News in pics : చిత్రం చెప్పే సంగతులు (26-02-2024)

Photo Gallery

Updated : 26 Feb 2024 04:10 IST
1/15
హైదరాబాద్‌: అమ్మో ఖడ్గమృగం దూసుకొస్తోంది అని అనుకుంటున్నారా.. శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఓ భారీ హోర్డింగ్‌పైనున్న బొమ్మ ఇది. దూరం నుంచి చూస్తే చెట్ల మధ్య నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తూ.. కనువిందు చేస్తోంది.

2/15
హైదరాబాద్‌:  ప్రభుత్వ దంత వైద్య కళాశాల (ఉస్మానియా) 60వ స్నాతకోత్సవం ఆదివారం రాత్రి పబ్లిక్‌గార్డెన్‌లోని తెలుగు లలిత కళాతోరణంలో వైభవంగా నిర్వహించారు. 2018 బ్యాచ్‌కు చెందిన దంత వైద్య విద్యార్థులు పట్టాలను అందుకున్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.

3/15
హైదరాబాద్‌: ఓవైపు ఆకాశహర్మ్యాలు.. మరోవైపు చకచకా వెలుస్తున్న భవనాలు.. వెరసి ఐటీకారిడార్‌ మరో నగరాన్ని తలపిస్తోంది. ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండడం.. రాత్రివేళ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో విద్యుద్దీపాల కాంతుల్లో రాయదుర్గం నాలెడ్జ్‌సిటీ పరిసరాలు ఇలా వెలిగిపోతున్నాయి.

4/15
మెదక్‌ మండలంలోకి ఈ నీళ్లు ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి మంజీరా నదిలో కలిసి నిజాంసాగర్‌కు చేరుకుంటాయి. ఆదివారం సాయంత్రం ప్రాజెక్టు మత్తడి పారడం ప్రారంభంకాగానే ప్రజలు అక్కడికి వచ్చి సరదాగా గడిపారు.

5/15
మెదక్‌: సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గురుకుల పాఠశాలలో ఆదివారం సీవోఈ పరీక్ష జరిగింది. విద్యార్థులు కేంద్రానికి నిర్ణీత సమయానికే రావడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

6/15
తూర్పుగోదావరి: చేతుల్లో చూడముచ్చటగా బుజ్జి బుజ్జి శునకాలు ఒకవైపు... చూసేందుకే సింహంలా వామ్మో అనిపించేవి మరోవైపు... ఒకటి.. రెండు కాదు.. సుమారు 150 ఒకే వేదికపై కనువిందు చేశాయి. రాజమహేంద్రవరం నగరంలో ఆదివారం  నిర్వహించిన డాగ్‌ షో ముచ్చట గొలిపింది. నగరవాసులు తాము పెంచుకున్న శునకాలతో షోకు తరలివచ్చారు.

7/15
విశాఖపట్నం:  అంతర్జాతీయ బహుళపక్ష నౌకాదళాల విన్యాసాల్లో (మిలాన్‌-2024) భాగంగా నిర్వహిస్తున్న ‘సీ-ఫేజ్‌’ విన్యాసాలు ఆకర్షణీయంగా కొనసాగుతున్నట్టు నేవీ వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. బంగాళాఖాతం జలాల్లో కొనసాగుతున్న విన్యాసాల్లో భారత నౌకలు తమ సత్తా చాటుతున్నాయని వివరించాయి.

8/15
అనంతపురం: నగరంలోని త్యాగరాజ సంగీత గానసభ ప్రాంగణం చిన్నారుల నృత్యంతో సందడిగా మారింది. చిన్నారుల నృత్యాలు వీక్షకులను కట్టిపడేశాయి.ఆదివారం భరతముని జయంతి వేడుకల్లో భాగంగాఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ ఆధ్వర్యంలో నాట్య మయూరి, నాట్య సౌరభం అవార్డులను 30 మంది చిన్నారులకు అందజేశారు.

