News in pics : చిత్రం చెప్పే విశేషాలు (18-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 18 Apr 2024 04:16 IST
1/10
హైదరాబాద్‌: గచ్చిబౌలి ఐఐఐటీ నుంచి స్టేడియానికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు ఇవి. ఒకవైపు నడకదారి మార్గంలో ఆకులన్నీ రాలిన చెట్లు, మరోవైపు డివైడర్‌లో ఆకులతో పచ్చగా కనిపించే చెట్లు అటుగా వెళ్లేవారిని ఆకట్టుకుంటున్నాయి.

2/10
నల్గొండ: యాదగిరిగుట్ట గండి చెరువు వద్ద సూర్యాస్తమయానికి భానుడు విద్యుత్తు టవర్ల మధ్య వెలిగిపోతూ సందర్శకులకు కనవిందు గొలుపుతున్నాడు. గోదావరి జలంతో నిండిన చెరువు, చుట్టూ పచ్చిక ఆహ్లాదం కలిగిస్తోంది. సముద్ర తీరంలోని లైట్‌హౌస్‌ను తలపిస్తోందని భక్తులు అనుకుంటున్నారు.

3/10
చిత్తూరు: శ్రీరామ నవమి సందర్భంగా భారీ హనుమంతుడి పెయింటింగ్‌ సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుటోంది. గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన కళాకారుడు పురుషోత్తం 25 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవుతో వేసిన పెయింటింగ్‌ అందరినీ ఆకట్టుకుటోంది.

4/10
హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్‌ ముఖ ద్వారాన్ని లండన్‌ టవర్‌ బ్రిడ్జి తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

5/10
కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన కర్ర జగన్‌మోహన్‌రెడ్డి మామిడి తోటలోని ఓ చెట్టుకు కాసిన కాయలు ఇవి. గతేడాది ఈదురుగాలులకు కొమ్మలు విరిగిపోవడంతో చెట్టు ఎండిపోయే దశకు చేరిందని.. ఇక కాత కాయదనుకున్న చెట్టుకే ఈసారి ఓ చోట 22 కాయలు కాశాయని రైతు తెలిపారు.

6/10
ఏలూరు: శ్రీరామనవమి వేడుకలు బుధవారం వైభవంగా సాగాయి. కామవరపుకోట మండలం తూర్పుయడవల్లిలో సీతారామచంద్రస్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు.

7/10
నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని కనులపండువగా జరిపించారు.

8/10
నిజామాబాద్‌: ఓ వాహనదారుడు మాత్రం తన ద్విచక్రవాహనానికి గొడుగు లాంటి అమరిక చేయించి ఎండలో ఎంచక్కా ఇలా ప్రయాణిస్తున్నారు. రాజంపేట మండలం తలమడ్ల గ్రామం వద్ద కనిపించిన ఈ చిత్రాన్ని న్యూస్‌టుడే కెమెరాలో బంధించింది.

9/10
మెదక్‌: శ్రీరామనవమి సందర్భంగా సిద్దిపేటలోని పంచముఖ వీరాంజనేయస్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు.

10/10
కరీంనగర్‌: మెట్‌పల్లి పట్టణంలోని చైత్యనగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని గుండు భాగ్యలక్ష్మి రావి ఆకుపై శ్రీరాముడి చిత్రాన్ని గీసింది. ఉడుతతో ఆడుకుంటున్నట్లు ఉన్న చిత్రం ఆకట్టుకుంటోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు