News in pics : చిత్రం చెప్పే విశేషాలు (07-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 07 Apr 2024 04:04 IST
1/6
హైదరాబాద్‌: ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం బయటకెళ్లాలంటే జంకుతున్నారు. అత్యవసర పనులు ఉన్న వారు టోపీలు, స్కార్ప్‌లు ధరించి ప్రయాణం చేస్తున్నారు. చార్మినార్‌ సందర్శనకు వచ్చిన యువతులు ఇలా టోపీలు ధరించారు.

2/6
హైదరాబాద్‌: ఆభరణాలతో యువతుల అందం రెట్టింపు అవుతుందని వర్ధమాన నటి మీనాక్షి చౌదరి అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సోమాజిగూడలోని కల్యాణ్‌ జువెల్లర్స్‌లో ఏర్పాటు చేసిన ఫెస్టివల్‌ కలెక్షన్లను ఆమె ప్రారంభించారు.

3/6
మెదక్‌: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ తొలి బ్యాచ్‌ పూర్తయింది. కళాశాల ప్రాంగణంలో శనివారం రాత్రి స్నాతకోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్‌ విమలాథామస్, పూర్వ ప్రిన్సిపల్‌ తమిళ అరసి, సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌ హాజరై విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. మొత్తం 146 మంది పట్టాలు అందుకొని ఆనందం వ్యక్తం చేశారు.

4/6
కరీంనగర్‌: స్థానిక వావిలాలపల్లిలోని సెయింట్‌ పాల్స్‌ పాఠశాల, సరస్వతినగర్‌లోని స్టార్‌ కిడ్స్‌ ప్రైమరీ పాఠశాల వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్‌ వేడుకలను శనివారం నిర్వహించారు. చిన్నారుల పాడిన గేయాలు, ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

5/6
కరీంనగర్‌: మండలంలోని మొలంగూర్‌లో అంగన్‌వాడీ కేంద్రాల వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల ప్రత్యేక వేషాధరణ.. నృత్యాలు ఆకట్టుకున్నాయి. అంగన్‌వాడీ టీచర్లు స్వరూప, శోభ, పద్మ పాల్గొన్నారు.

6/6
మెదక్‌: గుమ్మడిదల మండలం బొంతపల్లిలో శనివారం తెల్లవారుజామున భద్రకాళి సమేత వీరభద్రస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Tags :

మరిన్ని