చిత్రం చెప్పే విశేషాలు (21-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 21 May 2024 03:20 IST
1/10
వరంగల్‌: వరి కోతలు కోసేటప్పుడు గడ్డి చిందర వందరగా పడుతోంది.. దాన్ని కట్టలు కట్టి వాముగా చేయడం కష్టతరమే.. ఈ పనినీ యంత్రాలే చేస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలోని ఓ రైతు పొలంలో యంత్రంతో చుట్టిన గడ్డి కట్టలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

2/10
ఆదిలాబాద్‌: మండలంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ప్రస్తుతం దారి వెంట వచ్చి పోయే వారికి చల్లదనంతోపాటు విరబూసిన పువ్వులతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.మండలంలోని జూనోని, పాఠన్, సోన్‌కాస్, పొనాల రహదారులు అరుణ వర్ణంతో మెరిసిపోతున్నాయి.

3/10
నిజామాబాద్‌: అల్లాపూర్‌ నుంచి పిట్లం వెళ్లే మార్గంలో అక్కడక్కడ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు ప్రయాణికులకు కనువిందు చేస్తున్నాయి. పిట్లం - బాన్సువాడ మార్గంలో రూంతండా వద్ద ఉన్న చెట్లకు పువ్వులు విరగబూశాయి. ప్రయాణికులు వాటి వద్ద ఆగి స్వీయ చిత్రాలు తీసుకొని సంబరపడుతున్నారు.

4/10
చిత్తూరు: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను భక్తులు సోమవారం పెద్దఎత్తున దర్శించుకున్నారు. చిన్నాపెద్ద తేడాలులేక అన్ని వయసులవారు వేషాలు ధరించి గంగమ్మ గుడికి చేరుకుంటున్నారు.నగరమంతటా ఎక్కడ చూసినా జాతర సందడి నెలకొంది.

5/10
శ్రీకాకుళం: మర్రిచెట్టుకు అరటిగెలలు కట్టిన ఈ దృశ్యం కోటబొమ్మాళి మండలం కురుడు పంచాయతీ చౌదరికొత్తూరు గ్రామంలో సోమవారం ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది.త్రినాథుల స్వాముల ఉత్సవాలు ఈ ఏడాది ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం భక్తులు గ్రామంలోని మర్రిచెట్టుకు అరటిగెలలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.

6/10
వేసవి సెలవులను వృథా చేయకుండా కొందరు బాలికలు కర్రసాములో శిక్షణ తీసుకుంటున్నారు. ఏటా సెలవుల్లో నిజామాబాద్‌ బాలభవన్‌లో విద్యార్థులకు వివిధ విభాగాల్లో తర్ఫీదు ఇస్తుంటారు. అందులో భాగంగా కర్రసాముపై బాలికలు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అలా ప్రతిరోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేర్చుకుంటున్నారు.

7/10
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సోమవారం ప్రారంభమైంది. నగరంలోని పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు పెద్దసంఖ్యలో రావడంతో సందడి కనిపించింది. తాగునీరు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించడంతో పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 387మందికి 260మంది పరీక్ష రాశారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

8/10
రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్‌ రంజన్లకు మంచి గిరాకీ ఉంది. ఇక్కడి నుంచే పలు రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. పట్టణంలో ఎక్కడికక్కడ రహదారులపై వీటిని ఉంచి పోటీపడి మరి అమ్మకాలు చేస్తున్నారు.

9/10
హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ పోలీసులు హిమాయత్‌నగర్‌ లిబర్టీ కూడలిలో వాహనదారుల కోసం సుమారు వంద మీటర్ల విస్తీర్ణంలో చలువ పందిరి (గ్రీన్‌ షేడ్‌) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తద్వారా వాహనదారులకు ఎండవేడి నుంచి కాసేపు ఉపశమనం దొరుకుతుందని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

10/10
హైదరాబాద్‌: కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ల వాహనాలు నిలిపే స్థలమిది.  ఇక్కడ 108 అంబులెన్స్‌ను నిలిపారేంటి అనుకుంటున్నారా.. ఎండ, ఉక్కపోతకు ఇందులోని అత్యవసర మందులు పాడవుతున్నాయి.  అధికారుల అనుమతితో ఇలా నీడపట్టున ఉంచారు.

Tags :

మరిన్ని