Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా

చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపులతోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి ‘ఆ ఒక్కటీ అడక్కు’లోని సిద్ధి పాత్రతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

Updated : 02 May 2024 15:09 IST
1/12
స్కూల్‌డేస్‌లో సమ్మర్‌ క్యాంపులకు వెళుతూ యాక్టింగ్‌, పెయింటింగ్‌, డాన్స్‌ వంటివి నేర్చుకునేది. టెన్త్‌ తరవాత హోమ్‌ స్కూలింగ్‌ పద్ధతిలో ఇంటర్‌ చదువుకుంటూనే.. పెయింటింగ్‌, సాహిత్యం క్లాసులకు హాజరయ్యేది.

2/12
ఆసక్తి కొద్దీ హైదరాబాద్‌లోని పలు థియేటర్‌ గ్రూప్స్‌తో కలిసి నాటకాల్లో పాల్గొనేది. లయోలా కాలేజీలో మాస్‌ కమ్యూనికేషన్స్‌ చేస్తున్నప్పుడు.. ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ని కలిసింది. అలా ఆడిషన్‌కు వెళ్లి, ‘జాతిరత్నాలు’ సినిమాకి ఎంపికైంది.

3/12
‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’, ‘రావణాసుర’ తర్వాత ఆమె నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. అల్లరి నరేశ్‌ హీరో. మే 3న విడుదల కానుంది.

4/12
తెలుగులో చూసిన మొదటి సినిమా ‘వర్షం’. అందులో త్రిష నటనకీ, అందానికీ ఫిదా అయిపోయింది. హీరోల విషయానికొస్తే ఫహాద్‌ ఫాజిల్‌కి వీరాభిమాని.

5/12
సైకో పాత్రలో నటించాలనేది డ్రీమ్‌. తన దృష్టిలో ప్రతికూల పాత్రల్లో నటించడమే అసలైన సవాలు.

6/12
‘‘ఏ పనీ పూర్తి చేయను. అన్నీ మధ్యలో ఆపేస్తుంటా. ఓ పుస్తకం తీశాననుకోండి... సగం చదివి పక్కన పెట్టేస్తా. ఏదైనా నేర్చుకోవాలనుకుంటా. కొన్నిరోజులకే అదీ మానేస్తుంటా’’ అని ఓ సందర్భంలో బలహీనతల గురించి చెప్పింది.

7/12
‘‘నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. వెళ్లిన ప్రతిచోటా ఆహారం, సంప్రదాయాల గురించి తెలుసుకుని వివరంగా రాసుకోవడం అలవాటు. ఆ విశేషాలతో ఓ పుస్తకం రాయాలనేది నా కోరిక’’ అని తెలిపింది.

8/12
‘‘నాకు నటన, డాన్స్‌ అంటే ఎంతో ఆసక్తి. కథక్‌, హిప్‌హాప్‌, బెల్లీ, ఫ్రీస్టయిల్‌, వెస్టర్న్‌ డాన్స్‌లు వచ్చు. సినిమాల్లో అల్లు అర్జున్‌, ఐశ్వర్యారాయ్‌, మాధురీ దీక్షిత్‌లు డాన్స్‌ చేస్తుంటే అలా చూస్తుండి పోవాలనిపిస్తుంది’’ అని చెప్పింది.

9/12
‘‘నాకు ఓల్డ్‌ సిటీ స్ట్రీట్‌ ఫుడ్‌ చాలా ఇష్టం. బిర్యానీ, గాజర్‌ హల్వా, డబల్‌ కా మీఠా, గులాబ్‌జామూన్‌ ఎంతిష్టమో. చూస్తే తినకుండా అసలు ఉండలేను’’ అని పేర్కొంది.

10/12
11/12
12/12

మరిన్ని