News in pics : చిత్రం చెప్పే విశేషాలు (11-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 11 Apr 2024 04:01 IST
1/10
హైదరాబాద్‌: రంజాన్‌ నేపథ్యంలో పాతబస్తీ గుల్జార్‌ హౌస్‌ వద్ద బుధవారం సందడి నెలకొంది. పండగకు ఒకరోజు ముందు షాపింగ్‌ చేయడానికి ముస్లింలు పెద్దఎత్తున తరలివచ్చారు. కొనుగోలుదారులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది.

2/10
హైదరాబాద్‌: రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్ష అనంతరం రోజూ రాత్రి దాదాపు వందలాదిమంది ముస్లిం చిన్నారులు, పెద్దలకు చిరాగ్‌అలీ లేన్‌లో దుకాణ యజమాని ఇర్ఫాన్‌ 11 ఏళ్లుగా ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసి సేవా  భావాన్ని చాటుతున్నారు.

3/10
ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి.దీంతో మూగజీవాలు, పక్షులు తల్లడిల్లుతున్నాయి. కొలనులో ఉండే బాతులు సైతం ఎండకు తట్టుకోలేకపోతున్నాయి. నల్గొండ శివారులోని ఛాయా సోమేశ్వర ఆలయం కొలనులో ఉన్న బాతులు ఎండవేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న దృశ్యాలను ‘ఈనాడు’తన కెమెరాలో బంధించింది.

4/10
విశాఖపట్నం: జి.గంగవరం పాలకేంద్రం వద్ద ఉన్న చెట్టుకు ఆకులు కనిపించకుండా, చెట్టాంత పువ్వులు విరబూసి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంది. కొమ్మల నిండా గులాబీ వర్ణంలో పువ్వులు పూశాయి.

5/10
మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న టేకు, నీలగిరి వనాలు ఇవి. టేకువనంలో చెట్లన్నీ ఆకులు రాలి మోడుగా మారగా, పక్కనే ఉన్న నీలగిరి చెట్లు చిగుళ్లు వేసి పచ్చదనం సంతరించుకున్నాయి.. ఒకే ప్రాంతంలోని టేకు చెట్లను గ్రీష్మ రుతువు ముందే వచ్చినట్లు తలపిస్తే.. నీలగిరి చెట్లు మాత్రలం వసంత శోభను చాటుతున్నాయి. ఈ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు చెట్లను ఆశ్చర్యంగా చూస్తున్నారు.

6/10
వరంగల్‌: శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం లక్ష మల్లెలతో పుష్పార్చన నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, నవరాత్రి విశేష పూజలు జరిగాయి. వేదపండితులు, అర్చకులు శ్రీభద్రకాళి అమ్మవారికి మంత్రోచ్చారణలతో పుష్పార్చన నిర్వహించారు.

7/10
హైదరాబాద్‌: సుభాష్‌నగర్‌ వివేకానంద విద్యామందిర్‌ ఉన్నత పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించారు. ప్రీ-స్కూల్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు మండవ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

8/10
కల్లూరులోని చౌడేశ్వరి ఆలయం చుట్టూ గార్దబాల ప్రదక్షిణ అందరినీ ఆకట్టుకుంది. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆలయం చుట్టూ పోసిన బురద మట్టిలో బుధవారం సాయంత్రం గాడిదలతోపాటు వృషభాలను తిప్పారు.

9/10
మెదక్‌: పవిత్రమైన రంజాన్‌ పండగ పురస్కరించుకొని రావి ఆకుపై మసీదు, చంద్రవంకను మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు బ్రహ్మచారి రూపొందించారు.

10/10
హైదరాబాద్‌: గోపన్‌పల్లి కాలనీలో ప్రతిష్ఠాత్మకంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పంచతంత్ర పార్కు నిర్వహణలేక అస్తవ్యస్తంగా తయారైంది. పార్కులోని ఆట వస్తువులు, జంతువుల బొమ్మలు శిథిలమై కొన్ని పగిలిపోయి నిరుపయోగంగా మారాయి. పార్కుకు వచ్చే చిన్నారులు విరిగిపోయిన బొమ్మలు చూసి నిరుత్సాహంతో వెనుదిరిగిపోతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పార్కును బాగు చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

మరిన్ని