News in pics : చిత్రం చెప్పే సంగతులు (27-02-2024)

నేటి చిత్రాలు వాటి విశేషాలు మీ కోసం..

Updated : 27 Feb 2024 06:52 IST
1/10
సారవకోట మండలం కిడిమి గ్రామంలో కొలువైన రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈనెల 24 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు సోమవారం ముగిశాయి. మూడు రోజుల పాటు స్థానిక, పరిసర గ్రామాలకు చెందిన భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. అరటి గెలలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాన అర్చకుడు ఈశ్వరరావు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

2/10
 మార్చి ఒకటో తేదీ నుంచి ఆరంభం కానున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు వచ్చేశాయి.  ట్రాన్స్‌పోర్టు వాహనంలో విజయవాడ నగరానికి వచ్చిన ప్రశ్నపత్రాల బండిల్స్‌ను పరీక్షా కేంద్రాల వారీగా కోడ్‌    నంబర్లతో సరిచూసుకుంటున్న వివిధ కళాశాలల లెక్చరర్స్, సిబ్బంది. మాచవరం పోలీస్‌స్టేషన్‌ వద్ద సోమవారం కనిపించిన దృశ్యమిది.

3/10
రైలుపట్టాలపై... రైలు పట్టాలు వెళ్తున్న చిత్రం ఎప్పుడైనా చూశారా..! విజయవాడ నుంచి గుంటూరువైపు గూడ్స్‌ రైల్లో విజయవాడ ఆర్టీసీ బస్టాండు వద్ద ఈ చిత్రం కనిపించింది. పట్టాలపై వెళ్తున్న గూడ్సురైలు రైలుపట్టాలను తీసుకువెళ్తూ చూపరులకు కనువిందు చేసింది.
 
4/10
నిత్యం గలగలమంటూ పారుతూ ఉండే జీవనదిలో ఇసుక తిన్నెలు దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న కొద్దిపాటి నీటిని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిల్వచేసి తాగు, సాగునీటి అవసరాలకు కాల్వల ద్వారా అధికారులు మళ్లిస్తున్నారు. ఫలితంగా దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం దాదాపుగా తగ్గిపోయింది.

5/10
ఆస్ట్రేలియా ఉసిరి గుత్తులు గుత్తులుగా విరగకాసి అందర్నీ ఆకర్షిస్తోంది. ఉండ్రాజవరం మండలం తాడిపర్రుకు చెందిన రాగు లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఈ చెట్టుంది. విశాఖలోని తమ బంధువుల ద్వారా ఆస్ట్రేలియా నుంచి ఈ మొక్కను తీసుకువచ్చి నాటారు. ప్రస్తుతం ఇది ఏపుగా పెరిగి కాయలు కాసింది. దొండకాయల ఆకృతిలో ఉన్నందున ఈ ఉసిరిని దొండ ఉసిరిగా వ్యవహరిస్తున్నారు.

6/10
చినముషిడివాడ శాంతినగర్‌కు చెందిన శ్రీనిర్మల నృత్యనికేతన్‌ విద్యార్థులు అయోధ్య కూచిపూడి నృత్య ప్రదర్శనకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 28న రామ భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో అయోధ్య వెళ్లి అక్కడ శ్రీరామకీర్తనలకు కూచిపూడి ప్రదర్శన చేయనున్నట్లు నాట్యాచారిణి బి.విజయజ్యోతి తెలిపారు. ఈ మేరకు నృత్య విద్యార్థులు గత మూడు రోజులుగా సాధన చేస్తున్నట్లు వివరించారు.

7/10
 నగర ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆహార అలవాట్లలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాత్రి వేళల్లో పట్టణ వీధుల్లో కట్టెల పొయ్యిలపై జొన్న రొట్టెలు చేసి అమ్మేవారికి గిరాకీ పెరిగింది. దీంతో జొన్న రొట్టెలు అమ్ముకొని జీవనం సాగించే వారి సంఖ్య నల్గొండ పట్టణంలో పెరిగింది.నల్గొండలో పొయ్యిపై జొన్నరొట్టే కాలుస్తున్న మహిళ చిత్రాన్ని ‘ ఈనాడు’ తన కెమెరాలో బంధించింది

8/10
వర్ధమాన నటి రాశీఖన్నా సోమవారం బంజారాహిల్స్‌ తాజ్‌కృష్ణలో ‘యోధ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సందడి చేశారు. ఈ సినిమాలో తాను తెలుగమ్మాయిగా నటించినట్లు ఆమె తెలిపారు. హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా మాట్లాడుతూ.. తెలుగులో రాజమౌళి దర్శకత్వం అంటే ఇష్టమన్నారు. మంచి కాంబినేషన్‌ కుదిరితే తెలుగులో నటిస్తానని చెప్పారు. 

9/10
హాకీ ఆటలో నిమగ్నమైన వీరంతా సరూర్‌నగర్‌ విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ విద్యార్థులు. నిత్యం ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు వీరి క్రీడా సాధన, కసరత్తులు సాగుతాయి. తరువాత 9.30 గంటల నుంచి  తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పడతారు. 

10/10
అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్ల    అభివృద్ధి పనులను   ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆకట్టు కున్నాయి.

Tags :

మరిన్ని