News in pics : చిత్రం చెప్పే విశేషాలు (01-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 01 Apr 2024 04:14 IST
1/15
హైదరాబాద్‌: సాగర్‌ తీరంలోని నెక్లెస్‌ రోడ్డులో ఆదివారం వేలాది మంది పరుగులు పెడుతూ సందడి చేశారు. ఐఐఎఫ్‌ఎల్‌ ‘జీతో అహింసా రన్‌ ఫర్‌ శాంతి’ పేరుతో నిర్వహించిన పరుగును రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ ప్రారంభించారు. మరోవైపు ‘రన్‌ ఫర్‌ ఏ కాజ్‌’ పేరుతో 5కె మారథాన్‌ నిర్వహించారు. పెద్దఎత్తున యువత పాల్గొని పరుగు తీశారు. జుంబా డ్యాన్స్‌తో అదరగొట్టారు.

2/15
హైదరాబాద్‌: భానుడి భగభగలకు అల్లాడుతున్న నగరవాసులు కాస్త సేద తీరేందుకు హుస్సేన్‌సాగర్‌ పరిసరాలకు చేరుకుంటున్నారు. ఇక్కడి జలవిహార్, లుంబినీ పార్కులో ఫౌంటెయిన్ల వద్ద నీటితో ఆడుతూ ఆహ్లాదంగా గడుపుతున్నారు.

3/15
హైదరాబాద్‌: కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వేడిలో నగరవాసులు బయటికి రావాలంటే జంకుతున్నారు. పనులపై వచ్చినవారు సైతం చెరకు రసం, పండ్ల రసాలు, నీళ్లు తాగుతున్నారు. ముఖాలను పూర్తిగా ముసుగుతో కప్పిఉంచుతూ ప్రయాణిస్తున్నారు.

4/15
ఆదిలాబాద్‌: మహారాష్ట్రలోని సిరోంచా తాలుకా ఆసరెల్లి అటవీశాఖ రేంజి కార్యాలయ ప్రవేశం ద్వారం నుంచి కార్యాలయం వరకు ఎడ్ల బండ్ల చక్రాలను ఇలా చూడముచ్చటగా అమర్చారు. రెండువైపులా ప్రహరీ మాదిరి ఏర్పాటు చేయడంతో కనువిందు చేస్తున్నాయి.

5/15
విశాఖపట్నం: చింతపల్లి సమీపంలోని చౌడుపల్లిలో ప్రస్తుతం వివిధ రంగుల్లో ఉన్న దాలియాపూలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. చింతపల్లి ఉద్యాన శాఖ అధికారి కంఠా బాలకర్ణ తన వ్యవసాయ క్షేత్రంలో, ఇంటి పెరట్లో హైబ్రిడ్‌ రకానికి చెందిన కొన్ని రకాల దాలియా పూలను తీసుకొచ్చి పెంచుతున్నారు.

6/15
నిజామాబాద్‌: ఆహ్లాదకర వాతావరణంలో చదువుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇలాంటి పచ్చని చెట్ల కింద చదవాలంటే నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీలోని ప్రాంతీయ గ్రంథాలయానికి రావాలి. ఈ గ్రంథాలయానికి నిత్యం పదుల సంఖ్యలో వస్తున్నారు. గదులు నిండిపోవడంతో ప్రాంగణంలో ఉన్న పచ్చని చెట్ల కింద ఇలా చదువుకుంటున్నారు.

7/15
గుంటూరు: మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆస్థానాలంకారాల్లో ఆదివారం స్వామి వారు గోవర్ధనోద్ధరణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాక్షసులు సృష్టించిన ప్రళయం నుంచి గోపికలు, గోవులను రక్షించేందుకు స్వామి శ్రీకృష్ణుని అవతారమెత్తిన సందర్భానికి ఇది ప్రతీక అని ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసదీక్షితులు తెలిపారు.

