News in pics : చిత్రం చెప్పే సంగతులు (29-02-2024)

నేటి చిత్రాలు వాటి విశేషాలు మీ కోసం..

Updated : 29 Feb 2024 04:31 IST
1/12
ఆదిలాబాద్‌: మామడ మండలం పొన్కల్‌కు చెందిన పదోతరగతి విద్యార్థి పి.లక్ష్మణ్‌ ఓ చక్కని ఆవిష్కరణతో అందరి మన్ననలు అందుకున్నాడు.. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా  బాల లక్ష్మణుడు మాత్రం అయోధ్యలో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న భవ్యరామమందిర నమూనాను చూడ ముచ్చటగా తీర్చిదిద్దాడు.

2/12
మెదక్‌: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. బుధవారం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో పలువురు పాల్గొని సైన్స్‌ ఆవశ్యకతను తెలియజేశారు. సంబంధిత విభాగాధిపతి రతన్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

3/12
నల్గొండ: సుప్రభాతం వేళ కమ్ముకున్న మంచు తెరలతో యాదాద్రి పుణ్యక్షేత్రం శ్వేత మయంగా మారింది. పంచనారసింహుల సన్నిధితో పాటు శివాలయం, మాడ వీధులు, మెట్ల దారి మంచు పొగలతో నిండిపోయాయి. కనుమ దారిలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉదయం 8.30 గంటల వరకు మంచుతెరల కమ్ముకున్నాయి.

4/12
అమరావతి: వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం ఎఫోసెక్‌-2024 జాతీయస్థాయి టెక్నో ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి విచ్చేసిన యువతీ యువకులు ఆధునిక, సాంకేతిక, సృజనాత్మక అంశాలతో ప్రతిభ చాటగా.. కళారూపాలు, నృత్యాలతో శెభాష్‌ అనిపించారు.

5/12
6/12
ప్రకాశం: జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు, కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ సృజనకు పదును పెడుతూ పలు ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శనకు ఉంచారు.

7/12
తమిళనాడు: చెన్నై టీనగర్‌లోని శ్రీపద్మావతిఅమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి చిన్న శేష వాహనంపై అమ్మవారు భక్తకోటికి దర్శనభాగ్యం కల్పించారు.

8/12
నల్గొండ: వేసవిలో సాధారణంగా చెట్ల ఆకులు రాలి మోడువారినట్లు కనిపిస్తాయి యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామ పరిధిలో నిండుగా పూలు పూసి కనివిందు చేస్తున్న మోదుగ చెట్టును బుధవారం ‘ న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

9/12
హైదరాబాద్‌: వీరంతా బడంగ్‌పేట్‌లోని రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న యువత. గ్రూప్‌-1, విద్యుత్‌ సంస్థల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడటం, భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వ హామీతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

10/12
గుంటూరు నగరం కేవీపీకాలనీ శివారులో విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. వీటి కారణంగా ప్రమాదం జరిగి ప్రాణాలు పోకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

11/12
హైదరాబాద్‌: జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో వైజ్ఞానిక ప్రదర్శన బుధవారం ముగిసింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వచ్చి తిలకించారు. పలువురు ఇస్రో చంద్రయాన్‌ యాత్ర విశేషాలు తెలుసుకొని ముఖాలకు చిత్రాలతో సందడి చేశారు.

12/12
హైదరాబాద్‌: నగరంలో నిత్యం ఏదో ఒకచోట రహదారి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో చాలావరకు వాహనదారుల నిర్లక్ష్యమే కారణం. కొందరు అపసవ్య దిశలో వెళ్తూ.. ప్రమాదకరంగా కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. కొంపల్లి, సుచిత్ర సర్కిల్‌ వద్ద కనిపించిన దృశ్యాలివి.

Tags :

మరిన్ని