News in pics : చిత్రం చెప్పే సంగతులు (18-02-2024)

Updated : 18 Feb 2024 04:39 IST
1/12
హైదరాబాద్‌: మూసాపేట పరిధి కైత్లాపూర్‌ మైదానంలో సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘ఫ్యాషన్‌ షో’ ఆకట్టుకుంది. యువతులు, యువ జంటలు, పిల్లల ప్రదర్శనతో కార్యక్రమం ఉత్సాహంగా ఆరంభమైంది. హైదరాబాద్‌: మూసాపేట పరిధి కైత్లాపూర్‌ మైదానంలో సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘ఫ్యాషన్‌ షో’ ఆకట్టుకుంది. యువతులు, యువ జంటలు, పిల్లల ప్రదర్శనతో కార్యక్రమం ఉత్సాహంగా ఆరంభమైంది.
2/12
హైదరాబాద్‌: సాయం సంధ్య వేళ.. చల్లటి వాతావరణంలో సాగిన స్వేచ్ఛ గొంతుక సంగీత విభావరి ఉత్సాహంగా సాగింది.శనివారం రాత్రి గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంగీత విభావరి నిర్వహించారు. హైదరాబాద్‌: సాయం సంధ్య వేళ.. చల్లటి వాతావరణంలో సాగిన స్వేచ్ఛ గొంతుక సంగీత విభావరి ఉత్సాహంగా సాగింది.శనివారం రాత్రి గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంగీత విభావరి నిర్వహించారు.
3/12
కరీంనగర్‌లోని సిద్ధార్థ విద్యా సంస్థల వార్షికోత్సవాన్ని సంస్కృతి-2024 పేరుతో శనివారం స్థానిక అంబేడ్కర్‌ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు.విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కరీంనగర్‌లోని సిద్ధార్థ విద్యా సంస్థల వార్షికోత్సవాన్ని సంస్కృతి-2024 పేరుతో శనివారం స్థానిక అంబేడ్కర్‌ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు.విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
4/12
మహబూబ్‌నగర్‌: కొల్లాపూర్‌్, పెంట్లవెల్లి మండలాల్లోని కృష్ణాతీరం.. అక్కడ నువ్వుల పంటతో కనువిందు చేస్తోంది.సోమశిల వద్ద సాగైన పంట పచ్చదనంతో కళకళలాడుతున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్‌ మనిపించింది. మహబూబ్‌నగర్‌: కొల్లాపూర్‌్, పెంట్లవెల్లి మండలాల్లోని కృష్ణాతీరం.. అక్కడ నువ్వుల పంటతో కనువిందు చేస్తోంది.సోమశిల వద్ద సాగైన పంట పచ్చదనంతో కళకళలాడుతున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్‌ మనిపించింది.
5/12
తమిళనాడు: చెన్నై నందంబాక్కం ట్రేడ్‌సెంటర్‌లో జరిగిన కామిక్‌ కాన్‌ కార్యక్రమంలో కామిక్స్‌ పాత్రలతో ఫొటోలు తీసుకుంటున్న చిన్నారులు. తమిళనాడు: చెన్నై నందంబాక్కం ట్రేడ్‌సెంటర్‌లో జరిగిన కామిక్‌ కాన్‌ కార్యక్రమంలో కామిక్స్‌ పాత్రలతో ఫొటోలు తీసుకుంటున్న చిన్నారులు.
6/12
విశాఖపట్నం: గీతం డీమ్డ్‌ వర్సిటీలో శనివారం విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి  ఈ కార్యక్రమం జరిగింది. నేపాల్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ తదితర దేశాల విద్యార్థుల నృత్య, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విశాఖపట్నం: గీతం డీమ్డ్‌ వర్సిటీలో శనివారం విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి ఈ కార్యక్రమం జరిగింది. నేపాల్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ తదితర దేశాల విద్యార్థుల నృత్య, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
7/12
నెల్లూరు: బిలకూటక్షేత్రం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి ఊంజల్‌ సేవ నయనానందకరంగా సాగింది. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య స్వామివారు ఉభయదేవేరులతో ఊరేగింపుగా తరలివచ్చి సహస్ర దీపాలంకరణ మండపంలోని ఊయలలో కొలువుదీరారు. నెల్లూరు: బిలకూటక్షేత్రం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి ఊంజల్‌ సేవ నయనానందకరంగా సాగింది. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య స్వామివారు ఉభయదేవేరులతో ఊరేగింపుగా తరలివచ్చి సహస్ర దీపాలంకరణ మండపంలోని ఊయలలో కొలువుదీరారు.
