News in pics : చిత్రం చెప్పే సంగతులు (25-02-2024)

Photo Gallery

Updated : 25 Feb 2024 04:31 IST
1/8
హైదరాబాద్‌: యువతులు, మహిళలు ర్యాంపుపై హొయలొలి కించగా.. తామేమి తక్కువ కాదంటూ చిన్నారులు మెరిసిపోయారు. కంటోన్మెంట్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో శనివారం జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో చిన్నా పెద్దా ర్యాంపువాక్‌తో అలరించారు.

2/8
హైదరాబాద్‌: మేడ్చల్‌ పట్టణం నుంచి రైల్వే కాలనీ వెళ్లే దారిలో వృక్షాలు కనివిందు చేస్తున్నాయి. పచ్చని చెట్లతో వచ్చే గాలితో ప్రయాణం హాయిగా ఉంటోంది.

3/8
ప్రకాశం: ట్రిపుల్‌ ఐటీ (ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణం)లో శనివారం నిర్వహించిన ‘యువ సంవాద్‌’ వేడుక సందడిగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగా, నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.

4/8
విశాఖపట్నం: చెరువులవెనంలో మంచు అందాలను ఆస్వాదిస్తున్న పర్యటకులు

5/8
నెల్లూరు: వ్యాస పూర్ణిమ సందర్భంగా శనివారం జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు.

6/8
మహబూబ్‌నగర్‌: మన్యంకొండ దివ్యకాంతులతో కనువిందు చేస్తోంది.. భక్తుల కొంగు బంగారమైన కోనేటి రాయుడు ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్నాడు..కొండపై నుంచి చూస్తే దిగువన ఉన్న రహదారిలో వెలుగు జిలుగులతో సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. బ్రహ్మోత్సవాల వేళ శనివారం మన్యంకొండలో కనిపించిన అందమైన దృశ్యాలను ‘ఈనాడు’ కెమెరాలో బంధించింది.

7/8
హైదరాబాద్‌: అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా నిరుపేద ప్రజలకు రూ.5లకే భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ పరిధి లాస్ట్‌ బస్టాపులో నాలుగేళ్ల క్రితం ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా డబ్బా తయారు చేయించి ఇక్కడ పెట్టారు. మొదట్లో కొన్ని నెలలు బాగానే నడిచినప్పటికీ.. తర్వాత ఇక్కడ ఆహారం పంపిణీ నిలిపేశారు. దీంతో ఇదిగో ఇలా డబ్బా నిరుపయోగంగా పడి ఉంది.

8/8
హైదరాబాద్‌: కొద్దిరోజులుగా నగరంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం పొగ మంచు.. మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. బైరామల్‌గూడ కూడలిలో శనివారం ఉదయం 8.30గంటలకు కమ్మేసిన పొగమంచును ఈ చిత్రంలో చూడొచ్చు.

Tags :

మరిన్ని