News in pics : చిత్రం చెప్పే సంగతులు (12-02-2024)

ఈ రోజు చిత్రవార్తలు.. వాటి విశేషాలు

Updated : 12 Feb 2024 09:48 IST
1/10
మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం జరిగిన ఫ్యాషన్‌ షోలో సినీ తారలు సందడి చేశారు.  రూపదర్శినులతో పాటు ర్యాంప్‌వాక్‌ చేసి వీక్షకులను కట్టిపడేశారు.
 
2/10
 వారాంతాల్లో నెక్లెస్‌రోడ్డులో నగరవాసుల సందడి కొనసాగుతుంటుంది. కొందరు యువత ఇళ్లలో ప్రత్యేకంగా తయారుచేసిన కేకులను కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ విక్రయిస్తున్నారు. బొమ్మలు, బ్యాటరీ బండ్లతో తమ చిన్నారుల విన్యాసాలను సెల్‌ఫోన్‌లతో చిత్రీకరిస్తూ మరికొందరు సందడి చేశారు.

3/10
విశాఖ తీరాన కోస్టల్‌ బ్యాటరీ ప్రాంతంలో రాళ్లపై పరచుకొన్న పచ్చని అందాలు ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నాయి. సముద్రం మధ్యలో దీవి ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ ప్రాంతం సందర్శకుల్ని కళ్లార్పకుండా చేస్తోంది. చిన్నారులంతా అక్కడే కూర్చొని సందడి చేస్తున్నారు.

4/10
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలటూరు శివారులో కృష్ణాతీరం కనువిందు చేస్తోంది. తీరం వెంట పచ్చిక సమృద్ధిగా లభిస్తుండడంతో గొర్రెలు కడుపునిండా ఆరగిస్తున్నాయి. ఎటు చూసినా ప్రకృతి చిత్రాలు మనసును ఆకట్టుకుంటున్నాయి. 
 
5/10
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలటూరు శివారులో కృష్ణాతీరం కనువిందు చేస్తోంది. ఏటిలో నీటిమట్టం తగ్గడంతో చేపలు కుప్పలు తెప్పలుగా పైకి వస్తున్నాయి. వాటిని ఆరగించేందుకు వందల సంఖ్యలో పక్షులు వలస వస్తున్నాయి.

6/10
కడెం మండలం మైసంపేట, రాంపూర్‌ గ్రామాల తరలింపును మొదటగా చేపడుతున్నారు. కొత్తమద్డిపడిగ శివారులో రెండు గ్రామాల వారికి 94 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చూడ్డానికి అందంగా కనిపిస్తున్న ఈ కాలనీకి ముఖచిత్రంగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణం, అక్కడ గోడలపై వేసిన అటవీ జంతువుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

7/10
విజయనగరంలోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినం(అమ్మవారిగా అవతరించిన రోజు) ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. అనంతరం వజ్రకిరీట స్వర్ణకవచ అలంకరణలో తల్లి దర్శనమిచ్చారు. 

8/10
ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాకలోని వలస పక్షుల ఆవాస కేంద్రంలో ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. సైబీరియా నుంచి వలసొచ్చిన స్పాట్‌ బిల్డ్‌ పెలికాన్‌ (నివాస గూడబాతు) తన పిల్లల నోటికి ఆహారాన్ని అందిస్తూ కనువిందు చేసింది. 
 
9/10
లక్డీకాపూల్‌లోని అయోధ్య కూడలిలో కర్రల వంతెనకు ఏర్పాటు చేసిన అలంకరణపై ‘లక్డీకాపూల్‌’ అనే పేరు చెదిరిపోయింది.  అక్షరాలు సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.   

10/10
 అప్పుడే ఎండలు మొదలయ్యాయి. ఆదివారం హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉండటంతో వేల మంది    వేడికి అవస్థలు పడుతూ ప్రయాణాలు సాగించారు. మధ్యాహ్నం సచివాలయం ముందున్న రహదారిలో కనిపించిన ఎండమావుల చిత్రమిది   

Tags :

మరిన్ని