News in pics : చిత్రం చెప్పే విశేషాలు (09-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 09 Apr 2024 11:50 IST
1/11
ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టింది. 

2/11
నెల్లూరు: వేప పూవు సువాసనలు.. మామిడి చివుళ్ల మకరందాలు.. నోరూరించే మామిడులు.. గండుకోయిలల సురాగాలు.. సంప్రదాయ ప్రతిబింబాలు.. ఎన్నని చెప్పాలి తెలుగింటి సందళ్లు.. ఏమని పొగడాలి ఉగాది సంగతులు.. చైత్రమాస ప్రారంభంతో.. ఉగాది పర్వదినాన అంతటా నవ వికాసం ఆవిష్కృతమైంది.క్రోధినామ సంవత్సరం శుభదీవెనలు పలుకుతోంది.

3/11
హైదరాబాద్‌: నాచారంలోని దక్కన్‌ స్ప్రింగ్స్‌ గ్లోబల్‌ స్కూల్‌లో సోమవారం ఉగాది వేడుకలు సందడిగా సాగాయి.తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాల గురించి విద్యార్థులకు వివరించారు. ఉగాది పచ్చడిని విద్యార్థులందరికీ పంపిణీ చేశారు.

4/11
ఖమ్మం: పాల్వంచ శ్రీనివాసకాలనీ మీదుగా గుడిపాడు, బంగారుజాల ప్రాంతాలకు మొర్రేడువాగు ప్రవహిస్తోంది. మధ్యన ప్రవాహం.. ఇరువైపులా పంటపొలాల పచ్చందాలు ఇంతటి కరువు కాలంలోనూ కనువిందు చేస్తున్నాయి. పరిసరాల్లోని ప్రకృతి అందాల్ని చూసి పులకరించిపోతున్నారు. ఆయా దృశ్యాలను ఫోన్లలో బంధిస్తున్నారు.

5/11
మెదక్‌: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్‌ తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా మర్రి ఆకులపై మామిడి కాయ, కోయిల చిత్రాలను మలిచారు. ఉగాది పచ్చడితో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మహిళ చిత్రాలను గీసి క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలికారు.

6/11
చిత్తూరు: క్రోధి నామ సంవత్సరం సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.ఇందుకు ఆలయాన్ని ప్రత్యేకంగా పుష్పాలు, విద్యుత్తు దీపాలతో ముస్తాబు చేస్తున్నారు.ఆలయ కల్యాణ వేదిక వద్ద ఉదయం 10.30-11.30 గంటల మధ్య పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.

7/11
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం నగర దేవతగా భక్తుల పూజలందుకుంటున్న శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారపుపేట వద్ద ఉన్న ఆలయంలో సోమవారం కొత్త అమావాస్య సందర్భంగా మూలవిరాట్‌కు పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించారు.

8/11
హైదరాబాద్‌: సినీ నటి రష్మిక మందన్న నగరంలో సôదడి చేశారు. సోమవారం బేగôపేటలోని ఓ హోటల్‌లో జరిగిన ప్రైవేటు కార్యక్రమానికి  హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెను కలవడానికి పోటీ పడ్డారు.

9/11
విశాఖపట్నం: ముంచంగిపుట్టు మండలంలోని గొర్రెలమెట్ట సమీపంలో ఓ మహిళ తన బిడ్డను గొడుగు నీడలో ఉంచి వ్యవసాయ పనులు చేస్తోంది. ఆ బాలుడు గొడుగు నీడలో హాయిగా నిద్రపోతున్నాడు. ఎండావానకు లెక్కచేయకుండా పొలం పనులు చేసుకుంటూ, మరో వైపు బిడ్డను చూసుకుంటున్న దృశ్యం ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది.

10/11
నల్గొండ: రాజపేట మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలు నేడు వృక్షాలై చల్లదనం ఇస్తున్నాయి. వాటిపై పదుల సంఖ్యలో పక్షులు సందడి చేస్తున్నాయి.వేసవి కావడంతో నీటికి అల్లాడిపోతున్నాయి. ఇది గ్రహించిన కార్యాలయ సూపరింటెండెంట్‌ హరితాదేవి 20 మట్టి పాత్రలను చెట్ల కొమ్మలకు ఉట్టితో వేలాడదీసి, ప్రహరీలపై ఏర్పాటు చేసి అందులో నీరు పోస్తున్నారు.

11/11
హైదరాబాద్‌: బడంగ్‌పేట్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అతివలు చదువుకోవడానికి ప్రత్యేకంగా రెండు గదులు ఏర్పాటు చేశారు. వీరి పర్యవేక్షణకు మహిళా సిబ్బందినే నియమించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు చదువుకోవచ్చు. వారి వెంట వచ్చే చిన్నారుల కోసం మరో గదిని కేటాయించడంతో సౌకర్యంగా ఉంటోంది.

Tags :

మరిన్ని