News in pics : చిత్రం చెప్పే విశేషాలు (14-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 14 Apr 2024 06:32 IST
1/12
హైదరాబాద్‌: ఉత్తరాన్‌ బంగియా సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శిల్పారామంలో బెంగాలీ నూతన సంవత్సర వేడుకలు(పోహెలా బోయిషాక్‌) ఎంతో ఘనంగా నిర్వహించారు. నగరంలో స్థిరపడిన పలువురు బెంగాలీలు తమ సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

2/12
హైదరాబాద్‌: అమీర్‌పేటలోని గురుద్వార ఆధ్వర్యంలో   శనివారం బైౖశాఖీ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్థానిక జీహెచ్‌ఎంసీ మైదానంలో నిర్వహించిన విశాల్‌ దివస్‌ కనులపండువగా సాగింది. నగర్‌ కీర్తన్‌లో భాగంగా వీధుల్లో ప్రదర్శించిన విన్యాసాలు  ఒళ్లుగగుర్పాటుకు గురి చేశాయి. పవిత్ర గురు గ్రంథాన్ని రథంలో ఊరేగించారు.

3/12
హైదరాబాద్‌: ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలోనూ చుట్టూ పచ్చదనం మధ్య జలకళ.. ఆ వెనుకే నిర్మాణ సముదాయాలతో ఈ ప్రాంతం కనువిందు చేస్తోంది కదూ. కిస్మత్‌పూర్‌-బుద్వేల్‌ మధ్య ఈసీ వాగు ఇలా ఆహ్లాదాన్ని పంచుతోంది.

4/12
కరీంనగర్‌లోని పాత లేబర్‌ అడ్డా నుంచి సెయింట్‌ అల్ఫోన్స్‌ స్కూల్‌ రోడ్డులో రాత్రి వేళ ఇలా విద్యుత్తు దీపాలు కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ సమయంలో ఈ దారి గుండా వెళ్తే పగటి పూట వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అటుగా వెళ్లే ప్రజలకు ఈ మార్గం ఆకట్టుకుంటోంది.

5/12
హైదరాబాద్‌: నిజాంపేటలోని నారాయణ ఈటెక్నో పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ‘గ్రాడ్యుయేషన్‌ డే’ శనివారం ఘనంగా నిర్వహించారు.చిన్నారులకు పట్టాలను పంపిణీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపల్‌ సుహాసిని, వైస్‌ ప్రిన్సిపల్‌ ఉషా, సమన్వయకర్త సల్మా పాల్గొన్నారు.

6/12
వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌ యజ్ఞవరాహస్వామి ఆలయంలో స్వామివారికి మహాభిషేకాలు, సర్వ దేవతార్చన, దీపమాలోత్సవం శనివారం నిర్వహించారు. నిర్వాహకులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు.

7/12
తూర్పు గోదావరి: రాష్ట్రస్థాయి ఓపెన్‌ చదరంగం పోటీలు రాజమహేంద్రవరం వైఎంవీఏ హాలులో శనివారం ప్రారంభమయ్యాయి. కాల్‌ప్యూషన్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు పలు జిల్లాల నుంచి సుమారు 230 మంది క్రీడాకారులు హాజరయ్యారని, నాలుగు రౌండ్లు ముగిసేసరికి పదిమంది ముందంజలో ఉన్నారని నిర్వాహకులు తెలిపారు.

8/12
వరంగల్‌ నగరంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందడి నెలకొంది. శనివారం వరంగల్‌ దేశాయిపేట సీకేఎం కళాశాల క్రీడా మైదానంలో ‘టాటా ఐపీఎల్‌ ఫ్యాన్‌ పార్కు’ను ఏర్పాటు చేశారు. భారీ తెరపై పంజాబ్‌- రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ వీక్షించిన నగర ప్రజలు ప్రత్యేక అనుభూతి పొందారు.

9/12
నల్గొండ:  వేసవి ఎండలకు మనుషులతో పాటు మూగజీవాల సైతం తల్లడిల్లుతున్నాయి. ఎండవేడి ఉపశమనం కోసం మూసి ప్రాజెక్ట్‌లో నిలిచిన నీటిలో జీవాలకు నీటిని చల్లి, కాలువ నీటిలో నుంచి మూగజీవాలను దాటిస్తున్నారు కాపరులు.

10/12
విశాఖ సముద్రతీరంలో బర్నాకిల్స్‌ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి పీతలు, ఎండ్రకాయల జాతికి చెందినవి. ఎక్కువగా అలలపై నివాసముంటూ సముద్రంలో లోతు తక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న రాళ్లు, యాంకర్‌ వేసిన బోట్ల కింది భాగంలో అతుక్కుని ఉంటాయని అల్లూరి జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్‌ పి.శ్రీనివాసరావు తెలిపారు.

11/12
మెదక్‌: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన యువ చిత్రకారుడు గుండు శివకుమార్‌ శనివారం వివిధ రూపాల్లో చిత్రాలు గీశారు. స్క్రాచింగ్‌ పద్ధతితో మర్రి, రావి ఆకులపై అంబేడ్కర్‌ చిత్రాలు గీసి నివాళి అర్పించారు.

12/12
ఆదిలాబాద్‌: కొత్తగా వచ్చిన వారికి చూడడానికి వింతగా కనిపిస్తోంది ఈ టవర్‌. దూరం నుంచి చూస్తే ఈ టవర్‌పై అరటి పండ్లు కట్టినట్లుగా కనిపిస్తోంది. తీరా దగ్గరకి వచ్చి చూస్తే అప్పుడు తెలుస్తోంది ఇవి మొక్కజొన్నలని. గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో తపాలా శాఖ వారు 20 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన టవర్‌ ప్రస్తుతం గిరిజన రైతులకు మొక్కజొన్న విత్తనాలను నిల్వ చేసేందుకు ఉపయోగపడుతోంది.

Tags :

మరిన్ని