News in images: చిత్రం చెప్పే విశేషాలు (11-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 11 Jun 2024 11:26 IST
1/12
గంగమ్మ తల్లి జాతర అనంతరం వచ్చే మూడవ మంగళవారం  అమ్మవారిని రకరకాల పండ్లతో ప్రత్యేకంగా  అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 

2/12
ఈ చిత్రంలో కనిపిస్తున్నది చిన్నపాటి చెరువు అనుకుంటే పొరపాటే. ఇటీవల  కురిసిన వర్షాలకు శ్రీ సత్యసాయి జిల్లా తాడిపత్రిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం జలమయం అయింది. 

3/12
హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం సోమవారం రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో సందడిగా సాగింది. కార్యక్రమం అనంతరం విద్యార్థులు ఇలా ఫొటోలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు.

4/12
మెదక్‌: వ్యాపారులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆధునిక, సాంకేతికతను వినియోగించి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. సిద్దిపేటలో యువకులు శ్రవణ్‌కుమార్, సతీశ్‌ కొత్త ఆలోచనలతో ఇటీవల ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇందులో నాలుగు రోబోలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

5/12
హైదరాబాద్‌: లేక్‌ వ్యూ పార్క్‌లోని నీటిలో ఫ్లోటింగ్‌ గార్డెనింగ్‌ను ప్రయోగాత్మకంగా హెచ్‌ఎండీఏ ప్రారంభించింది. నీటి దుర్వాసనను అరికట్టడంతో పాటు ఆక్సిజన్‌ పెంచేలా మొక్కలను పెంచుతున్నారు.

6/12
మహబూబ్‌నగర్‌: అలంపూర్‌ సమీపంలోని తుంగభద్ర నదికి ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. జోగులాంబ ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులు నది నీటిని తిలకిస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు.

7/12
ఆదిలాబాద్‌: మంచిర్యాలలో సోమవారం నృత్య సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో ఆదిలాబాద్‌ బాల కేంద్రం చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పన్నాల లాస్య బృందం ఆనంద తాండవం నృత్యం చేసి అలరించారు.

8/12
నల్గొండ: పట్టణంలోని మార్కెట్‌ యార్డు కాలనీకి చెందిన బెలిదె రాజు ఇంట్లో హైబ్రీడ్‌ జాతికి చెందిన పగిడి పత్తి చెట్టుకు 40 ఏళ్లుగా పూజలు అందుతున్నాయి.  చెట్టు సంరక్షణతో తనకు ఎంతో మేలు జరుగుతుందని, వనదేవతగా కొలుస్తున్నామని రాజు పేర్కొన్నారు.

9/12
తమిళనాడు: వెలమకండ్రిగలోని శ్రీవీరాంజనేయస్వామి క్షేత్రంలో ఈనెల ఒకటిన 49వ వార్షిక అగ్నిగుండ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కలశ స్థాపనం, రామాయణ, హరికథ గానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేసి అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు.

10/12
విశాఖపట్నం: అడ్డతీగల గ్రామదేవత సోమాలమ్మ తల్లికి రంపచోడవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన మిరియాల శిరీషాదేవి, విజయభాస్కర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం జాతర సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

11/12
ఖమ్మం: ఏటీఎం ద్వారా ఏవిధంగా డబ్బులు డ్రా చేసుకుంటామో అదే తరహాలో టీ, కాఫీ, బాదంపాలు, మంచినీళ్ల బాటిల్, బిస్కెట్లు ఇచ్చే (డబ్ల్యూటీసీ) వెండింగ్‌ యంత్రాన్ని సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. సదరు యంత్రంలోని క్యూఆర్‌ కోడ్‌కు స్కాన్‌ చేసి డబ్బులు చెల్లిస్తే కావాల్సిన పదార్థం వస్తుంది.

12/12
హైదరాబాద్‌: మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి జలమండలి విభాగం ఆధ్వర్యంలో హెచ్చరికల బోర్డులు, గోడపత్రికలను సోమవారం బంజారాహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Tags :

మరిన్ని