News in pics : చిత్రం చెప్పే విశేషాలు (30-03-2024/1)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 30 Mar 2024 06:34 IST
1/16
2/16
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సమీపంలోని సాగర తీరంలో శుక్రవారం ‘టైగర్‌ ట్రయంప్‌’ పేరిట భారత్‌- అమెరికా దేశాల త్రివిధ దళాలు విన్యాసాలు ప్రదర్శించాయి. ఐఎన్‌ఎస్‌ ఐరావత్, ఐఎన్‌ఎస్‌ కేసరి, జర్మన్‌టౌన్‌ యుద్ధ నౌకలు, యూఎస్‌ 53 ఎయిర్‌ క్రాఫ్ట్, యూఎస్‌3 హెచ్‌ చేతక్‌ హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు.. సాహస ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 1100 మంది సైనికులు పాల్గొన్నారు. 

3/16
4/16
ఎంఎస్‌.ధోని
ఎంఎస్‌.ధోని
5/16
నగరంలోని పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎంఎస్‌.ధోనితో పాటు, ఇరుజట్ల క్రికెటర్లను చూసేందుకు, స్వీయచిత్రాలు దిగేందుకు క్రీడాభిమానులు ఉత్సాహం చూపారు. అనంతరం జట్టు సభ్యులు ప్రత్యేక బస్సులో నగరంలోకి వెళ్లారు.

6/16
వేసవి తాపానికి పక్షులు ఉపశమనం పొందే విధంగా రామడుగు మండలం గోపాల్‌రావుపేట పల్లెప్రకృతి వనంలో శుక్రవారం నీటి తట్టాలు ఏర్పాట్లు చేశారు. అయిదేసి చెట్లకు ఒక్కో ప్లాస్టిక్‌ తట్టా పెట్టి నీటిని నింపారు. సాధారణంగా వేసవిలో నీటి కొరతను ఎదుర్కొనే పిచ్చుకలు, ఇతర పక్షులు దాహార్తి తీర్చుకునే విధంగా నిర్జన ప్రదేశంలో ఏర్పాటు చేశారు.

7/16
కరీంనగర్‌ బస్టాండ్‌లో శుక్రవారం సీట్ల కోసం ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. ఆదిలాబాద్, లక్షెట్టిపేట్, వరంగల్, జగిత్యాల తదితర రూట్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది. బస్సులు ప్లాట్‌ఫాంల వద్దకు రాకుండానే సీట్ల కోసం ప్రయాణికులు పరుగు తీశారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు రోజు కావడంతో రద్దీ పెరిగిందని అంటున్నారు.

8/16
ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలకు వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. ఉట్నూరు మండలంలోని సాక్ర(కే) గ్రామంలో 30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ వారం రోజుల్లో ఒక్కసారి.. అదీ అరగంటపాటు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. 

9/16
నగరంలో ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఫుడ్‌ స్టాళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా రసూల్‌పురకు చెందిన ఓ వ్యక్తి కొంపల్లి ప్రాంతంలో ఎర్ర బస్సు కిచెన్‌ పేరుతో అందుబాటులోకి తెచ్చిన స్టాల్‌ అచ్చం ఆర్టీసీ బస్సును పోలినట్లుగా ఉంది.
 
10/16
 ఎండలు మండుతుండడంతో కూలర్లకు డిమాండ్‌ పెరిగింది.  జేఎన్టీయూ మెట్రో స్టేషన్‌ వద్ద ఓ షాపులో రాత్రివేళ కూడా కనిపించిన కొనుగోలుదారుల సందడి.

11/16
ఎండలు మండుతున్నాయి. విద్యార్థులు నీట్‌ ఎంసెట్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఎండ వేడికి త్వరగా అలసిపోకుండా ఎల్‌బీ నగర్‌లోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ విద్యార్థుల కోసం ప్రతి గదికి ఏసీలను అమర్చింది.

12/16
నగర సందర్శనకు వచ్చిన వారు సచివాలయం పరిసరాల్లో ఆహ్లాదంగా గడిపి.. అలసిపోయి అక్కడి పచ్చికబయలుపై సేదదీరుతూ కనిపించారు.

13/16
14/16
 లోకంలో శాంతి స్థాపనకు, మానవాళి మనుగడకు ఏసుక్రీస్తు ప్రాణ త్యాగం చేశారని పలువురు పాస్టర్లు సందేశమిచ్చారు. శుభ శుక్రవారం సందర్భంగా నగరంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీస్‌ చర్చిలో, అబిడ్స్‌ ఆల్‌ సైన్స్‌ స్కూల్‌ మైదానంలో నిర్వహించిన ప్రదర్శనలో ఏసు జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. మియాపూర్‌లోని కల్వరి టెంపుల్‌కు భారీగా క్రైస్తవులు హాజరై సందేశాన్ని ఆలకించారు.

15/16
16/16
 శిల్పారామంలో శుక్రవారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమధుర ఆర్ట్స్‌ అకాడమీ విద్యార్థులు చూడముచ్చటైన కూచిపూడి నృత్యంతోపాటు ఉషారెత్తించే జానపద నృత్యప్రదర్శనలతో అలరించారు. కీర్తనలకు అనుగుణంగా వారు ప్రదర్శించిన దశావతారం, శివాష్టకం, గణేశాపంచరత్న నృత్యాంశాలు కనువిందుగా సాగాయి.

Tags :

మరిన్ని