News in pics : చిత్రం చెప్పే విశేషాలు (12-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 12 Apr 2024 04:25 IST
1/6
హైదరాబాద్‌: మండుతున్న ఎండల కారణంగా కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్‌ సందర్శకులు  లేక బోసిపోతోంది. గురువారం వాతావరణం కొద్దిగా అనుకూలించడం.. రంజాన్‌ పర్వదినం సందర్భంగా సెలవు కావడంతో చాలా రోజుల తరువాత సాగర్‌ సందర్శకులతో కిటకిటలాడింది. స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు.

2/6
హైదరాబాద్‌: నగరవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఉపవాసాలు విరమించి మసీదులు, ఈద్గాహ్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మక్కా మసీదు, చార్మినార్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

3/6
ఖమ్మం: దమ్మపేట మండలంలోని చెరువుల్లో తెల్ల, ఎర్ర తామర పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. రెడ్యాలపాడు సమీపంలోని చెరువు తెల్లతామర పూలతో, జమేదార్‌ బంజర్‌ చెరువు ఎర్రతామర పుష్పాలతో అటుగా వెళ్తున్న ప్రయాణికులను కట్టిపడేస్తున్నాయి.

4/6
నల్గొండ: వేములపల్లి మండలం కుక్కడం శివారులో ఓ ఇంటి ముందు తీగ జాతి చెట్టు అల్లుకోవడంతో.. పచ్చటి పందిరిలా మారింది.. ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంతో పాటు భవంతి పైకి తీగపారింది. ఆ దారి గుండా వెళ్లే వారిని ఆకట్టుకుంటోంది.

5/6
నిజామాబాద్‌: బంతికి పచ్చటి ఆకులతో రంగులద్దిన రూపుతో కనిపిస్తున్న ఇది గూడు అంటే నమ్ముతారా..! నిజమే. ఇది గూడే. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మర్రితండా అటవీ ప్రాంతంలో వివిధ రకాలైన ఆకులతో చీమలు వాటి నివాసానికై అల్లుకున్నవే ఇవి. చెట్టుకు పదుల సంఖ్యలో ఉన్న ఈ అందమైన గూళ్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

6/6
హైదరాబాద్‌: ఈనెల 17న శ్రీరామనవమిని పురస్కరించుకొని కళాకారులు   ధూల్‌పేటలో  శ్రీరాముడి భారీ విగ్రహాలు తయారు చేస్తున్నారు. నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు బుకింగ్‌ చేసుకుంటున్నారని తయారీదారులు చెప్పారు. ఈనెలలోనే హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆంజనేయుడి విగ్రహాలు కూడా పెద్దఎత్తున తయారుచేస్తున్నారు.

Tags :

మరిన్ని