News in pics : చిత్రం చెప్పే విశేషాలు (22-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 22 Apr 2024 04:46 IST
1/10
వరంగల్‌ అబ్బనికుంట ప్లాటినం జూబ్లీ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన స్పేస్‌ వాక్‌ సింఫనీ(అంతరిక్ష నడక నమూనా) కార్యక్రమం ఆకట్టుకుంది. అంతరిక్షంలో సూర్యుడు, చంద్రుడు, తదితర గ్రహాల గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

2/10
హైదరాబాద్‌: ఈనెల 23న హనుమాన్‌ జయంతి సందర్భంగా విద్యుత్తు దీపాల ధగధగల మధ్య మెరుస్తున్న సికింద్రాబాద్‌  సిఖ్‌ విలేజ్‌ రహదారులు.

3/10
హైదరాబాద్‌: బండరాళ్లు కదా అని వాటిని అలాగే వదిలి వేయలేదు. వాటిపై వన్యప్రాణుల బొమ్మలు వేయడంతో పాటు.. చుట్టూ పచ్చటి మొక్కలు పెంచుతుండటం ఆకట్టుకుంటోంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్‌ చెరువు కూడలి వద్ద కనిపించిన దృశ్యం.

4/10
డిచ్‌పల్లి-నిజామాబాద్‌ ప్రధాన రహదారి నడ్‌పల్లి సమీపంలో రోడ్డు పక్కనున్న రావి చెట్టు ఆకులు మొత్తం ఊదా రంగులో కనిపిస్తున్నాయి. పక్కనున్న ఇతర చెట్ల పత్రాలు పచ్చగా కనిపించగా.. ఈ వృక్షం భిన్నంగా కనిపించడంతో వాహనదారులు ఆసక్తిగా తిలకిసున్నారు.

5/10
తమిళనాడు: ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై ఐసీఎఫ్‌ రైలు మ్యూజియంలో జరుగుతున్న మినీ రైళ్ల ప్రదర్శన చివరి రోజు  ఆదివారం నమూనాలను ఆసక్తిగా తిలకిస్తున్న సందర్శకులు.

6/10
తమిళనాడు: మహవీర్‌ జయంతి సందర్భంగా చెన్నై పెరంబూర్‌లో  వర్ధమాన మహావీరుడి విగ్రహం, జెండాతో ఊరేగింపు నిర్వహిస్తున్న జైన మతస్థులు.

7/10
మెదక్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వారాంతపు సెలవు రోజు కావడంతో ఉమ్మడి జిల్లా వాసులతో పాటు పరిసర జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, జంటనగరాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.

8/10
కడప: వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టాభిరాముడి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామికి వైభవంగా పుష్పయాగం నిర్వహించారు. పరిమళ శోభితంతో కనువిందు చేస్తున్న 12 రకాల రంగురంగుల పుష్పాలతో 12 పర్యాయాలు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల రామనామ స్మరణలతో కార్యక్రమం నిర్వహించారు.

9/10
చిత్తూరు: తిరుపతి శ్రీకోదండ రామస్వామి తెప్పోత్సవాలు ఆదివారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు విద్యుదీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతారామ లక్ష్మణులు ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు.

10/10
కరీంనగర్‌: గంగాధర మండలం మధురానగర్‌లో ఆదివారం పోచమ్మ బోనాల పండుగను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇంటికి రెండు బోనాల చొప్పున దాదాపు 300 కుటుంబాలు డప్పుచప్పుళ్ల మధ్య గుడి వద్దకు చేరుకున్నాయి. అనంతరం పట్నం వేసి  పూజలు చేశారు.

Tags :

మరిన్ని