News in images: చిత్రం చెప్పే విశేషాలు (03-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 03 Jun 2024 11:45 IST
1/18
నెల్లూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్‌ సెంటర్‌లో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఆగిపోయింది.  కండక్టర్‌తోపాటు బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులంతా కలిసి నెట్టారు. ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

2/18
గిరిజనులు  గుమ్మడి కాయలను ఏడాది పొడవునా వినియోగించుకునేందుకు పురుగులు పట్టకుండా ఉండటానికి చెట్లకు వేలాడదీస్తుంటారు. వారం రోజులపాటు ఎండబెట్టి విత్తనాలను వినియోగించుకుంటారు. మిగిలిన గుమ్మడిని కూర వండుకుని తింటారు. 

3/18
విశాఖ జిల్లా  ఆర్కే బీచ్‌ తీరం పర్యటకులతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలదన్నట్లుగా పోగైన జనాన్ని చూసి సముద్రుడు రెట్టించిన ఉత్సాహంతో అలలతో సందడి చేశాడు. 

4/18
ఐదో జాతీయ స్థాయి సర్ఫింగ్‌ పోటీలు అరేబియా సముద్ర తీరంలో కొనసాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని శశిత్లూ తీరం వద్ద  క్రీడాకారులు అలలపై విన్యాసాలను ప్రదర్శించారు.  

5/18
చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నారు.. కానీ మొక్కలు నాటడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రతీ ఒక్కరూ వీపున ఆక్సీజన్‌ సిలిండర్‌, ముక్కు మాస్క్‌ తగిలించుకుని తిరగాల్సి వస్తుందని ఏన్కూరుకు చెందిన కొంటు సాంబయ్య  ప్రధాన రహదారిపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

6/18
ఖమ్మం జిల్లా వైరాలోని స్థానిక జలాశయంలో ఇటీవల ఈత నేర్చుకున్న చిన్నారులు, విద్యార్థులతో  శిక్షకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గత రెండు నెలల్లో ఈత నేర్చుకున్న సుమారు 50 మందితో ఉల్లాసంగా ఈత కొట్టారు.

7/18
అమరావతి: విజయవాడలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ఫ్యాషన్‌ టెక్నాలజీ విద్యార్థులు తయారు చేసిన దుస్తులను ఆదివారం  ప్రదర్శించారు. మోడళ్లు ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు..

8/18
నల్గొండ: వేసవి నేపథ్యంలో ఆహారం కోసం పక్షులు హారంగా వలస వెళ్లే దృశ్యం యాదగిరిగుట్టలో చూపరులకు ఇలా కనువిందు చేసింది. యాదగిరిగుట్ట సమీపంలోని వంగపల్లి చెరువు వద్దకు ఆ పక్షులు వెళ్లడం కనిపించింది. కష్టకాలంలోనూ కలిసి వెళ్తూ ఆలోచింపజేసింది.

9/18
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం శిల్పారామంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ ప్రదర్శనలు కళా ప్రియులను అలరించాయి.

10/18
హైదరాబాద్‌: ఆదివారం నారాయణగూడలోని కేఎంఐసీఎస్‌ కళాశాలలో సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ మెమోరియల్‌ ప్రాంగణంలో టాలెంటోత్సవం పేరుతో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన విద్యార్థులు నృత్యం, గానం, సంప్రదాయ యోగా వంటి ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

11/18
అనంతపురం: ఆదివారం పుట్టపర్తి సాయికుల్వంత్‌ మందిరంలో బాలవికాస్‌ చిన్నారులు సత్యసాయి ఉపన్యాసాల ఆధారంగా ‘నవ విధ భక్తి’ నృత ప్రదర్శన చేశారు.మానవుడి హృదయమే దేవాలయమని, దైవత్వాన్ని, సేవాతత్వాన్ని అలవర్చుకోవాలనే సందేశాన్ని నృత్య రూపకం ద్వారా బాలవికాస్‌ చిన్నారులు తెలియజేశారు.

12/18
తమిళనాడు: ధర్మపురి జిల్లా హొగినేకల్‌ జలపాతానికి నీటిరాక అధికమైంది. ఆదివారం మూడో రోజుగా 2 వేల ఘనపుటడుగు నీరు వస్తోంది.జలపాత సందర్శనకు పర్యాటకులు వరుసకట్టారు. దోనెల షికారు చేసి ఊట్టమలై, ఐందరువి, అత్తిమరత్తుక్కడవు తదితర ప్రాంతాలను తిలకిస్తున్నారు.

13/18
తమిళనాడు: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 81వ జన్మదినం సందర్భంగా ఆయన సంగీతం అందించిన వెయ్యి చిత్రాల పేర్లతో కూడిన చిత్రాన్ని పళనికి చెందిన ఉపాధ్యాయుడు అన్బుసెల్వన్‌ గీసి అబ్బురపరిచారు.

14/18
విశాఖపట్నం: అనకాపల్లి నూకాలమ్మ తల్లిని అదివారం 50 వేల గాజులతో అలంకరించారు. వైశాఖ మాసం ఏకాదశి తిథి, రేవతి నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారికి ఈ అలంకరణ చేపట్టారు.

15/18
చిత్తూరు: తాతాయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. గంగమ్మను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించారు.

16/18
ఆదిలాబాద్‌: ఎండలు మండుతున్నాయి అంటారు.. కానీ చాలామంది తమవంతుగా ఒక్క మొక్క నాటేందుకు సైతం ముందుకురారు. అలాంటిది జిల్లా కేంద్రంలోని జన్మభూమినగర్‌కు చెందిన ఓ నివాసితుడు. ప్రస్తుత వేసవి తీవ్రత దృష్ట్యా తన ఇంటి చుట్టూ పెంచుతున్న చెట్లకు ఎండ తగలకూడదని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

17/18
విశాఖపట్నం: ఆర్కే బీచ్‌ తీరం ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలదన్నట్లుగా పోగైన జనాన్ని చూసి సముద్రుడు రెట్టించిన ఉత్సాహంతో అలలతో సందడి చేశాడు. వేసవి సెలవులు ముగుస్తుండటం సాయంకాలం సాగర తీరంలో వాలిపోయిన పర్యాటకులు ఆహ్లాదంగా గడిపారు.

18/18
ఖమ్మం: ఇల్లెందు నుంచి కొమరారం వెళ్లే దారిలో సీతానగరం వద్ద ఓ రావిచెట్టులో తాటి వృక్షం ఇలా ఇమిడిపోయింది. చూపరులకు రావిచెట్టు మధ్య భాగం నుంచి తాటిచెట్టు ప్రస్థానం ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది. తనకే సొంతం అన్నట్టుగా తాటిని చుట్టేసిన తీరు ఆసక్తి కలిగిస్తోంది.

Tags :

మరిన్ని