News in pics : చిత్రం చెప్పే విశేషాలు (24-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 24 Apr 2024 04:29 IST
1/8
హైదరాబాద్‌: కనులవిందుగా పచ్చదనం పరుచుకున్నట్టుగా కనిపిస్తోందీ కదూ. వాస్తవమేమిటంటే.. ఏళ్లుగా హుసేన్‌ సాగర్‌లో కలుషిత నీరు, పరిశ్రమల వ్యర్థ జలాలు కలుస్తూనే ఉంది. ఎండలకు నీరు ఇలా పచ్చగా మారి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది.

2/8
ఆదిలాబాద్‌: సొనాల నుంచి టివిటి మీదుగా బోథ్‌కు వెళ్లే దారిలో పచ్చని జొన్న పంటలో ఓ మామిడి చెట్టు మోడువారి చూపరులను ఆకట్టుకుంటోంది. మోడు వారిన చెట్టు చుట్టూ జొన్న పంట ఉండటంతో ఆకుపచ్చని పొలాల మధ్యన ఎండిన చెట్టు అటు వైపుగా వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

3/8
హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌ సర్వీసు రోడ్డు నుంచి యాదాద్రి భువనగిరి వరకు వరంగల్‌ జాతీయ రహదారి ప్రధాన రోడ్డు మధ్యలో అందమైన రంగురంగుల పూలమొక్కలు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పచ్చని గోడను కట్టారా.. అన్నట్లు అనుభూతి చెందేలా చేస్తున్నాయి.

4/8
కరీంనగర్‌: ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారు సూర్యరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. యజ్ఞాధీకులు సీతారామచార్యుల, శేషం రామయ్య, వంశీధార చార్యులు, ఆలయ ఈవో సుధాకర్‌ పాల్గొన్నారు.

5/8
కర్నూలు: నగరంలోని లలితాపీఠం వద్ద ఆంజనేయస్వామి విగ్రహానికి పీఠాధిపతి సుబ్బుస్వామి, కాణిపాక వినాయక దేవాలయం ట్రస్టు సభ్యుడు హరినారాయణ స్వామి, బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ టి.ప్రతాప్‌రెడ్డి తదితరులు మంగళవారం ప్రత్యేక పూజలు చేసి హనుమాన్‌ శోభాయాత్ర ప్రారంభించారు. చిన్నారుల కోలాటం, ద్విచక్రవాహన ర్యాలీ, భజన తదితర కార్యక్రమాలు అలరించాయి.

6/8
హైదరాబాద్‌: పౌర్ణమిని పురస్కరించుకుని బల్కంపేట ఎల్లమ్మను బంగారు పట్టుచీర, దీపాలు, పూలు, ఫలాలతో మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది.

7/8
పక్షులు అల్లాడిపోతున్నాయి. ఒక్కోసారి నీరు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ తరుణంలో వాటి దాహం, ఆకలి తీర్చేందుకు మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ ఉన్నత పాఠశాల విద్యార్థులు సరికొత్త ప్రయత్నం చేయడం విశేషం. తెలుగు ఉపాధ్యాయుడు ఆంజాగౌడ్‌ ఆలోచనతో 8, 9వ తరగతి విద్యార్థులు దీన్ని ఆచరణలోకి తెచ్చారు.

8/8
నెల్లూరు: మర్రిపాడులో మంగళవారం తెదేపా అత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మర్రిపాడు- రంగసముద్రం రహదారిపై తెదేపా, భాజపా, జనసేన ఎన్నికల గుర్తులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రంగవల్లి స్థానికులను ఆకట్టుకుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు