News in pics : చిత్రం చెప్పే విశేషాలు (21-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 21 Apr 2024 04:16 IST
1/10
తమిళనాడు: ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీఎఫ్‌లో ఏర్పాటు చేసిన మినీ రైలు నమూనాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది.న్యూ ఆవడి రోడ్డులోని చెన్నై రైలు మ్యూజియంలో ఈ నెల 18 నుంచి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందులో పలు రకాల మినీ రైలు నమూనాలను (రన్నింగ్‌ రైల్‌ మోడల్స్‌) కొలువుదీర్చారు.

2/10
చిత్తూరు: గత నాలుగు రోజల నుంచి ఉష్ణొగ్రత 40 డిగ్రీలు దాటుతోంది. ఎన్నడూ చూడని విధంగా సూర్యుడి ప్రతాపం ఉండటంతో ఉదయం 11 గంటలకే పట్టణ వీధులన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. అయితే ఉదయం మంచు కురుస్తుండటం.. పట్టణవాసులను ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు కమ్ముకుని వాతావరణం చల్లగా ఉండటంతో వైవిద్యమైన అనుభూతి పొందుతున్నారు.

3/10
విశాఖపట్నం: భారత నౌకాదళం ఆధ్వర్యంలో తూర్పు కోస్తా తీరంలో ‘ఎక్స్‌పీఓఎల్‌ (పూర్విలెహర్‌)- 2024’ విన్యాసాలు నిర్వహించినట్టు శనివారం నేవీ వర్గాలు తెలిపాయి.ఈ విన్యాసాలు దోహదపడతాయని వెల్లడించాయి. విన్యాసాల్లో పాల్గొన్న యుద్ధనౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ప్రత్యేక దళాలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాయని తెలిపాయి.

4/10
విశాఖపట్నం: అరకులోయలోని ఏఎస్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌ 40వ వార్షికోత్సవం శనివారం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహరాజా వైద్య కళాశాల డీన్‌ లక్ష్మీకుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే కష్టపడి చదువుకోవాలన్నారు.

5/10
హైదరాబాద్‌: శిల్పారామంలో శనివారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కనువిందుగా సాగింది.చక్కటి నృత్యాభినయంతో వారు ప్రదర్శించిన పూర్వరంగం, రామాయణశబ్దం, భావయామి తదితర అంశాలు అందరినీ అలరించాయి.

6/10
హైదరాబాద్‌: బన్సీలాల్‌పేట డివిజన్‌ భోలక్‌పూర్‌లోని కృష్ణవేణి పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్‌ డేను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్‌ మంచాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఐదో తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత ధ్రువపత్రాలను అందజేసి, ఆరో తరగతికి ప్రమోట్‌ చేశారు.

7/10
హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వేడి నుంచి ఉపశమనం కలిగినా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఖాజాగూడలో అత్యధికంగా 28 మి.మీ.లు, అత్యల్పంగా గోల్కొండ వద్ద 9.8 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

8/10
పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచడంలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ చేపట్టిన చైతన్య కార్యక్రమాలు పౌరులను ఆకట్టుకుంటున్నాయి.

9/10
వరంగల్‌: ప్రైవేటు వాహనాల చోదకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా ప్రమాదాలకు కారణమవుతున్నారు. శనివారం ఫోర్ట్‌రోడ్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు ఇలా ఆటో వెనుక భాగంలో నిల్చొని.. వెళుతుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

10/10
హైదరాబాద్‌: నిర్లక్ష్యం కారణంగా తరచూ కొందరు రైల్వే ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే ఎంఎంటీఎస్‌ రైలు తలుపుల వద్ద ప్రమాదకరంగా నిలబడి కొందరు యువతులు ఫోన్‌ మాట్లాడుతూ కనిపించారు.

Tags :

మరిన్ని