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. మద్దిలపాలెం కూడలిలో చోటుచేసుకున్న దృశ్యాలివి.

5/14
ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీ గిరిజన్‌ భవన్‌లో మామిడి మేళా  ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు. వివిధ రకాల మామిడి జాతికి చెందిన పండ్లు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. 

6/14
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి సంబంధించి శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ ముఖ చిత్రంతో శ్రీకాకుళం జిల్లా లావేరు వస్త్రపురికాలనీకి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సహకారంతో చేనేత వస్త్రం తయారుచేశారు. 

7/14
సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరానికి చెందిన చిత్రకారుడు వాడాడ రాహుల్‌ పట్నాయక్‌ నెమలి పింఛంపై గీసిన సూక్ష్మకళా చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మూడు గంటలపాటు శ్రమించి చిత్రం గీసినట్లు రాహుల్‌ చెబుతున్నారు. 

8/14
నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ చెరువులో శనివారం మత్స్యకారులు వేట కొనసాగించగా.. ఒకరికి 25 కిలోల చేప (బొచ్చ రకం) చిక్కింది. దీంతో చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. 

9/14
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. పదేళ్లయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పత్రచిత్రకారుడు గుండు శివకుమార్‌ రావి ఆకులపై తెలంగాణ తల్లి, చార్మినార్, ఇతర చిత్రాలతో పాటు అమరుల స్తూపం తదితర వాటిని మలిచారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

10/14
నాగులవంచకు చెందిన ఓ వ్యక్తి ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలో ఈ బడ్డీని కొనుగోలు చేశారు. ఖమ్మం-బోనకల్లు ప్రధాన రహదారిలో పెద్ద పరిమాణంలో ఉన్న ఓ బడ్డీని టైర్ల ఎడ్ల బండిపై  ఇలా తరలించారు.

11/14
హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయంలో  భక్తి ముద్రలో ఆంజనేయుడు భక్తులకు దర్శనమిచ్చాడు.

12/14
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ రోడ్డులో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా..  బండి పెట్రోల్‌ ట్యాంక్‌పై నిద్రపోతున్న ఓ బుడతడు ఇలా కనిపించాడు.  కాస్త ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదానికి ఆస్కారం ఇచ్చినట్టే అవుతుంది.

13/14
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. 

14/14
వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం రెండో బైపాస్‌ రోడ్డులో ఉన్న అభయాంజనేయస్వామి దేవాలయంలో 27 అడుగుల విగ్రహానికి  లక్ష అరటి పండ్లతో అలంకరణ చేశారు. హనుమజ్జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక అలంకరణ చేశామని పూజారులు తెలిపారు.

మరిన్ని