News in pics : చిత్రం చెప్పే విశేషాలు (08-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 08 Apr 2024 04:05 IST
1/10
మెదక్‌: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని ఓ నర్సరీ పక్కన మామిడి చెట్టు ఆకుపచ్చని కొమ్మలతో పోటీ పడి తెల్లటి కాగితం పూలు విరివిగా పూశాయి. 65వ నంబరు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించేవారికి కనువిందు చేస్తూ ఆనందపరుస్తోంది.

2/10
ఆదిలాబాద్‌: ఈ చిత్రం. ఆకులు రాలి మోడువారిన చెట్టు ఒకటైతే.. పక్కనే ఆకులు రాలి తిరిగి లేలేత రంగుతో చిగురిస్తున్న ఆకులతో మరో చెట్టు.. ఎరుపు రంగుతో మరో చెట్టు.. వసంత రుతువు వచ్చిందన్నట్టుగా పచ్చని ఆకులతో మరో చెట్టు.. మారుతున్న కాలానికి గుర్తుగా.. రంగులు మారుతూ.. కొత్త చిగురుతో చెట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

3/10
తూర్పుగోదావరి: కొవ్వూరు పట్టణంలో రహదారి సుందరీకరణ గట్టుని ఆనుకుని ఉన్న ఈ వృక్షం కొన్నిరోజుల క్రితం ఆకులన్నీ రాలిపోయి వెలవెలబోయింది. సరిగ్గా 15 రోజుల తేడాలో కొత్త ఆకులు వచ్చి పచ్చగా మారింది.

4/10
హైదరాబాద్‌: పాత పుస్తకాలకు చిరునామా కోఠి, అబిడ్స్‌. ఇక్కడ చిన్న పిల్లల కామిక్స్‌ నుంచి పోటీ పరీక్షల వరకు అన్ని రకాల పుస్తకాలు తక్కువ ధరకే దొరుకుతాయి. ఉద్యోగ ప్రకటనల నేపథ్యంలో వీటికి గిరాకీ పెరిగింది. అబిడ్స్‌ పోస్టాఫీసు సెంటర్‌ వద్ద పుస్తకాలు పరిశీలిస్తున్న యువతులు.

5/10
కరీంనగర్‌: స్థానిక సప్తగిరి పాఠశాల వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల ఛైర్మన్‌ మందల నగేశ్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ అనితారెడ్డి, డైరెక్టర్‌ విపుల్‌రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

6/10
ఖమ్మం: భద్రాచలం రామాలయంలో ఈ నెల 9 నుంచి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి విద్యుద్దీపాలంకరణ ట్రయల్‌ నిర్వహించారు. దీపాల వెలుగులతో కోవెల,  పరిసరాలు కల్యాణ శోభ సంతరించుకున్నాయి. ఉగాదికల్లా విద్యుద్దీపాలకరణ పనులు పూర్తవుతాయి.

7/10
గుమ్మలక్ష్మీపురంలో జరుగుతున్న కైలాసనాథ ఉత్సవాలు ఆదివారం అంబరాన్ని తాకాయి. మన్యం, విజయనగరం జిల్లాలతోపాటు ఒడిశా నుంచి భక్తులు వేలాది మంది తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పౌరాణిక నాటకాలు, యువత నృత్యాలు ఆకట్టుకున్నాయి.

8/10
కడప: సీకేదిన్నెలో ఆదివారం గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి కూరగాయలతో అలంకరణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

9/10
హైదరాబాద్‌: రంజాన్‌ మాసం కావడంతో సేమియా అమ్మకాలు జోరందుకున్నాయి. పాత నగరంతోపాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. ఎర్రగడ్డ రహదారిలో ఓ దుకాణం వద్ద సేమియాలు ఆ మార్గంలో వెళ్లేవారి మనసు లాగేస్తున్నాయి.

10/10
హైదరాబాద్‌: దేహం చుట్టూ ఇంద్రధనస్సులా రంగురంగుల చున్నీలు వేసుకొని ఓ యువకుడు చార్మినార్‌ వద్ద ఎండలో కనిపించాడు. వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా పట్టించుకోకుండా కొనుగోలుదారుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు.

Tags :

మరిన్ని