News in pics : చిత్రం చెప్పే విశేషాలు (19-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 19 May 2024 10:20 IST
1/20
ఆధునిక ప్రపంచంలో ఆలోచనలూ మారాయి. కృష్ణా జిల్లా  పమిడిముక్కలలో తాటి చెట్టు ఎక్కలేక జేసీబీని తీసుకొచ్చి.. దానికి ఊయల కట్టి అందులో కూర్చొని ఓ యువకుడు తాటికాయలు కోస్తున్న దృశ్యం ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది.

2/20
అమ్మో బాపు గారి బొమ్మో... ఓలమ్మో మల్లెపూల కొమ్మో... అని యువత మదిలో గిలిగింతలు రేపిన... ప్రముఖ నటి ప్రణీత విజయవాడలో సందడి చేసింది.  ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె చిరునవ్వులతో.. చూపరులను కట్టిపడేసింది.

3/20
వరంగల్‌ జిల్లా ఖానాపురం శివారులోని పాత వంతెన సమీపంలోని మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలిపోవడంతో నీరు ఉవ్వెత్తున పైకి లేచింది. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా తెల్లని నురగలతో ఉప్పొంగడంతో స్థానిక యువకులు స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు. వరంగల్‌ జిల్లా ఖానాపురం శివారులోని పాత వంతెన సమీపంలోని మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలిపోవడంతో నీరు ఉవ్వెత్తున పైకి లేచింది. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా తెల్లని నురగలతో ఉప్పొంగడంతో స్థానిక యువకులు స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు.
4/20
అందాల తార రాశీఖన్నా హైదరాబాద్‌ నగరంలో సందడి చేసింది. బంజారాహిల్స్‌లోని ఓ నగల దుకాణానికి విచ్చేసిన ఆమె విభిన్న రకాల డిజైన్ల ఆభరణాలను ధరించి హొయలు పోయింది. 

5/20
ఒడిశాలోని పర్లాఖెముండి పట్టణంలోని గజపతి క్రీడామైదానం ప్రాంతంలో గల దామోదర్‌ బిహార్‌ కాలనీలో నివసిస్తున్న సిగ్మా మిశ్రా ఇంట్లో  మే పుష్పం వికసించింది. కాలనీవాసులు ప్రజలు వాటిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

6/20
మదురై జిల్లా తిరుమంగళం సమీపం పెరుమాళ్‌ కోవిల్పట్టి గ్రామంలోని కరుంపారై ముత్తయ్య ఆలయంలో పురుషులు మాత్రమే పాల్గొనే తిరునాల వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పొంగలి నైవేద్యంగా పెట్టి ఆరాధించారు. 

7/20
వేసవి శిక్షణ శిబిరాల్లో చిన్నారులు ఆటల్లో  ఆరితేరారు. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ కొనసాగుతుండటంతో చిన్నారులు క్రికెట్‌ శిక్షణపై మక్కువ చూపుతున్నారు.  హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో బ్యాటింగ్‌లో శిక్షణ తీసుకుంటూ కనిపించారిలా.. 

8/20
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. ప్రస్తుతం ఇసుక, మట్టిదిబ్బలతో దర్శనమిస్తోంది. 

9/20
మల్కాజిగిరి, తూర్పుఆనంద్‌బాగ్‌ డివిజన్ల పరిధిలో  వర్షం కురిసింది. కాలనీల్లోని రహదారులు జలమయం అయ్యాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు వానలో తడిసిపోయారు. రహదారి పక్కన చిరువ్యాపారులకు రక్షణ లేక ఇబ్బందిపడ్డారు.

10/20
చుట్టూ ట్యాంక్‌బండ్‌.. మధ్యన జలాశయంలో బోటింగ్‌.. పైన తీగల వంతెనపై విహారం.. వెరసి ఖమ్మంలోని లకారం చెరువు పర్యాటకులకు ఉల్లాసాన్ని.. ఆహ్లాదాన్ని పంచుతోంది. 

11/20
మెదక్‌: పట్టణంలో శనివారం వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పల్లకీ ఊరేగింపులో కేరళ నృత్య కళాకారిణులు ఆటపాటలతో అలరించారు.

12/20
సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లిలో తల్లిదండ్రులు తాము పొలంలో పనులు చేస్తూనే వాటిని ఎలా చేయాలో పిల్లలకు నేర్పిస్తున్నారు. ఒకరు నాగలి పట్టి దున్నడం.. మరో ఇద్దరు కలుపు తీస్తూ కనిపించారిలా..

13/20
విశాఖపట్నం: పాండురంగాపురంలో ఒకరు తన ఆటోను ఇలా పచ్చదనంతో చూడచక్కగా మార్చారు. ఆటో చుట్టూ, పైన పచ్చదనం నిండేలా ప్రత్యేక మ్యాట్‌ కుట్టించారు. సాధారణ ఆటోలకన్నా భిన్నంగా..ప్రయాణికులను ఆకర్షించేలా ఉంది కదూ ఈ ఆటో.

14/20
హైదరాబాద్‌: సాత్విక స్కూల్‌ ఆఫ్‌ భరతనాట్యం, కర్ణాటిక్‌ మ్యూజిక్‌ (హైదరాబాద్‌) ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో సాంస్కృతికోత్సవం నిర్వహించారు. నాట్యగురువులు కమలా నేమాని, డా.ఎస్‌.ఎస్‌ సత్యల శిష్యులు భరతనాట్యంలో విభిన్న అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

15/20
అనంతపురం: సత్యసాయి జీవిత ఘట్టాలను చిన్నారులు నృత్యరూపంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. సాయికుల్వంత్‌ మందిరంలో  చైన్నె బాలవికాస్‌ చిన్నారులు  ‘సత్యసాయి లీలామృతం’’ నృత్య నాటికను అద్భుతంగా ప్రదిర్శంచారు.

16/20
అనంతపురం: పట్టాలపై నడవాల్సిన రైలు బండి రోడ్డుపై వెళ్తూ చూపరులను ఆకట్టుకుంది. శనివారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద రోడ్డుపై వెళ్తోన్న టైర్ల రైలును వాహనదారులు ఆసక్తిగా గమనించారు.

17/20
హైదరాబాద్‌: బోడుప్పల్‌ పెంటారెడ్డికాలనీలోని మాతా నిమిషాంబికాదేవి అమ్మవారి అవతరణ వేడుక శనివారం ఆలయంలో వైభవంగా నిర్వహించారు.అమ్మవారిని బంగారుతాపడంతో రజిత చీర, కిరీటం, హస్తాలు అలంకరించారు.

18/20
అనంతపురం జిల్లాలోని పలు ఆలయాల్లో శనివారం వాసవీమాత జయంతి ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ధర్మవరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో బంగారు చీరతో వాసవీమాతను కొలువుదీర్చారు. 

19/20
విశాఖపట్నం: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమాను శనివారం రంపచోడవరం మార్కెట్‌లో చిత్రీకరించారు. పెద్దఎత్తున చుట్టుపక్కల వారు రావడంతో సందడి నెలకొంది.

20/20
నిజామాబాద్‌ గ్రామీణ మండలంలోని ఆకుల కొండూర్‌ శివారులో తీసిన చిత్రమిది. వాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మించారు. ప్రస్తుతం వాగులో నీరు కనబడకుండా మొత్తం గుర్రపుడెక్కతో నిండిపోయింది.

Tags :

మరిన్ని