9/15
నెల్లూరు బాలాజీనగర్‌లోని శ్రీ త్యాగరాజ కల్యాణ మండపంలో ఆదివారం శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం నిర్వహించారు. శిష్యబృందం నాదనీరాజనం, పలువురు సంగీత కళాకారులతో త్యాగరాజ దివ్యనామ సంకీర్తనల ఆలాపన వీనుల విందు చేశాయి.

10/15
మహబూబ్‌నగర్‌: జడ్చర్లలో నిర్వహిస్తున్న ఊర్కొండపేట బీసీ బాలికల గురుకులంలో చదువుకోవాల్సిన విద్యార్థినులతో వంట సిబ్బంది కూరగాయలు కోయిస్తున్నారు. ఆదివారం ఇలా అందరినీ వంటగదిలో కూర్చోబెట్టి చిక్కుడుకాయను ఒలిపించారు.ఈ విషయంపై ప్రిన్సిపల్‌ రవిప్రకాశ్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా మళ్లీ అలా జరగకుండా చూస్తామని పేర్కొన్నారు.

11/15
విశాఖపట్నం: పట్టణంలోని పూడిమడక రహదారిలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రహదారిపై వచ్చిన కుక్కపిల్లను వేగంగా వస్తున్న బైక్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చిన తల్లి రహదారిపై విగతజీవిగా మారిన పిల్లను చూసి రోదించింది.పిల్లను లేపుతున్న తీరును పలువురిని కంటతడి పెట్టించింది. పక్కనే ఉన్న మరో పిల్లను రహదారి పైకి వెళ్లకుండా పట్టుకుంది.

12/15
మహబూబ్‌నగర్‌:  వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని నెల్విడి అనుబంధ గ్రామమైన లక్ష్మీపురంలో రైతు దస్తగిరికి 6 గేదెలు, 3 దూడలు ఉన్నాయి. గ్రామంలో దోమల బెడద అధికంగా ఉండటంతో వాటి బెడద నుంచి గేదెలను తప్పించేందుకు దోమ తెర ఏర్పాటు చేశారు. రోజు రాత్రి వేళ అవి అందులో నిద్రిస్తుంటాయి. పశువులు జబ్బు బారిన పడకుండా పాల దిగుబడి కొంత పెరిగిందని రైతు తెలిపారు.

13/15
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఓ నీరుగట్టు పాము పెట్టిన గుడ్లను విద్యార్థులు ఆసక్తిగా చూస్తున్నారు. శనివారం పట్టణంలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన నీరుగట్టు పామును పట్టుకొచ్చారు. దీన్ని కళాశాలలోని బయోడైవర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ కేంద్రంలో తాతాల్కికంగా ఉంచగా 31 గుడ్లు పెట్టింది. వీటిని హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సంస్థకి పంపుతామని డా.సదాశివయ్య పేర్కొన్నారు.

14/15
హైదరాబాద్‌: ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు నంబరు ప్లేట్లు కనిపించకుండా చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసుల కెమెరాలకు  చిక్కకుండా వాటిని వంకరగా చేయడం.. అడ్డుగా మాస్కులు, ఇతర వస్తువులు పెట్టడం చేస్తున్నారు. బయోడైవర్సిటీ¨ సైబరాబాద్‌ కమిషనరేట్‌ మార్గంలో కనిపించిన వాహనాలివి.

15/15
హైదరాబాద్‌: మినీ ట్యాంక్‌బండ్‌గా పిలుచుకునే సరూర్‌నగర్‌ చెరువు పక్కన గుంత ఇది. వానా కాలంలో వరదనీటితో వచ్చే వ్యర్థాలు చెరువులో కలవకుండా నేరుగా ఇందులో చేరేలా ఈ గుంతను ఏర్పాటు చేశారు. వ్యర్థాలన్నీ ఒకేచోట పోగవుతాయి కాబట్టి ఇక్కడి నుంచి తొలగించి తరలించవచ్చు. కానీ నిధుల లేమితో పూర్తి కాలేదు.

Tags :

మరిన్ని