News in images: చిత్రం చెప్పే విశేషాలు (07-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 07 Jun 2024 11:30 IST
1/22
మెదక్‌ జిల్లాలో  పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపునకు లారీ ఓ  భారీ యంత్రాన్ని మోసుకొస్తోంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై  మిగతా వాహనాలు నెమ్మదిగా కదలాల్సి వచ్చింది. ఆ వాహనం మాత్రం జహీరాబాద్‌ వైపునకు వెళ్లిపోయింది.

2/22
సిద్దిపేట పట్టణంలోని శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్‌ ఆలయ గోశాలలో ఓ లేగదూడకు కనులపండువగా నామకరణోత్సవం నిర్వహించారు. గోశాలను సర్వాంగసుందరంగా పువ్వులతో అలంకరించారు. లేగదూడకు రాధమ్మగా నామకరణం చేశారు.

3/22
మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ ప్రభుత్వ కళాశాల ఇది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేక ఇలా తయారైంది. కళాశాల పరిసరాలు, క్రీడాస్థలం తదితరాలన్నీ నీటితో నిండిపోయాయి.

4/22
ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఓ పంచాయతీ కార్మికునికి చింపాంజీ డ్రెస్‌ వేయించి,  ఐదుగురు వ్యక్తులు గ్రామంలో కేకలు వేస్తూ, బాణసంచా కాల్చుతూ కోతులను తరుముతున్నారు.

5/22
అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇటీవల ఆ దేశం వీసా స్లాట్లను విడుదల చేసింది. వీసా ఇంటర్వ్యూల కోసం  విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, బంధువుల రాకతో హైదరాబాద్‌  నానక్‌రాంగూడలో ఉన్న కాన్సులేట్‌ కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది.

6/22
 ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామ సమీప గోదావరి నదిలోకి జాలరులు  పడవలో చేపల వేట కోసం వెళ్తున్నారు. వేట కోసం పడవలో వెళ్తుండగా ఈ దృశ్యం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.

7/22
హైదరాబాద్‌ గడ్డిఅన్నారం పరిధిలోని పటేల్‌నగర్‌లో ఈ చేతిపంపును తొలగించకుండానే సీసీ రోడ్డు వేశారు. రోడ్డు మధ్యలో నిరుపయోగంగా ఉన్న చేతిపంపుతో తీవ్ర ఇబ్బంది కలుగడమే కాకుండా రాత్రివేళ ప్రమాదాలు జరుగుతున్నాయి.

8/22
హైదరాబాద్‌: ఫామ్‌హౌస్‌లో వారాంతాలు కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఇప్పుడు శాశ్వత నిర్మాణాలే అవసరం లేదు. రెడీమేడ్‌గా కొంతమంది వ్యాపారులు ఇళ్లను నిర్మించి అమ్ముతున్నారు.  తోటలోకి తీసుకెళ్లి పెట్టుకోవచ్చు..ఈ చిత్రం పెద్దఅంబర్‌పేటలో కనిపించింది...

9/22
ప్రకాశం: ప్రకృతి రమణీయతకు ప్రతిరూపంగా ఉండే గుండ్లకమ్మ జలాశయం పరిస్థితి దయనీయంగా మారింది. గేట్లు కొట్టుకుపోవడంతో నీరంతా కడలి పాలైంది.  జలాశయం మొత్తం ఎండిపోయి ఇలా ఆల్చిప్పలు, నత్తగుల్లలకు నిలయంగా మారింది.  జలాశయం మొత్తం ఎండిపోగా.. ఓ వైపున మిగిలిన కొద్దిపాటి నీటిలో చేపలు పట్టేందుకు వెళుతున్న మత్య్సకారుడు.

10/22
గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 45 రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను  ప్రదర్శించి సభికులను మురిపించారు. జానపద, శాస్త్రీయ నృత్యాలు..  సంకీర్తనలు.. సినీ పాటల ప్రదర్శనలతో బాలభవన్‌ చిన్నారులు అందరిని అబ్బురపర్చారు.

11/22
విశాఖపట్నం: రాజవొమ్మంగిలో గురువారం ఒకరి ఇంటి వద్ద సీతాకోకచిలుక వాలింది. పసుపు వర్ణంలో ఎంతో అందంగా ఉంది. రెక్కలపై నలుపు రంగు గీతలతో పాటు త్రిభుజాకారాలు కలిగి ఉంది. దాదాపు నాలుగు అంగుళాల పొడవు ఉండటంతో అందరూ ఆసక్తిగా చూశారు.

