News in pics: చిత్రం చెప్పే విశేషాలు (20-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 20 May 2024 09:53 IST
1/25
విశాఖ జిల్లా పాడేరు పట్టణంలో ఆదివారం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వర్షం కురవడంతో మేఘాలు కమ్ముకున్నాయి. కొండల నడుమ విస్తరించిన మంచు మేఘాలు ఆకట్టుకున్నాయి. ఇంద్ర ధనస్సు విరిసి చూపరుల మది దోచుకుంది. 

2/25
 విశాఖ జిల్లా రాజవొమ్మంగిలో ఆదివారం ఉదయం ఆకాశం ఎర్రటి, పసుపు వర్ణంలో అందంగా ఉంది. మధ్యాహ్నం నీలపు నింగిలో తెల్లని మేఘాలతో, సాయంత్రం బంగారు వర్ణపు ఆకాశంలో నల్లని మబ్బులతో కనువిందు చేసింది.

3/25
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేట ప్రాంతంలో మామిడి చెట్టు విరగ్గాసింది. జగ్గిన్ని ధనుంజయ్‌ ఇంటి వద్ద సువర్ణరేఖ రకం చెట్టులో ప్రతీ కొమ్మకు కాయలు దిగడం చూపరులను ఆకట్టుకుంటోంది. 

4/25
సామాజిక మాధ్యమాల్లో లైకుల కోసం బైకులతో  కొందరు ఆకతాయిలు పలు విన్యాసాలు చేన్నారు. వీరి చేష్టలతో మిగతా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌కోట ప్రధాన దారిలో కనిపించిన దృశ్యమిది.

5/25
భూగర్భ జలాలు ప్రమాదకరంగా అడుగంటిన ప్రస్తుత తరుణంలో ఖమ్మం గ్రామీణం మండలం చిన్నతండాలోని ఈ వందేళ్ల చరిత్ర కలిగిన  పురాతన బావిలో స్థానికులు పదుల సంఖ్యలో మోటార్లను  ఏర్పాటు చేసి నీటిని తరలించుకుంటున్నారు. 

6/25
స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలం నుంచి ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. ఫలితంగా రాత్రి వేళ.. పట్టపగలును తలపించింది. 

7/25
జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన సన్న ధాన్యం మొత్తం ఇలా మొలకెత్తాయి.  

8/25
అన్నవరం సత్యనారాయణస్వామి కొండ వెలుగులతో నిండి పోయింది. ఆదివారం స్వామి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్తు దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. 

9/25
తూర్పుగోదావరి: ఉప్పలగుప్తం మండలం రాఘవులపేట వంతెన వద్ద సముద్ర తీరంలో నదీ పాయల వద్ద ఆదివారం కనిపించిన చిత్రమిది. ఒకే సమయంలో రెండు దిక్కుల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు అక్కడి వారిని ఆకర్షితులను చేశాయి.

10/25
మెదక్‌: రోజూ మధ్యాహ్నం వరకు మార్తాండతేజుడై వెలుగొందే సూర్యుడు.. సాయంత్రం ఆవుతుండగానే ఆకాశంలోని దట్టమైన మబ్బులకు తేజస్సును తగ్గించి.. కొత్త రంగులో దర్శనమిచ్చాడు. ఎర్రని, గుండ్రని పండులాంటి భాస్కరుడు చేర్యాల పట్టణం ఆకాశంలో ప్రజలకు కనిపించి మురిపించాడు.

11/25
విశాఖపట్నం: చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని చెరువులవెనంలో మంచు అందాలు పర్యటకులను అబ్బురపరిచాయి. మన్యంలో కొద్దిరోజులుగా భిన్నమైన వాతావరణం నెలకొంటోంది.దూరప్రాంతాల నుంచి పరిమిత సంఖ్యలో పర్యటకులు వచ్చారు. ఇక్కడి మంచు అందాలను ఆస్వాదించారు.

12/25
హైదరాబాద్‌: వేసవిలోనూ ఆకుపచ్చటి పందిరిలా ఆకట్టుకుంటోంది ఈ మార్గం. పచ్చటి వృక్షాల కింద చల్లటి ప్రయాణం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్‌-వికారాబాద్‌ మార్గంలో రెండు కిలోమీటర్ల మేర వృక్షాలు ప్రయాణికులను వావ్‌.. అనిపిస్తున్నాయి.

13/25
కరీంనగర్‌: ఊటూర్‌ నుంచి పచ్చునూర్‌ రహదారిపై ఉన్న చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 30 ఏళ్ల క్రితం గ్రామస్థులు రహదారికి ఇరువైపులా మొక్కలు నాటగా.. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి.

14/25
కర్నూలు: చినుకులు కురవడంతో నల్లమల కొత్త అందాలను సంతరించుకుంటోంది. పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతోంది.శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రాంతం అమ్రాబాద్‌ వరకు ఉన్న నల్లమల అడవుల గుండా వాహనాల్లో వస్తున్న ప్రయాణికులు ఆ సోయగాలను చూసి ఆనందపరవశులవుతున్నారు.

