News in pics : చిత్రం చెప్పే విశేషాలు (04-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 04 Apr 2024 04:16 IST
1/12
హైదరాబాద్‌: నగరంలోని నెహ్రూ జూపార్క్‌లో సరస్వతి అనే పేరుగల ఖడ్గమృగం మూడు నెలల కిందట ప్రసవించింది. దానికి ప్రేమ అని పేరు పెట్టారు. నిర్వాహకుల సంరక్షణలో ఉన్న ఆ బుజ్జి ఖడ్గమృగాన్ని పది రోజుల కిందట తల్లి వద్దకు చేర్చారు. అవి రెండూ కలిసి తిరుగుతూ సందడి చేస్తుండటంతో సందర్శకులు మురిసిపోతున్నారు.

2/12
ఖమ్మం నగరం ప్రకాశ్‌నగర్‌లోని విద్యాసాగర్‌రావు పార్క్‌ అభివృద్ధిలో భాగంగా పాడైన ఆటో, ట్రాక్టర్‌ ట్రాలీలకు రంగులద్దారు. సందర్శకులను ఆకట్టుకునేలా, చిన్నారులు ఆడుకునేలా వీటిని తీర్చిదిద్దారు.

3/12
ఆదిలాబాద్‌: కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని తాళ్లపేట రేంజి మల్యాల్‌ వాచ్‌ టవర్‌ ప్రాంతంలో ప్రకృతి అందాలు చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. ఎండల్లో హాయ్‌ హాయ్‌ అంటూ వారాంతాల్లో ఇక్కడికి వచ్చే వారు సఫారీ వాహనాల్లో రయ్‌ రయ్‌ మంటూ తిరుగుతున్నారు.

4/12
ఖమ్మం: పాల్వంచ మండలం దంతెలబోర నుంచి ఏపీలోని కుక్కునూరు మండలం సీతారామనగరం వరకు 2012లో అప్పటి ప్రభుత్వం రహదారికి రెండువైపులా మొక్కలు నాటించింది. అవి నేడు పెరిగి పెద్దవయ్యాయి. 4 కి.మీ. నిడివిలో ప్రయాణికులకు చల్లటి నీడనిస్తున్నాయి. వేసవిలో బాటసారులు, వాహనదారులు ఆహ్లాదం పొందుతున్నారు.

5/12
హైదరాబాద్‌: చార్మినార్‌ నుంచి మదీనా వరకు రాత్‌బజార్‌లో పర్యాటకుల సందడి నెలకొంది. రంజాన్‌ పండగ 8 రోజులు మాత్రమే ఉండడంతో కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిసిపోయాయి. వీధి దీపాల కాంతులతో జిగేల్‌మనిపించింది.

6/12
మెదక్‌: సిద్దిపేట పట్టణ పరిధిలోని గాడిచర్లపల్లికి చెందిన రైతు రాజు టమాటా చేనును తీవ్రమైన ఎండ నుంచి రక్షించుకునేందుకు ఓవైపు షేడ్‌నెట్‌తో.. మరోవైపు మొక్కలు, కాయలకు తెగులు, పురుగు పట్టకుండా ద్రావణాన్ని నింపిన సీసాలను అక్కడక్కడ వేలాడదీశారు. అందులో నుంచి చుక్కలుగా మొక్కలకు ద్రావణం చేరుతోంది.

7/12
గుంటూరు: మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహిస్తున్న ఆస్థాన అలంకారాలు ఏడో రోజు స్వామివారు విష్ణుమూర్తి అవతారంలో బుధవారం రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు.ఆదిశేషునిపై  స్వామి శయనించి ఉండగా ఆయన పాదాల వద్ద శ్రీదేవి భూదేవి కూర్చుని పాదసేవ చేస్తున్నట్లుగా అలంకరించారు.

8/12
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభం ఊరేగింపు సమయంలో మహిళా బృందం చేసిన కోలాట నృత్యం ఆకట్టుకుంది.

9/12
హైదరాబాద్‌: కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ ఎక్సలెన్సీ(కేఐవైఈ) ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఇన్‌స్పైర్‌- హైదరాబాద్‌ కార్యక్రమం యువతను ఆలోజింపజేసింది. దీనికి ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరై రాకెట్‌ నమూనాలను తిలకించారు.

10/12
విశాఖపట్నం: సిల్వర్‌ జ్యూవెలరీ స్టోర్‌ను బుధవారం బుల్లితెర నటి శ్రీముఖి ప్రారంభించారు. అనంతరం స్టోర్‌లోని వెండి ఆభరణాలను తిలకించారు. ఆమె మాట్లాడుతూ వెండి ఆభరణాల కోసం కళామందిర్‌ ప్రత్యేకంగా స్టోర్‌ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. వందలాది ఆభరణాలు ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు.

11/12
నల్గొండ: తాజాగా మండల కేంద్రంలోని ఓ ఇంట్లో మోటారు నుంచి నీటి చుక్క కారుతుండగా.. దాన్ని ఒడిసి పట్టుకొని తాగడం కోసం ఓ కాకి తంటాలు పడుతూ ‘ న్యూస్‌టుడే’ కంటపడింది.

12/12
నల్గొండ: ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో ఈ యాసింగిలో ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చే గోదావరి నీటిపై ఆధారపడి సాగుచేసిన పొలాలన్నీ ఎండిపోయాయి.నెమ్మికల్‌ శివారులో ఓ వ్యవసాయబావి పూడిపోయి కొద్దిపాటి నీటితో ఒయాసిస్సును తలపిస్తుండగా.. మండుటెండలో మేత మేసి వచ్చిన జీవాల దాహార్తి తీర్చేందుకు ఈ పాతబావి(బొంద) ఎంతగానో ఉపయోగపడుతోంది.

Tags :

మరిన్ని