News in pics: చిత్రం చెప్పే విశేషాలు (10-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 10 Jun 2024 11:39 IST
1/21
అయోధ్య రామమందిరంలో శ్రీరాముడికి సమర్పించేందుకు దాతల వితరణతో తయారు చేయించిన 15 కేజీల వెండి ధనస్సు, ఒక కిలో బరువుగల బాణానికి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో విజయదుర్గా పీఠంలో పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్‌) పూజలు చేశారు.

2/21
ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మృతికి తుని పట్టణం రాజా హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు శేషగిరిరావు స్పందించారు. ఇటు కలం, అటు కుంచె విలపిస్తున్నాయంటూ ఆయన చిత్రం వేసి రామోజీకి నివాళులు అర్పించారు. 

3/21
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని గుడిపాడులోని ఎస్సీ కాలనీలో నీటి ఇబ్బందులు వర్ణించలేనివి. కాలనీలో 150 వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి. కేవలం నీటి కోసమే పనులు మానుకుని నిరీక్షించాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

4/21
పిల్లలపై తండ్రికి ప్రేమ ఉండొచ్చు.. పిల్లలు గోము చేయొచ్చు... కానీ అది అతి కాకూడదు. స్కూటీపై ముందుభాగంలో ఒకరు, వెనుక భాగంలో ఇద్దరిని, భుజాలపై మరొకరిని కూర్చోపెట్టుకుని ప్రయాణించడం మైదుకూరులోని ప్రొద్దుటూరురోడ్డులో కనిపించింది. 

5/21
వీధిలో వర్షపు నీరు నిలిచి.. రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో ఇలా మోటారు పెట్టి నీటిని తోడుతున్నారు. నెల్లూరు జిల్లా బిట్రగుంటలోని బోగోలు పెద్ద పంచాయతీ పరిధిలో తహసీల్దారు కార్యాలయానికి వెళ్లే రోడ్డు ఇది.

6/21
ఈనాడు అధినేత రామోజీరావు మృతి తెలుగు జాతికే తీరని లోటని సైకత శిల్పి గేదెల హరికృష్ణ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వరస్వామి కొండ వద్ద రామోజీరావు సైకత శిల్పం రూపొందించి నివాళులర్పించారు. 

7/21
జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్‌లో ఆదివారం బొచ్చ జాతికి చెందిన 35 కేజీల బరువున్న చేప రూ.13 వేలు పలికింది. దీన్ని కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో పట్టి విక్రయానికి తెచ్చినట్లు వ్యాపారి లక్ష్మణరావు తెలిపారు. 

8/21
తిరుపల్లి జిల్లాలోని  శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన అందాల కొలనులో అరవిరిసిన పద్మాలు చూపరుల మనసుకెంతో హాయిని కలిగిస్తున్నాయి. 

9/21
ఆదివారం సాయంత్ర కురిసిన వర్షానికి తిరుమల మీదుగా ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనస్సు ఆకట్టుకుంది. మొదటి ఘాట్‌రోడ్డు మీదుగా కిందకు దిగే భక్తులు ఈ సుందర దృశ్యాన్ని తమ చరవాణుల్లో బంధించి సంతోషం వ్యక్తం చేశారు.

10/21
విశాఖ జిల్లా రాజవొమ్మంగి మండలంలో కొన్ని మొక్కలు, పుష్పాల పైన లేత గులాబి రంగులో హృదయాకారం, వినాయక, శివలింగాకృతిలో ఉన్నాయి. చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 

11/21
అక్షర యోధుడు రామోజీరావుకు విశాఖ అంతటా ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు విశాఖ నగరంలో చాలాచోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగులను ఏర్పాటు చేశారు. రామోజీరావు చిత్రపటాల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు భాషకు వన్నె తెచ్చిన మహనీయుడంటూ కొనియాడారు. 

12/21
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో అభిమానులు వినూత్నంగా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ వంటి ఫ్లైక్సీని స్థానిక 26వ వార్డు లలితానగర్‌లో ఏర్పాటు చేసి అభిమానులు సంబరపడ్డారు.

13/21
విశాఖ ఆర్కే బీచ్‌ తీరం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. అలలతో ఆడుతూ ఉత్సాహంగా గడిపేవారు కొందరైతే సెల్ఫీల సరదాలో ప్రమాదాలు కొనితెచ్చుకునేవారు మరికొందరు. భారీ అలలను సైతం లెక్క చేయకుండా బండరాళ్లపైకి చేరి సెల్ఫీలు తీసుకుంటున్నారు.

14/21
దేశ ప్రధానిగా మూడో సారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు బ్రహ్మచారి.. రావి ఆకుపై చిత్రం వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

15/21
కోయంబత్తూరులో ఆదివారం ఉదయం కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ సందర్భంగా ఒకేసారి రెండు ఇంద్రధనస్సులు ఏర్పడి నగరవాసులను అబ్బురపరిచాయి.

16/21
మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి బహుమతిగా అందజేసేందుకు జమ్మూ-కశ్మీర్‌కు చెందిన నగల వ్యాపారి రింకూ చౌహాన్‌ మూడు కిలోల స్వచ్ఛమైన వెండి ఉపయోగించి భాజపా చిహ్నమైన కమలం పువ్వును తయారు చేశారు. 

17/21
నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురస్తుండటంతో రైతులు పొలం బాట పట్టారు. వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. మర్రిగూడ మండలంలోని రాజపేట గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబం అరక దున్నుతూ విత్తనాలు నాటుతుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

18/21
వరంగల్‌ జిల్లా జనగామ మండలం వెంకిర్యాల ఐకేపీ కేంద్ర నిర్వాహకులు మాత్రం మిగిలిన వందలాది సంచులను ఇలా వదిలేశారు. వర్షాలకు తడిసి పూర్తిగా పాడైపోయాయి. ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.  

19/21
చిన్నపాటి వర్షాలకే మెదక్‌ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో కొన్ని కాలనీలు జలమయం అవుతున్నాయి. సరైన కాల్వలు లేకపోవడంతో కొన్ని రోజుల వరకు సీసీ రోడ్డుపై నీరు నిల్వ ఉంటోంది. దీంతో వర్షం నీటిలోనే గ్రామస్థులు నడుస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. 

20/21
కర్ణాటక : వేదావతి (హగరి) పైభాగాన కురిసిన వర్షాలతో నది నిండుగా ప్రవహిస్తుంది. ఆరు నెలలుగా అడుగంటిన హగరి నదిలో నీటి ప్రవాహంపై పరిసర గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

21/21
మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీకి గంజాం జిల్లా హింజిలి సమీపంలోని కొంటెయికొళి గ్రామానికి చెందిన కళాకారుడు అరుణ్‌ కుమార్‌ సాహు కలపపై ఆయన ఆకృతిని తీర్చిదిద్ది శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని