News in pics : చిత్రం చెప్పే విశేషాలు (17-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 17 Apr 2024 04:40 IST
1/12
హైదరాబాద్‌: భాగ్యనగర్‌ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమితి అధ్యక్షుడు డా.భగవంత్‌రావు, ప్రధాన కార్యదర్శి గోవింద్‌రాఠీ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు సూచించిన మార్గంలోనే శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

2/12
మెదక్‌: మనోహరాబాద్‌కు చెందిన బ్రహ్మచారి, నారాయణఖేడ్‌కు చెందిన గుండు శివకుమార్‌ రావి ఆకులపై రాములోరి చిత్రాలు మలిచి తమ భక్తిని చాటుకున్నారు. అయోధ్యలోని బాలరాముడు, పట్టాభిరామయ్య చిత్రాలను స్ఫురించేలా చేసి రామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

3/12
మెదక్‌: శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు జిల్లాలోని ఆలయాలను ముస్తాబు చేశారు. రంగులు, విద్యుత్తు దీపాలతో అలంకరించారు. సంగారెడ్డిలోని పురాతన శ్రీరామ మందిరం ఇలా కాంతులీనుతూ భక్తులను ఆకట్టుకుంటోంది.

4/12
నిజామాబాద్‌: జిల్లాలోని శ్రీరామసాగర్‌ జలాశయంలో నీటినిల్వలు గణనీయంగా తగ్గాయి. 90.313 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 11.6 టీఎంసీలే ఉన్నాయి. నందిపేట్‌ మండలంలోని ప్రాజెక్టుకు సంబంధించిన వెనుక జలాలు(బ్యాక్‌ వాటర్‌) భారీగా తగ్గాయి. ఇప్పటి వరకు నీట మునిగిన ప్రాంతమంతా పచ్చికబయళ్లుగా మారి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.

5/12
హైదరాబాద్‌: టెక్నోస్మానియా-2024ను పురస్కరించుకొని మౌలాలిలోని ఎఎంఆర్‌ ప్లానెట్‌లో మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పలువురు టెక్నాలజీ విద్యార్థులు ఫ్లాష్‌మాబ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులు నృత్యాలు చేశారు. వారి నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

6/12
హైదరాబాద్‌: అనిబిసెంట్‌ మహిళా కళాశాల (దిల్‌సుఖ్‌నగర్‌) వార్షికోత్సవం ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు.  ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీ రెమా రాజేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై సవాళ్లను అధిగమిస్తూ లక్ష్యాన్ని చేరుకోగలమని విద్యార్థులకు సూచించారు.

7/12
అమరావతి: శ్రీరామ నవమి పురస్కరించుకుని ముస్తాబైన బందరులోని భద్రాద్రి రామాలయం.

8/12
నెల్లూరు: మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి కొయ్యతో బొటనవేలు గోటిపై ఇమిడే సూక్ష్మ శ్రీరాముని ప్రతిమను తయారుచేశారు. మంగళవారం శ్రీరాముని ప్రతిమను ప్రదర్శించడంతో పలువురు ఆయన్ను అభినందించారు.

9/12
శ్రీకాకుళం: ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వరస్వామి కొండ వద్ద సైకత శిల్పి గేదెల హరికృష్ణ ఇసుకతో రూపొందించిన శ్రీరాముని శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది. శ్రీరామనవమి సందర్భంగా సైకత శిల్పం రూపొందించినట్లు హరికృష్ణ చెప్పారు.

10/12
శ్రీకాకుళం: పావురం ఈకపై అరసవల్లికి చెందిన సూక్ష్మ కళా చిత్రకారుడు వాడాడ రాహుల్‌ పట్నాయిక్‌ గీసిన అయోధ్య బాలరాముని చిత్రం చూపరులను ఆకర్షిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా రెండు గంటల పాటు శ్రమించి బాలరాముని ప్రతిరూపాన్ని గీసినట్లు ఆయన తెలిపారు. రాహుల్‌ను పలువురు అభినందించారు.

11/12
హైదరాబాద్‌: సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మంగళవారం మాదాపూర్‌లో సందడి చేశారు. ఓ చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు.

12/12
మహబూబ్‌నగర్‌: కొల్లాపూర్‌ మండలం ఎన్మన్‌బెట్లలోని వాగులో గేదెలు ఇలా గంటల తరబడి ఉండిపోయాయి. భూత్పూర్‌ మండలం కొత్తమొల్గరలో గొర్రెలు ఇలా తుమ్మచెట్ల నీడకు చేరాయి.

Tags :

మరిన్ని