News in pics : చిత్రం చెప్పే సంగతులు (23-02-2024)

Photo Gallery

Updated : 24 Feb 2024 04:30 IST
1/12
మెదక్‌: భోజనాన్ని ఆదరాబాదరా కాకుండా ఆహ్లాదకర వాతావరణంలో చేయాలని ఎవరైనా కోరుకుంటారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లో రాజీవ్‌ రహదారి పక్కనున్న రెస్టారెంట్లో యజమాని సతీశ్‌రెడ్డి..కుందేళ్లు, తాబేళ్లు, కోళ్లు, అందమైన పక్షులను ఇష్టంగా పెంచుతున్నారు.వినియోగదారులు మెచ్చుకునే తీరులో వాటిని ప్రదర్శిస్తున్నారు.

2/12
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మన్యంకొండలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రథోత్సవానికి మన్యంకొండ ముస్తాబవుతోంది. కొండ కింద కనువిందు చేస్తున్న పచ్చని పొలాల పక్కన రోడ్డుకు ఇరువైపులా దుకాణ సముదాయాలు వెలిశాయి.

3/12
హైదరాబాద్‌: శేరిలింగంపల్లి త్రివేణి పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. నేషనల్‌ సైన్స్‌ డేని పురస్కరించుకొని ఏర్పాటు చేశారు. త్రివేణి ప్రైమరీ పాఠశాలల అకడమిక్‌ కోఆర్డినేటర్‌ అర్చనాఠాకూర్‌ ముఖ్యఅతిథిగా హాజరై పరిశీలించారు.

4/12
శ్రీకాకుళం నగరం బలగలోని కాళభైరవాలయంలో మాఘపౌర్ణమి సందర్భంగా శుక్రవారం బాలత్రిపుర అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు పొగిరి  గణేష్‌స్వామి ఆధ్వర్యంలో సాయంత్రం సిరిజ్యోతి పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. అదే ఈ చిత్రం.

5/12
అమరావతి: నందిగామ రామలింగేశ్వరస్వామి మాఘ మాస కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం  కనులపండువగా సాగింది.నూతన రథంపై శుకశ్యామలాంబ సమేతంగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.రథాన్ని ఆకర్షణగా తయారు చేయించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను వేద పండితులు సత్కరించారు.

6/12
ఖమ్మం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం బంగారు కవచాల అలంకారంలో దేవదేవుడు దర్శనమిచ్చారు. మాఘ మాసోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రతిష్ఠ చేసి కలశవాహన పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ రూపంలోని  అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ని దర్శించుకున్ని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

7/12
విశాఖపట్నం: వేసవి సమీపించినా మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. చింతపల్లిలో శుక్రవారం 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఉంటోంది. మంచు కొన్నిచోట్ల దట్టంగా అలుముకుంటోంది.

8/12
నల్గొండ: వేసవికి ముందే పగటి ఎండలు మండుతున్నాయి. వేకువజామున మాత్రం చల్లని గాలులు వీస్తుండగా అప్పుడప్పుడు మంచు పడుతోంది. ఉమ్మడి జిల్లాలో సున్నపురాయి, సిమెంటు పరిశ్రమలు, నల్లరేగడి భూములున్న మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి, పాలకవీడు, దామరచర్ల వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ పరిస్థితులు కన్పిస్తున్నాయి.

9/12
గుంటూరు: సుందరీకరణలో భాగంగా గుంటూరు నగరంలో  ప్రజాధనం వెచ్చించి వివిధ కూడళ్లు, డివైడర్లు, రైల్వే అండర్‌ పాస్‌లకు రంగులు అద్దారు. ఆకట్టుకునే చిత్రాలు వేశారు. తరువాత వాటి గురించి పట్టించుకోకపోవడంతో కొద్ది రోజులకే అవి బురద, దుమ్ము కొట్టుకు పోయాయి. కొన్ని రంగు వెలిసి కళావిహీనంగా మారాయి.

10/12
చిత్తూరు: అరణియార్‌లో ఇసుకాసురులు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ దోపిడీ పర్వాన్ని సాగిస్తున్నారు. చదునైన ఇసుక మైదానంలా కనిపించే అరణియార్‌ గుంతలమయంగా మారింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తే ఎక్కడ లోతుందో తెలియనంతగా తవ్వకాలున్నాయి. ఇసుకాసురుల ధాటికి నదీ గర్భం ప్రమాదకరంగా మారింది.

11/12
నెల్లూరు: మండలంలోని మాచవరంలో గతేడాది ఏప్రిల్‌లో వీచిన గాలవాన బీభత్సానికి లక్ష్మీరెడ్డి తమలపాకు తోట దెబ్బతిన్నది. రాష్ట్ర ఉద్యానశాఖ అధికారులు పరిశీలించి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ పరిహారమందలేదు. దీంతో రైతు తోటను మొత్తం తొలగించారు.

12/12
హైదరాబాద్‌: నగరంలో ఎండలు మండుతున్నాయి. ప్రజలు వేడిమి నుంచి రక్షణకు ప్రత్యామ్నాయాలు వినియోగిస్తున్నారు.  కరోనా మాస్కు మాదిరి ఆన్‌లైన్‌లో ఫేస్‌ మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. వాహనదారులు వాటిని ధరించి రయ్‌న దూసుకెళ్తున్నారు. ఇద్దరు యువకులు ఫేస్‌మాస్కులు ధరించి బషీర్‌బాగ్‌లో వెళ్తుండగా తీసిన చిత్రమిది.

Tags :

మరిన్ని