8/15
అమరావతి: ఈస్టర్‌ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చర్చిల్లో ప్రార్థనలు మిన్నంటాయి. దివ్య పూజాబలి తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఏసు పునరుత్థానమే సర్వ మానవాళికి పర్వదినమని మతపెద్దలు దైవసందేశం అందించారు.

9/15
హైదరాబాద్‌: చందానగర్‌ సరస్వతీ విద్యామందిర్‌ ఉన్నత పాఠశాలలో ద క్రియేటివ్‌ వరల్డ్‌ అకాడమీ ఆఫ్‌ డ్రాయింగ్‌ పెయింటింగ్‌  అకాడమీ ఛైర్మన్‌ సుప్రియ ఆధ్వర్యంలో 146 మంది విద్యార్థులు వేసిన బొమ్మలు ప్రదర్శించారు.చిన్నారులు వేసిన చిత్తరువులు.. జీవకళ ఉట్టిపడేలా గీసిన చిత్రాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

10/15
తూర్పుగోదావరి: కొవ్వూరు ప్రధాన రహదారికి ఒకవైపు పూర్తిగా సరిపోయేంత పడవలు శనివారం, ఆదివారాల్లో లారీలపై ప్రయాణించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతటి పడవలు గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్‌ కోసమా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు వీటిని ఎందుకు వినియోగిస్తారో తెలియాల్సి ఉంది.

11/15
అనంతపురం: కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లికి చెందిన జయరాం చౌదరి నాలుగెకరాల్లో టమాటా సాగు చేశారు. పంటంతా పూతదశలో ఉంది. ఎండ తీవ్రతకు మొక్కలు మాడిపోతున్నాయి. ఇందుకు రూ.20 వేలు పెట్టి వెయ్యి పాత చీరలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కళ్యాణదుర్గం, పావుగడ ప్రధాన రహదారిలో వెళ్తే రంగు రంగుల చీరల పందిళ్లను చూడొచ్చు.

12/15
హైదరాబాద్‌: క్రీడల్లో విజేతలుగా నిలవాలంటే కఠోర సాధన అవసరం. అందుకు అనుగుణంగా ఇందిరా పార్కు వద్ద స్కేటింగ్‌లో తర్ఫీదు పొందుతున్న చిన్నారులు తెల్లవారుజామున సచివాలయం వద్ద ఇలా కనిపించారు.

13/15
ఆదిలాబాద్‌: తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన కస్తూరి శివకుమార్‌ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటారు. వేసవిలో పక్షులు నీటి కోసం ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించి అయిదేళ్లుగా వాటికి నీటిని అందిస్తున్నాడు. ప్లాస్టిక్‌ బాటిళ్లతోపాటు మట్టి పాత్రలను ఉపయోగించి నీటిని నిల్వ ఉంచేలా తయారు చేస్తున్నాడు. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా పక్షులకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని శివకుమార్‌  చెబుతున్నారు.

14/15
హైదరాబాద్‌: నాంపల్లి రోడ్డులో మధ్యాహ్నం ఎండలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు అవస్థపడుతూ కనిపించింది. మాసబ్‌ట్యాంక్‌కు చెందిన డాక్టర్‌ అన్వర్‌ ఆమెకు భోజన ప్యాకెట్‌ అందించడంతో పాటు శీతల పానీయం తాగించి పెద్ద మనసును చాటుకున్నారు.

15/15
మహబూబ్‌నగర్‌: వీపనగండ్ల మండలం గోపల్‌దిన్నె జలాశయంలో నీటి మట్టం తగ్గుతోంది. నీళ్లు ఎక్కువగా ఉంటే చిన్న చేపలు పడేవని, ప్రస్తుతం నీరు తగ్గడంతో పెద్దసైజు చేపలు వలకు చిక్కుతున్నాయని మత్స్యకారులు తెలిపారు. ఆదివారం వారు వేసిన వలలకు 5 నుంచి 15 కిలోల బరువు ఉన్న చేపలు చిక్కాయి.

Tags :

మరిన్ని