News in pics : చిత్రం చెప్పే విశేషాలు (03-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 03 Apr 2024 04:20 IST
1/14
హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మెట్టుగూడ వద్ద ఓ గోడపై వేస్తున్న వందేభారత్‌ రైలు బొమ్మ అటుగా వెళ్లే వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. పొడవైన గోడపై పచ్చని చెట్ల మధ్యలోంచి అచ్చంగా రైలు వెళ్తున్నట్లు చూపరులకు కనువిందు చేస్తోంది.

2/14
హైదరాబాద్‌: శేరిలింగంపల్లి హుడా ట్రేడ్‌ సెంటర్‌లోని సృజన కిడ్స్‌ పాఠశాలలో ఉత్సాహంగా గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సందడి చేశారు.

3/14
హైదరాబాద్‌: దుబాయ్‌ బజార్‌ వీధులు ఎండ ధాటికి పగలంతా నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం తర్వాతే ప్రజలు రోడ్డెక్కుతున్నారు. దీంతో రాత్రిపూట ఆ ప్రాంతమంతా విద్యుద్దీపాల ధగధగలు.. పండగ కొనుగోళ్లతో కిక్కిరిసి సందడిగా కనిపిస్తోంది.

4/14
వరంగల్‌: మడికొండలోని ఓ కార్యాలయ ప్రాంగణంలో సక్యులెంట్ జాతికి చెందిన పెడిలాంథస్‌ టిథైమలోయిడ్స్‌ మొక్కకు పూసిన పూలివి. ఈ మొక్కను తెలుగు బాషలో కంచిపాల మొక్క అని పిలుస్తారని పర్యావరణ ప్రేమికుడు నాగేశ్వర్‌రావు తెలిపారు.ఈ తరహా మొక్కలను కార్యాలయాలు, నివాసాలు, గార్డెన్లలో అలంకరణ కోసం పెంచుకుంటారన్నారు.

5/14
ఆదిలాబాద్‌ జిల్లాలో అరుదైన గుడ్లగూబ జంట ప్రత్యక్షమైంది. జిల్లాకు చెందిన వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ లింగంపల్లి కృష్ణ మంగళవారం స్థానిక గాంధీ ఉద్యానవనంలో గుర్తించి తన కెమెరాలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్‌ అటవీ క్షేత్రాధికారి గులాబ్‌సింగ్‌ అక్కడకు చేరుకొని స్వయంగా గుడ్లగూబను పరిశీలించి అరుదైనదిగా నిర్ధారించారు.

6/14
కర్ణాటక: బెంగళూరు వైట్ఫీˆల్డ్‌లోని జేఎఫ్‌వీ టెక్నాలజీ సెంటర్‌లో జీఈ సంస్థ వెయ్యి డ్రోన్లతో ఆకాశంలో తన లాంఛనాలను ప్రదర్శించింది. జీఈ ఏరోస్పేస్, హెల్త్‌కేర్, వెర్నోవా శాఖల లాంఛనాలను కనిపించేలా డ్రోన్లు ఈ దీపాలను వెలిగించి, లాంఛనాన్ని ఆవిష్కరించడం మంగళవారం రాత్రి చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది.

7/14
విశాఖపట్నం జిల్లా ఆనందపురం కూడలి సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ గృహం అందరినీ ఆకర్షిస్తోంది. పసుపు వర్ణంలో పెరిగిన తీగజాతి పూలు ఇంటి పైకప్పు మొత్తంగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. ఈ మార్గంలో వెళ్లే చాలా మంది ఇక్కడ సెల్ఫీలు దిగేందుకు ముచ్చట పడుతున్నారు.

8/14
హైదరాబాద్‌:  కారణం ఏంటో కానీ అడ్డంగా నరికి వదిలేశారు. అయితేనేం నిలువెల్లా చిగురిస్తూ ఆకట్టుకుంటోంది ఓ భారీ వృక్షం. ఆఫ్జల్‌గంజ్‌ బస్టాండ్‌ వద్ద కనిపించిన చిత్రం.

9/14
హైదరాబాద్‌: భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు. అత్యవసరమైతే రక్షణ చర్యలు చేపట్టాల్సిందే. వరుసగా అశోక్‌నగర్, సచివాలయం, శంషాబాద్‌లో కనిపించిన చిత్రాలివి.

10/14
మెదక్‌: గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. మంగళవారం వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. పూజల  అనంతరం హంస వాహనంపై ఊరేగించారు.

11/14
ఖమ్మం: వైరానదిలో ఈసారి ఫిబ్రవరి నెల నుంచే నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో అప్పటి నుంచి ఇసుక తవ్వకాలు జోరుగా నడిచాయి. ఫలితంగా మధిర శివాలయం నుంచి రాయపట్నం రేవు వరకు ఇసుక కొరత ఏర్పడింది. మంగళవారం రాయపట్నం బ్రిడ్జి సమీపంలో ఎద్దుల బండ్లు ఒకే చోటికి చేరి ఇసుకను నింపుతున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మన్పించింది.

12/14
నల్గొండ మండలం ముషంపల్లి గ్రామ చెరువులోని నీళ్లన్నీ ఆవిరైపోయాయి.. చెరువు కింద చేపట్టిన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఓ వైపు బోరులేస్తుంటే..  మరోవైపు మిగిలిన ఈ గుక్కెడు నీటి కోసం తెల్ల కొంగలు నీటి చుట్టూ చేరాయి.. ఈ దృశ్యాన్ని ‘ఈనాడు’తన కెమెరాలో బంధించింది.

13/14
ఖమ్మం:  వైరా జలాశయం నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు. మంగళవారం నాటికి 10 అడుగులకు పడిపోయింది.మిషన్‌ భగీరథ పథకం ద్వారా వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని సుమారు 450కి పైగా గ్రామాలకు నిత్యం 10 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ కేటాయించాలని రెండు నెలలుగా జలవనరులశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు.

14/14
హైదరాబాద్‌: ఎండలు మండుతున్నాయి.. పెద్దపెద్ద వృక్షాలు సైతం నిలువునా ఎండిపోతున్నాయి. సంజీవయ్య పార్కులో మోడువారిన ఓ వృక్షాన్ని తిరిగి చిగురింప చేసేందుకు నీరు పెడుతున్న మహిళ.

Tags :

మరిన్ని