News in images: చిత్రం చెప్పే విశేషాలు (04-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 04 Jun 2024 03:26 IST
1/9
మహబూబ్‌నగర్‌: సోమవారం ఉదయం ఒక వైపు చిరుజల్లులు కురుస్తుండగా.. మరో వైపు మేఘాలు కొండలను తాకుతూ వెళ్లాయి. ఖిల్లా దుర్గం, వానకొలం కొండపై ఈ దృశ్యాలు కనువిందు చేశాయి. వీటిని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మన్పించింది.

2/9
హైదరాబాద్‌: పెంపుడు జంతువులను తరలించేందుకు విభిన్నమైన సంచులు మార్కెట్‌లో ఆకట్టుకుంటున్నాయి. పిల్లలు స్కూలుకు తీసుకెళ్లే తరహాలోని  బ్యాగులో పెంపుడు కుక్కను ఉంచి ద్విచక్రవాహనంపై  తీసుకెళుతున్నాడీ యువకుడు. లిబర్టీ రోడ్డులో కనిపించిందీ చిత్రం.

3/9
హైదరాబాద్‌: ఐడియల్‌ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ మధుసూదన్‌ అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కళాశాలలో డిగ్రీ చివరి ఏడాది సైన్స్‌ విద్యార్థులు సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

4/9
హైదరాబాద్‌: గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న 2,517 మంది అగ్నివీర్‌లు సోమవారం ఇక్కడి మఖ్ఖాన్‌సింగ్‌ స్టేడియంలో విన్యాసాలతో తమ ప్రతిభను చాటారు. యోగా, యుద్ధ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

5/9
తమిళనాడు: తిరువళ్లూరు జిల్లా తిరువాలంగాడు పంచాయతీ యూనియన్‌ తాళవేడు గ్రామంలోని ద్రౌపది అమ్మవారి ఆలయంలో ఈ ఏడాది ఉత్సవాలు గత నెల 24వ తేదీ ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అగ్ని వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు.

6/9
తమిళనాడు: దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రూపాన్ని నాలుకతో 20 నిమిషాలలో రూపొందించాడో యువకుడు.కరుణానిధి 101వ జయంతి సందర్భంగా సోమవారం బ్రష్‌ ఉపయోగించకుండా నాలుకతో 3 అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో కరుణానిధి రూపాన్ని చిత్రీకరించి రికార్డు సృష్టించారు.

7/9
నెల్లూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రావణసేవ వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి అర్చకులు, వేదపండితులు స్వామి, అమ్మవార్లను వాహనంపై కొలువుదీర్చారు. గ్రామోత్సవం ఘనంగా జరిగింది.

8/9
గుంటూరు: మరికొద్ది గంటల్లో  ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో  మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయాన్ని సోమవారం రాత్రి ఇలా విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు.

9/9
మెదక్‌: చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శౌచాలయాల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. మనఊరు -మనబడి కింద వీటిని చేపట్టారు. కేవలం గోడలు మాత్రం కట్టి వదిలేశారు. పాఠశాలల ప్రారంభం నాటికి అయినా నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతున్నారు.

Tags :

మరిన్ని