8/12
అమరావతి: ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ పునః ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 11.45 స్వర్ణ శిఖర గోపురాన్ని ప్రతిష్ఠించనున్నారు.సాయంత్రం ఫలాది వాసం, పుష్పాది వాస కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.మల్లేశ్వరాలయాన్ని రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. అమరావతి: ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ పునః ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 11.45 స్వర్ణ శిఖర గోపురాన్ని ప్రతిష్ఠించనున్నారు.సాయంత్రం ఫలాది వాసం, పుష్పాది వాస కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.మల్లేశ్వరాలయాన్ని రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు.
9/12
మహబూబ్‌నగర్‌: జడ్చర్ల మండలం గంగాపురంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి జాతరలో యువకులు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఓ రాతి స్తూపాన్ని ఇలా పైకెత్తి నేలపై నిలపడానికి ప్రయత్నిస్తూ కనిపించారు. రెండు క్వింటాళ్లకు పైగా బరువుండే ఈ స్తూపాన్ని నేలపై నిలబెడితే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. చిత్రంలో కనిపిస్తున్న ఈ యువకుడు మాత్రం పలుమార్లు స్తూపాన్ని నిలబెట్టి ఔరా అనిపించారు. మహబూబ్‌నగర్‌: జడ్చర్ల మండలం గంగాపురంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి జాతరలో యువకులు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఓ రాతి స్తూపాన్ని ఇలా పైకెత్తి నేలపై నిలపడానికి ప్రయత్నిస్తూ కనిపించారు. రెండు క్వింటాళ్లకు పైగా బరువుండే ఈ స్తూపాన్ని నేలపై నిలబెడితే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. చిత్రంలో కనిపిస్తున్న ఈ యువకుడు మాత్రం పలుమార్లు స్తూపాన్ని నిలబెట్టి ఔరా అనిపించారు.
10/12
హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం వంద సంవత్సరాలు (1917-2017) పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మించ తలపెట్టిన పైలాన్‌ పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. త్వరలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం వంద సంవత్సరాలు (1917-2017) పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మించ తలపెట్టిన పైలాన్‌ పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. త్వరలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
11/12
హైదరాబాద్‌: మామిడి చెట్లన్నీ పూతతో నిండిపోయాయి. ఈ సమయంలో రైతులకు నేస్తంగా ఉంటాయి చేనేత చీమలు. వీటి శాస్త్రీయ నామం ఒకోఫిల్లా స్మరాగ్డిన. చెట్ల మీద లేత ఆకులకు దగ్గరగా గూడు నిర్మించుకోవడం వీటి ప్రత్యేకత. చెట్టుకు  నష్టం చేసే కీటకాలను తిని రైతన్నలకు మేలు చేస్తాయని జడ్చర్ల డా.బి.ఆర్‌.ఆర్‌. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డా.బి. సదాశివయ్య తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్లోని మామిడి తోటలోనిదీ చిత్రం. హైదరాబాద్‌: మామిడి చెట్లన్నీ పూతతో నిండిపోయాయి. ఈ సమయంలో రైతులకు నేస్తంగా ఉంటాయి చేనేత చీమలు. వీటి శాస్త్రీయ నామం ఒకోఫిల్లా స్మరాగ్డిన. చెట్ల మీద లేత ఆకులకు దగ్గరగా గూడు నిర్మించుకోవడం వీటి ప్రత్యేకత. చెట్టుకు నష్టం చేసే కీటకాలను తిని రైతన్నలకు మేలు చేస్తాయని జడ్చర్ల డా.బి.ఆర్‌.ఆర్‌. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డా.బి. సదాశివయ్య తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్లోని మామిడి తోటలోనిదీ చిత్రం.
12/12
హైదరాబాద్‌: నగర సుందరీకరణలో భాగంగా జూబ్లిహిల్స్‌ రోడ్‌ నం.70లో పాలపిట్ట బొమ్మను ఏర్పాటు చేశారు. దీని రంగుపోయి, తోక భాగంలో విరిగిపోయి కళావిహీనంగా మారింది. హైదరాబాద్‌: నగర సుందరీకరణలో భాగంగా జూబ్లిహిల్స్‌ రోడ్‌ నం.70లో పాలపిట్ట బొమ్మను ఏర్పాటు చేశారు. దీని రంగుపోయి, తోక భాగంలో విరిగిపోయి కళావిహీనంగా మారింది.
Tags :

మరిన్ని