News in pics : చిత్రం చెప్పే విశేషాలు (18-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 18 May 2024 09:05 IST
1/20
1947 సెప్టెంబరు 2న నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో 13 మంది ఉద్యమకారులు అమరులయ్యారు. దీనికి స్మారక చిహ్నంగా పరకాలలో నిర్మించిన అమరధామం వద్ద ఉద్యమకారుల విగ్రహాలు ఉద్యమ పంథా వైపు సాగున్నట్లు  ఇలా సరికొత్తగా కనిపించాయి. 1947 సెప్టెంబరు 2న నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో 13 మంది ఉద్యమకారులు అమరులయ్యారు. దీనికి స్మారక చిహ్నంగా పరకాలలో నిర్మించిన అమరధామం వద్ద ఉద్యమకారుల విగ్రహాలు ఉద్యమ పంథా వైపు సాగున్నట్లు ఇలా సరికొత్తగా కనిపించాయి.
2/20
ప్రకృతిలో అప్పుడప్పుడు కనిపించే సుందర దృశ్యాలు కమనీయంగా ఉంటాయి. శుక్రవారం సాయంత్రం వేళ నల్గొండ పరిసర ప్రాంతంలో నీలి, ఎరుపు రంగు ఆకాశంతో కూడిన సుందర ప్రకృతి దృశ్యాన్ని ’న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది. ప్రకృతిలో అప్పుడప్పుడు కనిపించే సుందర దృశ్యాలు కమనీయంగా ఉంటాయి. శుక్రవారం సాయంత్రం వేళ నల్గొండ పరిసర ప్రాంతంలో నీలి, ఎరుపు రంగు ఆకాశంతో కూడిన సుందర ప్రకృతి దృశ్యాన్ని ’న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.
3/20
బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా భరిస్తారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తెను హాస్టల్‌లో చేర్పించేందుకు నగరానికి వచ్చిన కుటుంబం ఇది. భర్త చేతికి గాయమై కట్టు ఉండటంతో ఆ మహిళ స్వయంగా బిడ్డ ట్రంకు పెట్టెను మోస్తూ వెళుతున్న ఈ దృశ్యం హైటెక్‌ సిటీ వద్ద కనిపించింది. బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా భరిస్తారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తెను హాస్టల్‌లో చేర్పించేందుకు నగరానికి వచ్చిన కుటుంబం ఇది. భర్త చేతికి గాయమై కట్టు ఉండటంతో ఆ మహిళ స్వయంగా బిడ్డ ట్రంకు పెట్టెను మోస్తూ వెళుతున్న ఈ దృశ్యం హైటెక్‌ సిటీ వద్ద కనిపించింది.
4/20
ఉద్యోగులు కాసేపు నిద్రపోతే  మరింత సమర్థంగా విధులు నిర్వహిస్తారనే ఆలోచనతో కొన్నేళ్ల క్రితమే పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశాయి. హైదరాబాద్‌లోని నార్సింగిలో జరిగిన తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ 10వ జాతీయ సదస్సులో దీన్ని ప్రదర్శించారు.

5/20
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింపన్న రమేష్‌ దంపతులు రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. కొంతైనా కాపాడుకుందామనే తాపత్రయంతో ఇలా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు.

6/20
విజయవాడ నగరం మీదగా వెళ్లే రెండు జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌65, ఎన్‌హెచ్‌16) కలుపుతున్న ప్రసాదంపాడు- కానూరు ప్రధాన రోడ్డు దుస్థితి ఇది. ప్రసాదంపాడు నుంచి కేవలం ఒక కి.మీ దూరంలో అడుగడుగునా ఏర్పడిన గుంతలు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

7/20
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం తాడిచెర్లలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం

8/20
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం తాడిచెర్లకు చెందిన రైతు పేరాల నిరంజన్‌కు చెందిన రెండెకరాల వరి పంట వర్షానికి నేలవాలింది. రూ.30 వేలకు పైగా నష్టమొచ్చిందని ఆయన వాపోతున్నారు 

