News in pics : చిత్రం చెప్పే సంగతులు (19-02-2024)

Photo Gallery

Updated : 23 Feb 2024 06:30 IST
1/14
విశాఖపట్నం: ‘మిలాన్‌-2024’ నేపథ్యంలో అంతర్జాతీయ నగర కవాతుకు ఆర్కే బీచ్‌ వేదికైంది. నౌకాదళం ఆధ్వర్యంలో గగన తలంలో, సముద్ర జలాల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అబ్బురపరచాయి. యుద్ధ సమయంలో ప్రదర్శించే వ్యూహాత్మక విన్యాసాలతో ‘హాక్‌ జెట్లు’ ఔరా అనిపించాయి. యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.

2/14
3/14
హైదరాబాద్‌: నందిగామ మండలంలోని కన్హా శాంతివనానికి వేలాదిగా వచ్చే సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పచ్చటి పందిరి ఇది. రెండు కి.మీ.ల మేర ఉంటుంది.  థంబర్జియా గ్రాండిఫ్లోర అనే ఈ తీగజాతి మొక్క పొడవుగా అందంగా నీలి రంగులో పెరిగే పూలతో ఆకట్టుకుంటుంది.

4/14
ఆదిలాబాద్‌: విశ్రాంత ఉద్యోగులు ఏకమై తమ సంఘానికో భవనం నిర్మించుకున్నారు. అందరి సహకారంతో సమావేశ మందిరాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. భవనాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దారు. ఆవరణలోకి అడుగుపెట్టగానే వివిధ రకాల మొక్కలు పచ్చదనంతో స్వాగతం పలుకుతాయి.  భవనం చుట్టూ పెరిగిన చెట్లు చల్లదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

5/14
నెల్లూరు: మండల పరిధిలోని గండవరం గ్రామంలో దేశమ్మ ఆలయంలో విగ్రహప్రతిష్ఠ అత్యంత వేడుకగా జరిగింది.కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ఠకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ నిర్మాణ దాతలు ఎంపీటీసీ సభ్యులు  శ్రీనివాసులురెడ్డి, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.

6/14
నెల్లూరు:  పట్టణంలోని ముసునూరు కల్యాణ వెంకటేశ్వరస్వామికి గురువారం రాత్రి కనుల పండువగా తెప్పోత్సవం నిర్వహించారు.ఊరేగింపుగా తీసుకెళ్లి  మందాటి చెరువులో ఏర్పాటు చేసిన తెప్ప పీఠంపై ప్రతిష్ఠించారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ తెప్పపై విహరిస్తూ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

7/14
ఆదిలాబాద్‌:  కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు గురువారం పాఠాలు బోధించారు. గుడిహత్నూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విషయాల గురించి ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

8/14
తమిళనాడు: అడయారు తిరు.వి.క వంతెన సుందరీకరణలో భాగంగా గోడలపై పక్షుల బొమ్మలు చిత్రీకరిస్తున్న దృశ్యం.

9/14
హైదరాబాద్‌:  ఏటా వేసవిలో నగరవాసులు చాలా మంది ఇళ్లలో చల్లని నీరు తాగేందుకు కుండలు, కూజాలను కొనుగోలు చేస్తారు. ఈ దఫా ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతుండటంతో రోడ్ల పక్కన కుండల విక్రయాలూ మొదలయ్యాయి. మలక్‌పేటలో అమ్మకానికి కొలువుదీరాయిలా.

10/14
ఏలూరు: నూజివీడు పట్టణంలో కోతులను కట్టడి చేసేందుకు ఎలుగుబంటి వేషధారణలో పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్‌ కార్మికులు గురువారం సంచరించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ శానిటరి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు మాట్లాడుతూ అధికారుల ఆదేశంతో రోజుకి నాలుగు వార్డుల చొప్పున సంచరించనున్నట్లు తెలిపారు.

11/14
అనంతపురం గ్రామీణ పరిధిలోని రుద్రంపేట సమీపాన జాతీయ రహదారి-44 ఫ్లైఓవర్‌ వంతెనకు రెండు వైపులా పచ్చతోరణం పేరిట మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.ఏపుగా పెరిగిన మొక్కలు ఒక్కసారిగా వాడిపోతుండటంతో పచ్చని తోరణం కళావిహీనంగా మారింది.మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

12/14
హైదరాబాద్‌: యాచారంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కస్తూర్బా పాఠశాల వద్ద విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాఠశాల గోడ మీద ఉండటంతో పిల్లలు భయపడుతున్నారు. వీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

13/14
అమరావతి: కృష్ణా నదిలో రోజు రోజుకు నీటి మట్టం తగ్గుతోంది. ఎప్పుడూ నీటితో కళకళలాడే నదీ తీర ప్రాంతం పడవల రేవు వద్ద ఇలా ఎండిపోయి కనిపిస్తోంది.

14/14
అమరావతి: చుట్టూ మురుగు.. మధ్యలో తాగు నీటి కుళాయిలు.. వాటి నుంచి వచ్చే నీటినే గన్నవరం మండలం కేసరపల్లిలోని బీసీకాలనీ వాసులు తాగుతున్నారు. ఏమాత్రం పైపులైన్లు లీకయినా అతిసారం ప్రబలే ప్రమాదం పొంచి ఉంది.

Tags :

మరిన్ని