12/22
నల్గొండ: వర్షాలు విస్తృతంగా కురుస్తుండటంతో రైతులు పొలంబాట పట్టారు.రోహిణికార్తె బలంగా ఉందని నమ్మిన రైతులు పత్తి విత్తనాలు విత్తుతున్నారు. గన్నెర్లపల్లి గ్రామ శివారులో పత్తి విత్తనాలు విత్తుతున్న రైతుల దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.

13/22
వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే 163వ నంబర్‌ జాతీయ రహదారి అక్కడక్కడా దెబ్బతినడంతో మరమ్మతు చేశారు. దానిపై డాంబర్‌తో కూడిన ప్రత్యేక లేయర్‌ వేయడంతో ఈ మార్గం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రఘునాథపల్లి వద్ద తీసిన చిత్రమిది..

14/22
హైదరాబాద్‌: సినీతార రాశీ ఖన్నా గురువారం నగరంలో మెరిశారు. సోమాజిగూడలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆమె హాజరై సందడి చేశారు. ఆమెతో ఫొటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అందరికీ అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు.

15/22
విశాఖపట్నం: అనకాపల్లిలోని తాకాశివీధి నూకాలమ్మ ఆలయంలో గురువారం అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని 101 చీరలతో అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

16/22
విశాఖపట్నం: పాతనగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన గురువారం త్రికాల సమయంలో పంచామృతాభిషేకం పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

17/22
వరంగల్‌: జాతీయ రహదారిపై ఆగిన ఈ భారీ యంత్రాలను వాహనదారులు, ప్రజలు, ప్రయాణికులు గురువారం ఆసక్తిగా తిలకించారు. ఓ కంపెనీకి చెందిన రెండు భారీ ఆయిల్‌ రిఫైనరీ యంత్రాలను కంటైనర్లపై చెన్నై నుంచి అస్సాం రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఒక్కొక్క వాహనం రోజుకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర మాత్రమే ప్రయాణిస్తుంది.

18/22
విశాఖపట్నం: షీలానగర్‌ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌కు వెళ్లే మార్గంలో విద్యుత్తు కాంతులు వాహనదారులు, ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. దారి పొడవునా విద్యుత్తు స్తంభాలకు ప్రత్యేకంగా జాతీయ జెండా రంగుల దీపాలను అలంకరించారు.

19/22
మెదక్: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలకు వచ్చిన భక్తులు సమీపంలో ఉన్న భారీ మర్రి వృక్షం వద్ద సరదాగా గడుపుతున్నారు. ప్రధానంగా ఈ చెట్టు ఊడలు, కొమ్మలు నేలను తాకుతున్నాయా అన్నట్టుగా ఉండటంతో పెద్దలు, చిన్నల సంబరం హెచ్చుతోంది.

20/22
విశాఖపట్నం: గిరిజన గ్రామాల్లో మామిడి పండ్లతో నోరూరించే తాండ్ర తయారు చేస్తూ మహిళలు ఉపాధి పొందుతున్నారు. కొండకోనల్లో మామిడి పండ్లను సేకరించి వాటి తొక్కలు ఒలిచి గుజ్జు తీస్తున్నారు. దీన్ని ఎండబెట్టి తాండ్ర తయారు చేస్తున్నారు.

21/22
ఖమ్మం: కొందరు గిరిజనులు అత్యంత అరుదుగా లభించే బూసీ పండ్లను మణుగూరులో విక్రయించారు. ఉడుము కాయలు, బంక కాయల మాదిరి కనిపించే వీటిని పూలమార్కెట్‌ వద్ద తీసుకొచ్చి కుప్పగా పోశారు. ఈ పండ్ల గురించి చాలామందికి తెలియదు. ఇందులో ‘సి’ మిటమిన్‌తోపాటు గింజలో అత్యధిక పోషకాలు ఉంటాయి.

22/22
విశాఖపట్నం: ఈ చిత్రం చూస్తుంటే చింతచెట్టుకు పనసకాయలు కాసినట్లుగా ఉంది కదూ.. రొంపల్లి పంచాయతీ కేంద్రానికి వెళ్లే మార్గమధ్యలో ఈ చెట్లు ఉన్నాయి. పనస, చింత చెట్లు రెండూ ఒకే చోట పెరిగాయి. అటుగా వెళ్లే ప్రయాణికులు దీన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Tags :

మరిన్ని