News in pics : చిత్రం చెప్పే విశేషాలు (17-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 17 May 2024 03:37 IST
1/8
నెల్లూరు: వేసవి సెలవులు.. ఆపై ఆలస్యంగానైనా క్రీడా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో గురువారం ఆకాశంలో మబ్బులు ఏర్పడి ఎండ తీవ్రత కాస్త తగ్గింది. పెద్దలు పిల్లలను తీసుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అటు క్రీడా శిక్షణ శిబిరం.. ఇటు నెల్లూరులోని చిల్డ్రన్స్‌ పార్కు కళకళలాడింది.

2/8
అనంతపురం: పట్టణంలో గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై ఉభయ దేవేరుల సమేత లక్ష్మీచెన్నకేశవస్వామి కొలువుదీరి పురవీధుల్లో ఊరేగారు.ఈ కార్యక్రమాలను కోనేరాచార్యులు, బాబుస్వామి, భానుప్రకాష్, చక్రధర్‌లు నిర్వహించారు.

3/8
మెదక్‌: కొండాపూర్‌ మండలం మారేపల్లిలోని లక్ష్మీనారాయణ ఆలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన గురువారం మహిళలు కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో సమర్పించారు. అనంతరం వైకుంఠపురం ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

4/8
విశాఖపట్నం: ఎస్‌.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం గురువారం లభ్యమైంది. నదిలో కొందరు వ్యక్తులు ఎడ్లబళ్లకు ఇసుక తవ్వుతుండగా పురాతన విగ్రహం బయటపడింది. అక్కడున్న వారంతా విగ్రహాన్ని బయటకు తీసి చూడగా, నూకాంబిక అమ్మవారి విగ్రహంగా గుర్తించారు. విగ్రహం లభించిన ప్రదేశంలోనే ఉంచగా, బసవపాడుకు చెందిన మహిళలు అమ్మవారికి పూజలు చేశారు.

5/8
ప్రకాశం: వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతిని ఒంగోలు గాంధీరోడ్డులోని అమ్మవారి దేవస్థానంలో గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే రంగారాయుడు చెరువు నుంచి 108 మంది మహిళలు అభిషేక జలంతో కూడిన కలశాలతో గాంధీరోడ్డు మీదుగా ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.

6/8
నల్గొండ: గురువారం నాంపల్లి మండలకేంద్రంలోని ఓ ఇంటి ఆవరణలో దాహార్తి తీర్చుకోవడానికి కుళాయి వద్ద గిజిగాడు పక్షి నానా తంటాలు పడుతూ చేస్తున్న విన్యాసాలు ‘న్యూస్‌టుడే’ కంటపడ్డాయి.

7/8
మెదక్‌: సిద్దిపేట మార్కెట్‌యార్డులో ధాన్యం కోసం ఖాళీ సంచులు తెచ్చి పెట్టారు. యార్డులో అక్కడక్కడా పడిన వడ్ల గింజలను ఏరుకొని తినటానికి సమూహంగా పావురాలు ఎగిరివచ్చాయి. ఒక్కసారిగా వర్షం ప్రారంభమై చినుకులు పక్షుల మీద పడటంతో అవి ఎగిరెళ్లి పోయాయి. సిద్దిపేట మార్కెట్‌యార్డులో కనిపించిన దృశ్యమిది.

8/8
ఖమ్మం: తల్లాడ-సత్తుపల్లి ప్రధాన రహదారిలో తల్లాడకు సమీపంలోని ఓ మామిడి తోటలో చెట్టు కొమ్మను నరికారు. గొడ్డలి కాటు వద్దనే ఆ కొమ్మ చిగురించి కాతపడింది. ఆ కొమ్మకు ఆరు మామిడికాయలున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

Tags :

మరిన్ని