News in pics : చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 23 Apr 2024 04:18 IST
1/10
హైదరాబాద్‌: చిత్రంలో కనిపించే మట్టికుండతో చల్లని గాలి కూడా వస్తుంది. కుండలో నీరుపోసి.. దానిపై తక్కువ విద్యుత్తుతో నడిచే ఫ్యాన్‌ను అమర్చి ఈ ఎయిర్‌కూలర్‌ను తయారు చేశారు తాళ్లగడ్డకు చెందిన కుమ్మరి ప్రభాకర్‌. గది ఉష్ణోగ్రతను 7 డిగ్రీలకుపైగా తగ్గిస్తుందని చెబుతున్నాడు.

2/10
ఖమ్మం: డిసెంబరులో ములకలపల్లి - పాల్వంచ ప్రధాన రహదారిలో ఆనందాపురం సమీపంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు ఆకు రాల్చి కేవలం కొమ్మలతోనే ఉన్నాయి.. ప్రస్తుతం అవే చెట్లు చిగురించి పచ్చని ఆకులతో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి.

3/10
హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ రోటరీ పార్కు చివర బతుకమ్మ ఘాట్‌ పక్కనే నీళ్లలో ఉన్న రాళ్ల మీదకి కొందరు సందర్శకులు వెళ్లి సెల్‌ఫోన్‌తో చిత్రాలు తీసుకుంటున్నారు.  ఏమాత్రం అదుపుతప్పినా ప్రాణాలకే ప్రమాదం.

4/10
విశాఖపట్నం: నర్సీపట్నంలో రెండేళ్లకోసారి నిర్వహించే మరిడి మహాలక్ష్మి జాతర ప్రారంభమైంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి పెద్ద జాగారం నిర్వహించారు. భారీగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను  ఆకట్టుకున్న

5/10
మహబూబ్‌నగర్‌: నల్లమల అభయారణ్యం జనసంద్రమైంది. పరమశివుడిని ప్రసన్నం చేసుకొనేందుకు భక్తజనం బారులుదీరారు. మండుటెండలు.. రాళ్లూ రప్పలు.. చెట్లు చేమల్ని లెక్కచేయక జనం సాహసయాత్రే చేశారు. కొండ లోయల్లో లింగమయ్య దర్శనంతో పులకించిపోయారు. మూడు రోజులపాటు నిర్వహించే సలేశ్వరం జాతర సోమవారం ఘనంగా ప్రారంభమైంది.

6/10
తమిళనాడు: వేసవి తాపానికి సేదతీరడానికి కోవై కుట్రాళం జలపాతానికి పర్యాటకులు వరుస కడుతున్నారు. దీంతో జలపాతం వద్ద సందడి నెలకొంది. జలపాతాల్లో నీరు ఎక్కువగా వస్తుండటంతో పిల్లలు, పెద్దలు ఉల్లాసంగా గడుపుతున్న

7/10
నెల్లూరు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హనుమంత వాహనంపై సత్యభామా సమేత వేణుగోపాలుడి అభయం.

8/10
తమిళనాడు: నగరంలో ఎండ వేడిమి రోజురోజుకు పెరుగుతోంది. గిండీలోని స్నేక్‌ పార్కులో జంతువులకు ఉపశమన చర్యలు చేపడుతున్నారు. పార్కులోని గ్రీన్‌ ఇగ్వానాలపై నీటిని స్ప్రే చేస్తున్న సిబ్బంది  తాబేళ్లకు ఆహారం..  దాహం తీర్చుకుంటున్న వానరం.

9/10
హైదరాబాద్‌: భానుడు భగభగ మండుతున్నాడు. ఎండ ధాటికి ప్రజలు, జంతువులు విలవిలలాడిపోతున్నాయి. నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో జంతువులకు ఎండ నుంచి ఉపశమనానికి అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. వాటికి ఎండ నుంచి ఉపశమనానికి కూలర్లు, తట్లు, తాటి ఆకులు కప్పి ఉంచుతున్నారు.

10/10
రమేశ్, మహమూద్‌.. ఒకరు ప్రమాదంలో చేయి కోల్పోయారు.. మరొకరికి అనారోగ్యంతో కాళ్లు చచ్చుపడిపోయాయి. ఇద్దరు హైదరాబాద్‌ పాత బస్తీకి చెందిన వారే. నిరు పేదలు కావడంతో   కుటుంబాలకు భారమయ్యారు. చాదర్‌ఘాట్‌   కూడలిలో ఇలా బిక్షాటన చేస్తూ కనిపించారు.

Tags :

మరిన్ని