News in pics : చిత్రం చెప్పే విశేషాలు (15-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 15 Apr 2024 03:56 IST
1/10
హైదరాబాద్‌: ఇన్‌స్టాగ్రాం ఇన్‌ఫ్లూయెన్సర్లు (ప్రభావశీలురు) పలువురు ఆదివారం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఓ హోటల్ల్‌ో సందడి చేశారు. ఫూమిలీ 4.0 పేరుతో సుమారు 75 మంది ఒకచోటుకు చేరారు. పోషకాహారంపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అభిలషించారు.

2/10
మెదక్‌: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ ఏసీపీ కార్యాలయం ఎదుట అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆదివారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చేపట్టిన లేజర్‌షో ఆహూతులను ఆకట్టుకుటుంది.

3/10
నల్గొండ: అసలే వేసవి కాలం..ఆపై ఆదివారం.. పాఠశాలలకు సెలవు కావడంతో ఈత కొలనుల వద్ద చిన్నారుల సందడి చేశారు.. నల్గొండ శివారు పానగల్‌ ఫిల్టర్‌బెడ్‌ అవుట్‌ వాటర్‌ సంపు నీటిలో ఈదులాడుతూ.. కేరింతలు కొడుతున్న చిన్నారుల దృశ్యమిది.

4/10
కరీంనగర్‌: జగిత్యాల జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న కండ్లపల్లి, మోతె, అంతర్గాం లింగం చెరువు, ధర్మసముద్రం, చింతకుంట, ముప్పాల చెరువులు నిండుకుండలా నీటితో కళకళలాడుతున్నాయి. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు తోడు ఎస్సారెస్పీ కాలువ నీటితో చెరువులను నింపడంతో జలకళతో ఉట్టిపడుతున్నాయి.

5/10
వరంగల్‌ భద్రకాళిరోడ్‌ శ్రీధర్మశాస్త్ర భక్త సేవాశ్రమంలో శ్రీక్రోధి నామ నూతన సంవత్సర తమిళ ఉగాది(కేరళ విషు) పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని గజమాలలతో సుందరంగా అలంకరించి, మంగళహారతులు ఇచ్చారు.

6/10
మెదక్‌: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వారాంతపు సెలవు రోజు కావడంతో ఉమ్మడి జిల్లా వాసులతో పాటు పరిసర జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, జంట నగరాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

7/10
నల్గొండ: భువనగిరి శివారు రాయగిరిలో దుర్గమ్మ పండగను వైభవంగా నిర్వహించారు. బొడ్రాయి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.

8/10
కడప: ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. పరిసరాలన్నీ విద్యుత్తు దీప కాంతులతో ప్రకాశిస్తున్నాయి. ఆలయ ప్రాకారం గోడ చుట్టూ ప్రత్యేకంగా అలంకరణ చేశారు.

9/10
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రాచూరులో కనిపించిన ఈ దృశ్యాలు చూపరులను  ఆకర్షిస్తున్నాయి.  పదిరోజులుగా ఈ కోతి పిల్లిపిల్లను ఎత్తుకొని లాలిస్తోంది. దీనిపై స్థానికులతో మాట్లాడగా తల్లినుంచి తప్పిపోయిన పిల్లిపిల్లను కోతిచేరదీసి ఆహారం పెడుతూ ఎక్కడలేని మమకారం చూపుతోందన్నారు.

10/10
హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సచివాలయం సమీపంలోని 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు జనం పెద్దఎత్తున తరలివచ్చి సందడి చేశారు.

Tags :

మరిన్ని