News in pics : చిత్రం చెప్పే విశేషాలు (16-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 16 Apr 2024 04:29 IST
1/10
హైదరాబాద్‌: శ్రీరామ నవమి ఉత్సవాలకు  ఆలయాలు ముస్తాబవుతున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి. బుధవారం సీతారాముల కల్యాణం జరగనుండటంతో సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం ఇలా మెరిసిపోతోంది.

2/10
హైదరాబాద్‌: టెంపుల్‌అల్వాల్‌లోని సీతారామ నామ సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన వసంత ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన భరతనాట్యం చూపరులను కట్టిపడేసింది.స్థానిక నృత్య శిక్షణ కేంద్రం విద్యార్థుల బృందం గంటపాటు ప్రదర్శించిన  నాట్యం విశేషంగా ఆకట్టుకుంది.

3/10
హైదరాబాద్‌: వెస్ట్‌ మారేడుపల్లి నారాయణ పాఠశాలలో ఈ కిడ్స్‌ విద్యార్థుల విభాగంలో సోమవారం గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించారు.విద్యార్థులకు ధ్రువపత్రాలతోపాటు ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారికి పతకాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

4/10
వరంగల్‌: వసంత నవరాత్రుల్లో భాగంగా ఏడోరోజు సోమవారం శ్రీభద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో పుష్పార్చన జరిపారు. లక్ష పుష్పార్చన, మహా మండపంలో మహిళలతో లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన నిర్వహించారు. వ్యాపారవేత్త తోట జగన్నాథం దంపతులు అమ్మవారికి పూలు సమర్పించారు.

5/10
మెదక్‌: మండల పరిధి కొడుపాక గ్రామంలో పోచమ్మ ఆలయ ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం మహిళలు బోనాలను అందంగా అలంకరించి గ్రామంలో ఊరేగించి ఆలయం వరకు తీసుకెళ్లారు. నైవేద్యాలు సమర్పించారు.

6/10
విశాఖప్నట్నం: జ్ఞానాపురం రైల్వే వంతెనపై ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోయిన తీరుపై ఈ నెల 12న ‘నీరు పోసే నాథుడేడి’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. చనిపోయిన మొక్కలను తీసేసి...వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. వీటినైనా జాగ్రత్తగా సంరక్షించాలని పలువురు సూచిస్తున్నారు.

7/10
మెదక్‌: మండలంలోని క్షీరసాగర్‌ కోదండ రామాలయంలో రాములోరి కల్యాణోత్సవం మూడ్రోజులపాటు వైభవంగా జరగనుంది.ఈ సందర్భంగా రాజీవ్‌ రహదారిపై వంటిమామిడి నుంచి క్షీరసాగర్‌ రామాలయం వరకు ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

8/10
వరంగల్‌: ఐనవోలు మండలం నర్సింహులగూడెం గ్రామస్థులకు వేప చెట్టుపై ఉన్న మమకారం ఇది. 25 ఏళ్ల కిందట నాటిన మొక్క ఏపుగా పెరిగింది.ఇటీవల నర్సింహుల గూడెం నుంచి ముల్కలగూడెం వరకు రూ.కోటితో బీటీ రోడ్డు నిర్మించారు.తమకు రాకపోకల సందర్భంగా ఇబ్బందులు ఎదురైనా సరిపెట్టుకుంటామని, చెట్టును మాత్రం నరికేయవద్దని గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు.

9/10
తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన చిన్నారి సైకత శిల్పులు సోహిత, ధన్యతలు రూపొందించిన సైకతం ఆలోచింపజేసింది. ఇసుక రేణువులను పోగుచేసి దేశ చిత్రపటం మధ్యలో సిరాచుక్కతో వేలుని చూపిస్తూ.. ‘మీ ఓటు.. మీ భవిష్యత్తు’ అంటూ రాయడం ఆకట్టుకుంది.

10/10
నల్గొండ: భానుడు గత కొన్నిరోజులుగా ఉగ్రరూపం దాల్చుతున్నాడు.. రెండు రోజుల క్రితం పడ్డ వర్షపు చినుకులతో ఉక్కపోత ఎక్కువైంది.. ఉష్ణోగ్రతలు తీవ్రం కావడంతో మూగజీవాలు అల్లాడుతున్నాయి.. మధ్యాహ్నం వేళ మూగజీవాలు చెరువుల్లో మిగిలిపోయిన నీటి గుంటల వద్దకు చేరి సేద తీరుతున్నాయి.. అక్కడే గ్రాసం కోసం వెదుకుతున్నాయి.

Tags :

మరిన్ని