9/20
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పలువురు సినీ దర్శకులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్‌డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి రావాలని సీఎంను ఆహ్వానించారు. చిత్రంలో దర్శకులు హరీశ్‌శంకర్, అనిల్‌ రావిపూడి, వీరశంకర్‌ కాంగ్రెస్‌ నేత రోహిణ్‌రెడ్డి

10/20
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్‌ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌) పుస్తకాన్ని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. చిత్రంలో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, గాదరి బాలమల్లు

11/20
ఇది పంట భూమి కాదు.. గుండ్లకమ్మ జలాశయం. నీటి నిల్వలు అడుగంటడంతో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెం సమీప రైతులు జలాశయంలో గడ్డి సాగు చేస్తున్నారు. పొలాల వరకూ నీరందకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేరుగా జలాశయంలోనే సాగు చేపట్టారు. 

12/20
 గుండ్లకమ్మ జలాశయం. నీటి నిల్వలు అడుగంటడంతో ముంపులో ఉన్న గ్రామాలు ఒక్కోటి బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని ఘడియపూడి, గార్లపాడు, కొరిశపాడు మండలానికి చెందిన రెండు గ్రామాలు 15 ఏళ్ల తర్వాత బయటికి కనిపిస్తున్నాయి. 

13/20
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను హైదరాబాద్‌కు చెందిన జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్రీలంక తడిభూముల్లో మనుగడ సాగించే శ్రీలంక బ్యాక్డ్‌ ఫ్రాగ్‌ (కప్ప) జాతి దేశంలో రెండు శతాబ్దాల క్రితమే కనుమరుగైందని వారు తెలిపారు. 

14/20
సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో హఠాత్తుగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. హుస్నాబాద్‌ మండలంలో వర్షం కురిసింది. చేగుంట మండలం కర్నాలపల్లి ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఎండ, చినుకుల కలయికతో ఇంద్రధనుస్సు ఏర్పడి మురిపించింది.  

15/20
నిజామాబాద్‌ జిల్లాలో  గత మూడు నెలలుగా ఎండల తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కురిసిన  వర్షాలతో  ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో  ఉపశమనం పొందుతున్నారు.

16/20
విజయనగరం: సంతకవిటిలో శుక్రవారం ఆకాశంలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. సూర్యోదయానికి ముందు మేఘావృతమై ఉండటం, సూర్యుడు మేఘాల చాటునుంచి తన వెలుగులు విరజిమ్ముతూ వస్తున్నప్పుడు ఈ దృశ్యాలు కనువిందు చేశాయి.

17/20
నీలి వర్ణంలో మెరిసిపోతున్న సాగర జలాలు... వాటిపై ప్రయాణిస్తున్న భారీ నౌక...  విశాఖ తీరంలో సందర్శకులను ఆకట్టుకున్నాయి. తేమ ప్రభావంతో ఇటీవల వరకూ కనుచూపు మేర కడలి స్పష్టంగా కనిపించలేదు.  

18/20
విశాఖ తీరంలో శుక్రవారం సముద్రం, ఆకాశం ఒక్కటైనట్టుగా నీలి వర్ణంలో పర్యాటకులను కనువిందు చేశాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన ఈ ప్రకృతి రమణీయ దృశ్యాన్ని సందర్శకులు తమ కెమెరాలు, చరవాణుల్లో చిత్రీకరించారు.

19/20
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో  భాగంగా అమ్మవారు ధనలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చారు. సుమారు రూ.6 లక్షల కొత్త నోట్లతో సుందరంగా అలంకరించారు. 

20/20
 ఇటీవల అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడినా ఎండలు మండిపోతున్నాయి.  ఎండలు, కీటకాల నుంచి పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు చీరలతో, పరదాలతో రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు.

మరిన్ని