News in pics : చిత్రం చెప్పే సంగతులు (19-02-2024)

Updated : 19 Feb 2024 03:58 IST
1/8
హైదరాబాద్‌: మేడ్చల్‌ కండ్లకోయ ఔటర్‌ జంక్షన్‌ వద్ద రహదారికి ఇరువైపులా, మధ్యలో పచ్చని చెట్లు ఆహ్లాదం పంచుతున్నాయి. ఆ మార్గంలో ప్రయాణం చేసే వారు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్‌: మేడ్చల్‌ కండ్లకోయ ఔటర్‌ జంక్షన్‌ వద్ద రహదారికి ఇరువైపులా, మధ్యలో పచ్చని చెట్లు ఆహ్లాదం పంచుతున్నాయి. ఆ మార్గంలో ప్రయాణం చేసే వారు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
2/8
హైదరాబాద్‌: మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆర్ట్‌ ఫెస్ట్‌ కళాప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ నగరాలకు చెందిన 300 చిత్రకారులు గీసిన అందమైన చిత్తరువులతో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన చూపరులకు కనువిందు చేస్తోంది. హైదరాబాద్‌: మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆర్ట్‌ ఫెస్ట్‌ కళాప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ నగరాలకు చెందిన 300 చిత్రకారులు గీసిన అందమైన చిత్తరువులతో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన చూపరులకు కనువిందు చేస్తోంది.
3/8
హైదరాబాద్‌: ఓ మహిళ హైటెక్‌ సిటీ క్రాస్‌ రోడ్డులో ఇలా బుడగలు అమ్ముకుంటూ కనిపించింది. తన చిన్నారిని ఇలా వస్త్రంతో నడుముకు కట్టేసుకుని ఎండలో తిరుగుతోంది. తన రెండు చేతుల్లో ఉన్న బుడగలను విక్రయిస్తూనే బిడ్డకు ఎండ తగలకుండా వాటిని గొడుగులా పట్టుకుని తిరగడం ఆకట్టుకుంది. హైదరాబాద్‌: ఓ మహిళ హైటెక్‌ సిటీ క్రాస్‌ రోడ్డులో ఇలా బుడగలు అమ్ముకుంటూ కనిపించింది. తన చిన్నారిని ఇలా వస్త్రంతో నడుముకు కట్టేసుకుని ఎండలో తిరుగుతోంది. తన రెండు చేతుల్లో ఉన్న బుడగలను విక్రయిస్తూనే బిడ్డకు ఎండ తగలకుండా వాటిని గొడుగులా పట్టుకుని తిరగడం ఆకట్టుకుంది.
4/8
నెల్లూరు: మండలంలోని అగ్రహారం గ్రామ దేవత శ్రీసత్యమ్మకు ఆదివారం గ్రామస్థులు పాల పొంగళ్లు పెట్టారు. ఏటా ఫిబ్రవరి నెల మూడో ఆదివారం గ్రామస్థులంతా  పొంగళ్లు పెట్టి అమ్మవారికి నివేదన చేయడం ఆనవాయితీగా వస్తోంది. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు: మండలంలోని అగ్రహారం గ్రామ దేవత శ్రీసత్యమ్మకు ఆదివారం గ్రామస్థులు పాల పొంగళ్లు పెట్టారు. ఏటా ఫిబ్రవరి నెల మూడో ఆదివారం గ్రామస్థులంతా పొంగళ్లు పెట్టి అమ్మవారికి నివేదన చేయడం ఆనవాయితీగా వస్తోంది. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
5/8
విశాఖపట్నం: బీచ్‌రోడ్డులో అంతర్జాతీయ నౌకా విన్యాసాలు (మిలాన్‌) నమూనా ప్రదర్శన ఆదివారం సాయంత్రం జరిగింది. అటు నీటిలో.. ఇటు నింగిలో సైనికులు అబ్బురపరిచే విన్యాసాలతో ఆకట్టుకున్నారు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి విన్యాసాలను తిలకించారు. విశాఖపట్నం: బీచ్‌రోడ్డులో అంతర్జాతీయ నౌకా విన్యాసాలు (మిలాన్‌) నమూనా ప్రదర్శన ఆదివారం సాయంత్రం జరిగింది. అటు నీటిలో.. ఇటు నింగిలో సైనికులు అబ్బురపరిచే విన్యాసాలతో ఆకట్టుకున్నారు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి విన్యాసాలను తిలకించారు.
6/8
7/8
మహబూబ్‌నగర్‌: నడిగడ్డ ఇలవేల్పు జమ్మిచేడు జములమ్మ - పరశురామ స్వాముల వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జములమ్మ, పరశురామస్వాముల వారి ఆలయాలను విద్యుద్ధీపాలతో అలంకరించినదే ఈ చిత్రం. మహబూబ్‌నగర్‌: నడిగడ్డ ఇలవేల్పు జమ్మిచేడు జములమ్మ - పరశురామ స్వాముల వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జములమ్మ, పరశురామస్వాముల వారి ఆలయాలను విద్యుద్ధీపాలతో అలంకరించినదే ఈ చిత్రం.
8/8
చిత్తూరు: తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన రోబో ట్రాక్‌ కార్యక్రమంలో వివిధ ప్రాంత విద్యార్థులు పాల్గొన్నారు. తమ ఆవిష్కరణలతో నిర్వాహకులను మెప్పించి బహుమతులు అందుకున్నారు. చిత్తూరు: తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన రోబో ట్రాక్‌ కార్యక్రమంలో వివిధ ప్రాంత విద్యార్థులు పాల్గొన్నారు. తమ ఆవిష్కరణలతో నిర్వాహకులను మెప్పించి బహుమతులు అందుకున్నారు.
Tags :

మరిన్ని