News in pics : చిత్రం చెప్పే విశేషాలు (02-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 02 Apr 2024 03:49 IST
1/10
హైదరాబాద్‌: ఎండలు పెరుగుతున్నాయి. ఆరోగ్యం, చల్లటి నీటి కోసం రకరకాల కుండలు, మట్టిపాత్రలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. మట్టితో చేసిన నీటి సీసాలు, జగ్గులు, క్యాన్‌లకు వివిధ రకాల పెయింటింగ్స్‌ వేసి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కూకట్‌పల్లి సుమిత్రనగర్‌ వద్ద విక్రయానికి ఉంచిన వీటిని చూసిన పలువురు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు.

2/10
స్వతంత్ర ఒడిశాకు 88 ఏళ్లు పూర్తయ్యాయి. సోమవారం 89వ వసంతంలోకి ఉత్కళ జననీ అడుగుపెట్టింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ తన శిష్యులతో కలిసి 40 టన్నుల ఇసుకతో పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చి దిద్ది రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

3/10
అనంతపురం: ఖాద్రీ లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాల్లో 14వ రోజున (సోమవారం) జనార్దనుడి జలక్రీడ ఉత్సవం సంబరంగా జరిగింది. ఉత్సవానికి ఊరు, వాడా తరలివచ్చి రంగులు చల్లుకుని ఆనందంలో మునిగి తేలియాడారు.తిరువీధుల ఊరేగింపులో స్వామివారి ముందు పురజనులు రంగోళి ఆడారు.

4/10
మహబూబ్‌నగర్‌: వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని కొన్నూర్‌ గ్రామానికి చెందిన రతన్‌లాల్‌ వినూత్నరీతిలో ఆలోచించారు. రూ.3,500 ఖర్చు చేసి మూడు షేడ్‌నెట్లు, ఇనుప పరికరాలు కొనుగోలు చేశారు. తన ఇంటి పైకప్పుపై షెడ్‌నెట్‌తో టెంట్‌ మాదిరిగా ఏర్పాటు చేసుకున్నారు. షెడ్‌నెట్‌ ఏర్పాటు చేయడంతో మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చల్లగా ఉంటుందని తెలిపారు.

5/10
హైదరాబాద్‌: బేగంపేట మెట్రోస్టేషన్‌ పైవంతెన రోడ్డులో.. సోమవారం మిట్ట మధ్యాహ్నం ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసును చూసి వాహనదారులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. చాలామంది పాపం అనుకుంటూ ముందుకు సాగారు. కొందరు బొమ్మ అని గుర్తు పట్టి విస్మయం చెందారు. గో..స్లో బోర్డుతో వాహనదారులను అప్రమత్తం చేస్తోందీ బొమ్మ.

6/10
కర్నూలు: పాణ్యం మండలం తమ్మరాజుపల్లిలో వై.శ్రీనివాసరావు నాలుగు ఎకరాల్లో మామిడి తోట సాగు చేశారు. ఎండకు కాయలు వాడిపోయి రాలిపోతుండటంతో రక్షించుకునేందుకు వాటికి పాలి కవర్‌ చుట్టారు. దీంతో ఎండకు దెబ్బతినదని.. పక్షలు, ఇతరత్రా చీడపీడల నుంచి రక్షణ కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

7/10
నల్గొండ: దేవలమ్మనాగారంలోని పురాతన చెరువులో నీళ్లు ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో గొర్రెల మందలు దాహార్తి తీర్చుకునేందుకు వస్తున్నాయి. వర్షాలు లేక మూగ జీవాలకు మేత కరవైందని, ఎండిన వరి చేలలో మేపి నీళ్లు తాగేందుకు గొర్రెలను, మేకలను ఈ చెరువు వద్దకు తీసుకురావడం కరవు తీవ్రతకు అద్దం పడుతుంది.

8/10
హైదరాబాద్‌: భానుడి ప్రతాపానికి భారీ జలాశయాలే ఎండిపోతుంటే నీటి కొలనులు ఏపాటి.. పబ్లిక్‌ గార్డెన్‌లోని కొలను నెలక్రితం నీటితో నిండుగా కనిపించింది. ఇటీవల ఎండలు తీవ్రమవడంతో చుక్క లేకుండా ఎండిపోయింది. రానున్న నీటి కష్టాలను ఈ చిత్రం చెప్పకనే చెబుతోంది.

9/10
అమరావతి: విజయవాడ నగర సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో పర్యాటకులను ఆకర్షించేలా దుర్గగుడి పైవంతెన కింద పిల్లర్లకు వాల్‌ గార్డెన్, పార్కులు ఏర్పాటు చేశారు. ఇప్పుడా పచ్చదనంపై నగరపాలక సంస్థ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.. పిల్లర్లకు ఏర్పాటు చేసిన మొక్కల కుండీలు ఊడిపోయి అధ్వానంగా మారాయి.ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

10/10
హైదరాబాద్‌: లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు నగరంలో ప్రచార సామగ్రిని సిద్ధం చేయిస్తున్నారు. ఆధునిక హంగులతో నాణ్యమైన సామగ్రిని అందిస్తుండటంతో అన్ని పార్టీల దృష్టి  నగరంపైనే ఉంది. తయారైన భారాస ప్రచార వాహనాలు జిల్లాలకు తరలివెళుతూ బషీర్‌బాగ్‌లో కనిపించాయి.

Tags :

మరిన్ని