News in pics : చిత్రం చెప్పే సంగతులు (28-02-2024)

నేటి చిత్రాలు వాటి విశేషాలు మీ కోసం..

Updated : 28 Feb 2024 03:54 IST
1/10
హైదరాబాద్‌: మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో సంజన ప్లే స్కూల్‌ మారుతీవీధి, ఆల్వాల్‌ శాఖల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుడిబుడి నడకలతో బుజ్జాయిలు వేసే స్టెప్పులు చూస్తూ తల్లిదండ్రులు, ప్రేక్షకులు మైమరచిపోయారు. ఆటపాటలతో పాటు ఆధ్యాత్మిక నాటికలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

2/10
హైదరాబాద్‌: సీతాఫల్‌మండి ప్రధాన రహదారి పక్కన వెలగ పండ్లను ఇలా పోసి అమ్ముతున్నారు.

3/10
నిజామాబాద్‌:  నిండా ఎర్రటి పుష్పాలతో అందరినీ ఆకట్టుకుంటూ..హోలీ పండుగ నాడు రంగులద్దడానికి సిద్ధమైంది మోదుగ చెట్టు.వేసవిలోకి అడుగుపెడుతున్న వేళ.. ఆకులన్నీ రాలిపోయి.. ఎర్రటి పూలతో మోదుగ చెట్టు ఆకట్టుకుంటున్న దృశ్యాన్ని పిట్లం మండలం చిన్నకొడప్‌గల్‌ శివారులో ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

4/10
చిత్తూరు: జిల్లాలోని కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో అధికంగా రైతులు కూరగాయలు సాగుస్తుంటారు. వీటిని కర్ణాటకకు సైతం ఎగుమతి చేస్తుంటారు. అందులో భాగంగా వి.కోట వద్ద రైతులు సాగు చేసిన క్యాబేజీ కళకళలాడుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం పంటకు మంచి ధరలు వస్తుండటంతో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు.

5/10
గుంటూరు వైద్య కళాశాలలో 73వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఐదేళ్ల కష్టం ఫలించిన తరుణంలో ఇలా ఆనందం వ్యక్తం చేశారు.

6/10
ప్రకాశం: ఒంగోలు నగరంలోని ఓ డిగ్రీ కళాశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు మంగళవారం చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తోటి మిత్రుల ఎదుట ఆనందంగా ప్రదర్శిస్తారు. వారితో కలిసి సందడి చేస్తారు.

7/10
విశాఖపట్నం: తూటిపాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు బి.రవికుమార్‌ ఆవగింజలతో సర్‌ సి.వి.రామన్‌ ముఖ చిత్రాన్ని రూపొందించాడు. జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా ఆరు గంటలు శ్రమించి 817 ఆవగింజలతో ఆయన ముఖచిత్రాన్ని రూపొందించానని కళాకారుడు తెలిపారు.

8/10
నిజామాబాద్‌ నుంచి జన్నేపల్లి వరకున్న ఫులాంగ్‌ వాగుని గుర్రపు డెక్క, తుంగ కప్పేసింది. దీంతో పచ్చని మైదానాన్ని తలపిస్తోంది. ఫలితంగా చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. చేపల వేట సాధ్యం కాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి తొలగించాలని కోరుతున్నారు.

9/10
నల్గొండ: సంస్థాన్‌ నారాయణపురం మండలంలో రైతులు అధికంగా వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. సంస్థాన్‌ నారాయణపురంలో ఓ రైతు ఎండిన పంట పొలాన్ని చేసేదేమి లేక మూగజీవాలను మేతగా మేపుతుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

10/10
మహబూబ్‌నగర్‌:  మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణులు.. విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం మిడ్జిల్‌ మండలంలోని వేముల-మసిగుండ్లపల్లి గ్రామ రహదారిపై ఆటోలో విద్యార్థులు ప్రమాదకరంగా నిలబడి వెళ్తున్న దృశ్యం ‘న్యూస్‌టుడే‘ కెమెరాకు చిక్కింది.

Tags :

మరిన్ని