మీనాక్షి చౌదరి

హీరోయిన్‌ మీనాక్షి చౌదరి గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 11 Jan 2024 12:32 IST
1/12
‘గుంటూరు కారం’తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది మీనాక్షి. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన చిత్రమిది.

2/12
రాజి అనే కీలక పాత్రలో అలరించనుంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజాహెగ్డే, శ్రీలీల ఎంపికయ్యారు.

3/12
అనివార్య కారణాల వల్ల పూజాహెగ్డే ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లడంతో ఆమె స్థానంలో శ్రీలీల నటించింది. రెండో నాయికగా మీనాక్షి ఎంపికైంది.

4/12
‘మీనాక్షి అప్పుడే ఫుల్‌ బిజీ అయిపోయింది. ఎప్పుడైనా డేట్స్‌ ఇస్తే మా సినిమాలోకి తీసుకుంటాం’ అని త్రివిక్రమ్‌ 2021లో ఓ ఈవెంట్‌లో సరదాగా అన్నారు. కట్‌చేస్తే, ‘గుంటూరు కారం’తో నిజమైంది.

5/12
‘గుంటూరు కారం’ సెట్స్‌లోకి వెళ్లిన తొలిరోజే మహేశ్‌తో కలిసి నటించడంతో టెన్షన్‌ పడిందట. ఆ సమయంలో సపోర్ట్‌ చేసినందుకు హీరోపై ఓ సందర్భంలో ప్రశంసలు కురిపించింది.

6/12
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఖిలాడి’, ‘హిట్‌ 2’ చిత్రాల్లోనూ సందడి చేసింది. ‘కొలై’ (తెలుగులో హత్య)తో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది.

7/12
ప్రస్తుతం.. ‘మట్కా’, ‘లక్కీ భాస్కర్‌’, ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’, ‘వీఎస్‌ 10’ (వర్కింగ్‌ టైటిల్‌) తదితర చిత్రాల్లో నటిస్తోంది.

8/12
కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలనే నియమం పెట్టుకుంది. అశ్లీల సీన్స్‌లో కనిపించకూడదని నిర్ణయించుకుని, ఎన్నో అవకాశాలను తిరస్కరించింది.

9/12
స్వస్థలం: హరియాణాలోని పంచ్‌కులానీ. ‘నటి మీనాక్షి శేషాద్రికి మా నాన్న వీరాభిమాని. అందుకే నాకు ఆ పేరు పెట్టారు’ అని చెప్పింది.

10/12
‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొనమని అమ్మ దరఖాస్తు చేసింది. చుట్టు పక్కలవారు, బంధువులు విమర్శించినా అమ్మ నన్ను పోత్సహించింది’ అని తెలిపింది.

11/12
బీడీఎస్‌ చదువుతూనే.. మోడలింగ్‌ చేసేది. అలా ‘ఔట్‌ ఆఫ్‌ లవ్‌’ వెబ్‌సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. యూట్యూబ్‌లో చూసి క్యాట్‌వాక్‌ నేర్చుకుంది. ఫెమినా మిస్‌ ఇండియా హరియాణా విజేతగా (2018) నిలిచింది.

12/12
‘బీడీఎస్‌ పూర్తి చేసి డాక్టర్‌ మీనాక్షి అనిపించుకున్నా. మిస్‌ ఇండియా పోటీలకూ వెళ్లా. ఐఏఎస్‌కావాలనే కోరిక మాత్రం అలానే ఉంది. ఏదో ఒక సినిమాలో కలెక్టర్‌గా కనిపించి ఆనందిస్తా’ అని అంటోంది.

మరిన్ని