15/25
మెదక్‌: పట్టణ పరిధిలోని సంగారెడ్డి రోడ్డులోని రాంచంద్రాపూర్‌ చెరువు సమీపంలో ఓ రావిచెట్టు ఎండలకు ఇటీవల ఎండిపోయింది. తరవాత కురిసిన అకాల వర్షాలకు చిగురించి పచ్చదనాన్ని సంతరించుకుంది.

16/25
హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని నార్నే కూడలిలో జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన బొమ్మలు సుందరీకరణలో భాగంగా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి షాపింగ్‌ చేసి ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వస్తున్న బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అవి జీవం ఉట్టిపడేలా ఉండడంతో అందరినీ ఆకట్టుకున్నాయి.

17/25
హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో ఆదివారం రాత్రి ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ ఆధ్వర్యంలో దర్శకుల దినోత్సవాన్ని ‘(డైరెక్టర్స్‌ డే) ఘనంగా జరిపారు. వేడుకలో ముఖ్యఅతిథిగా నటులు అల్లు అర్జున్, నాని, అడవి శేషు, కార్తికేయ, అల్లరి నరేష్, దర్శకులు పాల్గొన్నారు. నృత్యాలతో సందడి చేశారు.

18/25
హైదరాబాద్‌: వేసవి సెలవులు కావడం, వాతావరణం చల్లబడంతో పర్యాటక ప్రదేశాలకు  పోటెత్తుతున్నారు. చార్మినార్‌ పరిసరాలు రాత్రి 10 గంటల వరకు కళకళలాడాయి. సుమారు ఆరువేల మంది సందర్శించారు. యువతులు గాజులు, దుస్తులు, అలంకరణ సామగ్రి కొనుగోలు చేశారు. స్వీయచిత్రాలు దిగి సందడి చేశారు.

19/25
కడప: స్థానిక వాసవీమాత వనంలో ఆదివారం రాత్రి అమ్మవారి తెప్పోత్సవం కనులపండువగా జరిగింది.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో అమ్మవారికి తెప్పోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆర్యవైశ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

20/25
శ్రీకాకుళం నగరం పీఎన్‌ కాలనీలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం వార్షిక కల్యాణోత్సవాల్లో ఆదివారం శ్రీవారిని వజ్ర కవచాలతో అలంకరించారు. కల్యాణ వేదికపై భూనీల సమేత వెంకటేశ్వరస్వామి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

21/25
కర్నూలు: రైలు ఇంజిన్‌ను బెంగళూరు నుంచి తరలిస్తున్న లారీ డోన్‌ సమీపంలోని భారత్‌ డాబా వద్ద బెంగళూరు - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వెళ్తుండగా న్యూస్‌టుడే క్లిక్‌మనిపించింది. లారీనెక్కిన రైలింజన్‌ అంటూ అటువైపుగా వెళ్లే ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.

22/25
మెదక్‌: గిజిగాడు పక్షులు సాధారణంగా సామూహికంగా ఎత్తుగా ఉన్న చెట్లపై గూడు కట్టుకుంటాయి.చెట్టుకు పదుల సంఖ్యలో వేలాడే ఆ గూళ్లు చూపరులకు ఆనందం కలిగిస్తాయి. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలోని ఎల్లమ్మ గుడి వద్ద ఈత చెట్టుకు గూళ్లు కట్టుకున్నాయి.

23/25
మెదక్‌: సిద్దిపేట కోమటిచెరువులో తామర మొక్కలు విస్తారంగా పెరిగి ఆక్రమిస్తున్నాయి. నీరు కనబడనీయకుండా తామరాకులు నిండా పర్చుకున్నాయి. కోమటిచెరువుకు వచ్చే సందర్శకులు చూసి చరవాణుల్లో బంధిస్తున్నారు. వేలాదిగా మొక్కలు ఉన్నా పూలు లేకపోవడం గమనార్హం.

24/25
విశాఖపట్నం: ఆదివారం సెలవు కావడంతో ఆర్కే బీచ్‌లో సేద తీరేందుకు పర్యాటకులు, నగర వాసులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడం సందర్శకుల తాకిడి మరింత పెరిగి బీచ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అలలతో ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు.

25/25
కరీంనగర్‌: దూర ప్రాంతాల్లో ప్రయాణించే బస్సుల్లో టీవీలు ఉండటం చూసే ఉంటారు. కానీ నగరంలో ఓ వ్యక్తి తన ఆటోలో చిన్న టీవీ ఏర్పాటు చేయడం విశేషం. ఆటోల్లో డెక్‌ పాటలకు కాలం చెల్లడంతో, ఇప్పుడు కొత్తగా ప్రయాణికుల వినోదం, ఆనందం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Tags :

మరిన్ని